Lakshmi Puja Mantram: మీరెన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదా? మీరెన్ని గుడులు గోపురాలు తిరిగినా మీ సమస్యలు మిమ్మల్ని ఇంకా బాధిస్తూనే ఉన్నాయా? ఎంతో మంది జ్యోతిష్యులను కలిసినా మీ తలరాత మారడం లేదా? మీరెంత కష్టపడ్డా మీ సంపాదన అంతంత మాత్రంగానే ఉందా? అయితే ఇలా చేసి చూడండి దెబ్బకు మీ కష్టాలు పరార్‌ అవుతాయి. మీ సమస్యలన్నీ సద్దుమణిగి పోతాయి. మీ భవిష్యత్తు రాకెట్‌ లా అభివృద్ది పథంలోకి దూసుకుపోతుంది. మీ జీవితం హ్యాపీగా ఉంటుందని పండితులు చెప్తున్నారు.


ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు. జీవితంలో స్థిరత్వం కోసం కొందరు కష్టపడితే.. మరికొందరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో  కృషి చేస్తుంటారు. అయితే కొంత మంది కొద్దిపాటి కష్టంతోనే  జీవితంలో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుంటారు. మరికొందరు ఎంత కష్టపడైనా వారి గోల్‌ను రీచ్‌ అవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం జీవితంలో  ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. ఇటువంటి వారి జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది.  అరకొర జీతాలతో.. జీవితాలను నెట్టుకొస్తూ.. కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసమే మన పూర్వికులు ఎన్నో రెమిడీస్‌ చెప్పారు. వారు చెప్పిన పరిష్కార మార్గాలను తూచా తప్పకుండా పాటిస్తే కష్టాల కడలిని దాటడమే కాదు తమ భవిష్యత్తు బంగారు మయం అవుతుందని మంత్ర శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.


మనుషులకు కష్టాలు సర్వ సాధారణం. కానీ ఆ కష్టాల నుంచి గట్టెకెందుకు మన పూర్వీకులు అపూర్వమైన శాస్త్రాలను మనకోసం మన భవిష్యత్తు తరాల కోసం అందించారు. వాటిలో మంత్ర శాస్త్రం, తంత్రశాస్త్రం, శ్లోకాలు, సహస్ర నామాలు, అష్టకాలు లాంటివి ఎంతో ముఖ్యమైనవి.  వీటిలో  కొన్ని లిఖిత పూర్వకంగా మనకు అందుబాటులో ఉంటే.. మరికొన్ని వంశపార్యపరంగా.. ఇంకొన్ని గురుశిష్యపరంగా లభిస్తున్నాయి.  లిఖితపూర్వకంగా ఉన్నవి అందిరికీ అందుబాటులో ఉంటాయి. కానీ వంశపార్యపర్యంగా.. లేదా గురుశిష్యపరంపరలో ఉన్న రెమిడీస్‌ చాలా తక్కువ మందికి అందుబాటులో ఉంటాయి. అలాంటి రెమిడీస్‌నే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.


ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని భక్తి పూర్వకంగా ఆచరిస్తే మీ కష్టాలు, బాధలు దూరమవ్వడమే కాకుండా మీ సకల దరిద్రాలు దూరమవుతాయని మంత్రశాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈ మంత్ర జపాన్ని నియమానుసారం పాటించాలి. ఇప్పుడు చెప్తున్న నియమాల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా ఈ మంత్రం ఫలించదు. మీరనుకున్న ఫలితాలు రావని ద్విజులు చెప్తున్నారు. ముందుగా తెల్లవారుజామునే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకున్నాక శుభ్రంగా స్నానం చేసి తెల్లని బట్టలు వేసుకుని మీ ఇంట్లో దేవుని దగ్గర తూర్పు ముఖంగా తెల్లని ఆసనం  వేసుకుని కూర్చోవాలి. దేవుడికి దీపం వెలిగించి ధూపం వేయాలి. తర్వాత మనఃస్ఫూర్తిగా ఆ దేవ దేవుడైన శివుడే మీ గురువుగా భావించి.. మంత్ర జపం మొదలు పెట్టాలి. మొత్తంగా 36 రోజుల పాటు రోజూ 21 మాలలతో ఈ మంత్రాన్ని జపించాలి. అయితే జపానికి స్పటిక మాల ఉపయోగించడం చాలా శ్రేయస్కరం అని పండితులు చెప్తున్నారు. ఒకవేళ స్పటిక మాల దొరకని పక్షంలో (స్ఫటిక మాల చాలా ఖరీదైనది. అది  అందరికీ అందుబాటులో ఉండదు.) అందువల్ల స్ఫటిక మాల వీలుకాని సాధకులు తామర పూసల మాలతో జపం చేసుకోవచ్చు.


ఈ సాధనలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మొదటి రోజు ఏ సమయానికి అయితే మంత్ర జపాన్ని ప్రారంభిస్తారో మిగిలిన అన్ని రోజులూ అదే సమయానికి జపాన్ని ప్రారంభించాలి. ఈ విషయంలో సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ మంత్ర జప ప్రారంభ సమయాన్ని మార్చితే.. జప ఫలితాలు కూడా మారిపోతాయని పండితులు తెలిపారు. కాబట్టి మంత్ర జప సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


మంత్రం : 'ఐం శ్రీం హ్రీం క్లీం'


ఈ మంత్రం ఎంతో మహిమ కలది. ఇందులో ఉన్న ఈ నాలుగు అక్షరాలూ శ్రీశ్రీశ్రీ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క నాలుగు బీజాక్షరాలు.  ఈ నాలుగు బీజాక్షరాలను కలిపి జపించటం వల్ల అత్యంత శక్తి జనరేట్‌ అవుతుందని, దీంతో దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడని పండితులు చెప్తున్నారు. సో ఇక మీ కష్టాలు కడతేరే సమయం వచ్చింది. ఓ మంచిరోజు చూసుకుని ఈ జప సాధన ప్రారంభించండి.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 


Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply