Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు చక్కెర ఉన్న పదార్థాలను తినకూడదని అంటారు. పండ్లలో కూడా సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి పండ్లను కూడా ఎక్కువగా తినకూడదని చాలామంది భావిస్తారు. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు కొన్ని రకాల పండ్లను తినడం చాలా అవసరం. ఇది వారికి శక్తిని అందించడంతో పాటు మధుమేహం అదుపులో ఉంచుతుంది. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. అలాంటి ఆహారాలలో పండ్లు కూడా ఒకటి. ఇవి సమతుల ఆహారంగా భావించవచ్చు. అయితే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకొని తినడం మధుమేహ రోగులకి అత్యవసరం. ఆ పండ్లు ఏంటో తెలుసుకోండి.


యాపిల్స్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మంచి జరుగుతుంది. అలాగే దీనిలో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. యాపిల్ తొక్కతో పాటు తింటే పాలిఫెనాల్ సమ్మేళనాలు శరీరంలో చేరుతాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెరస్థాయిలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రోజుకో యాపిల్ తినడానికి ప్రయత్నించండి.


అరటిపండును తినేందుకు మధుమేహరోగులు భయపడతారు. నిజానికి రోజుకు ఒక అరటిపండును హ్యాపీగా తినవచ్చు. దీనిలో పిండి పదార్థాలు, క్యాలరీలు, ఫైబర్ ఉంటాయి. అలాగే పొటాషియం, విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. అయితే అరటి పండ్లు బాగా పండిపోయాక చక్కెర ఎక్కువైపోతుంది. అలా బాగా పండిన అరటి పండ్లను డయాబెటిస్ రోగులు తినకూడదు. మధ్యస్థంగా పండిన వాటిని తింటే మంచిది. దీనిలో ఉండే పొటాషియం గుండెను కాపాడుతుంది.


స్ట్రాబెర్రీలు ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తున్నాయి. దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహరోగులు స్ట్రాబెర్రీలను ఎన్ని తిన్నా మంచిదే.


పేదవాడి పండుగా జామ పేరు తెచ్చుకోండి. దీనిలో లైకోపీన్, విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి. దీనిని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. రోజుకో జామపండును తింటే ఆరోగ్యపరంగా మంచిది. పేగు కదలికలను కూడా ఇది పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.


దానిమ్మ పండ్లు సీజన్‌తో సంబంధం లేకుండా దొరుకుతాయి. దీనిలో కూడా చక్కెర ఎక్కువగానే ఉంటుంది. అలా అని తినడం మానేయాల్సిన అవసరం లేదు. రోజుకో పండుు మనం తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల టైప్2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఉపవాసం ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన వాటిల్లో దానిమ్మ ఒకటి. ఇది గుండె సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.


Also read: ఎండు కొబ్బరిని తింటే ఈ సమస్యలన్నీ దూరం









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.