Sukumar remuneration for Pushpa 2: దర్శకుడు సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 'పుష్ప' విడుదల ముందు వరకు తక్కువ ఉండేది. 'పుష్ప : ది రైజ్' కోసం ఆయన తొలిసారి 25 కోట్ల రూపాయల చెక్ అందుకున్నారు. ఇప్పుడు 'పుష్ప : ది రూల్'కి గాను ఫస్ట్ పార్ట్ కోసం తీసుకున్న దాని కంటే నాలుగు రేట్లు ఎక్కువ సుక్కు అందుకుంటున్నారని ఫిల్మ్ నగర్ ఖబర్. 


రాజమౌళి తర్వాత వంద కోట్ల క్లబ్బులో సుకుమార్!
Rajamouli Remuneration: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడు ఎవరు? అంటే... మరో సందేహం లేకుండా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు చెప్పవచ్చు. 'బాహుబలి'కి ఆయన భారీ అందుకున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రానికి అయితే వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ రూపంలో రాజమౌళి తీసుకున్నారని టాక్. తెలుగులో ఆ తర్వాత ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నది సుకుమారే అని టాక్. 


Also Readకోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా? 


'పుష్ప 2' కోసం కొంత అమౌంట్, ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే మొత్తంలో కొంత వాటా తీసుకునేలా సుకుమార్, నిర్మాతల మధ్య డీల్ జరిగిందట. ఇటీవల 'పుష్ప 2' డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించారు. ఆ డీల్ తర్వాత సుకుమార్ రెమ్యూనరేషన్ లెక్కకడితే వంద కోట్లు దాటిందని టాక్.


Also Readఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?


'పుష్ప 2' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీని కంటే ముందు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప : ది రైజ్' కాకుండా 'రంగస్థలం' నిర్మించారు. ఆ రెండు సినిమాలకు లాభాలు వచ్చాయి. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉప్పెన 'కు కూడా వసూళ్లు బాగా వచ్చాయి. సుక్కుతో వాళ్ళకు మంచి మైత్రి ఏర్పడింది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply



Pushpa The Rise Shooting Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ఇతర ఆరిస్టులు పాల్గొనగా కీలక సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా (Rashmika Mandanna) మరోసారి సందడి చేయనున్నారు. ఇంకా సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట రికార్డులు క్రియేట్ చేసింది. 'పుష్ప' భారీ విజయం సాధించడంతో 'పుష్ప 2' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.