Animal Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ మూవీ ట్రైలర్ కత్తిపోట్లు, బుల్లెట్ల వర్షంతో రక్తసిక్తంగా మారిపోయింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్, కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం అలరించింది. ఈ ట్రైలర్ తో వయెలెన్స్ అంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు సందీప్.


24 గంటల్లో 71.4 మిలియన్ వ్యూస్ సాధించిన ‘యానిమల్’ ట్రైలర్


ఇక ‘యానిమల్’ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ అందుకుంది. కేవలం 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 71.4 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. హిందీ వెర్షన్ ట్రైలర్ ఇప్పటికే 53 మిలియన్ల వ్యూస్ అందుకుంది. టోటల్ గా ఈ సినిమా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న టాప్ 10 ట్రైలర్స్ లిస్ట్ లో చేరి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.   


‘జవాన్’ రికార్డు బ్రేక్ చేసినా ‘ఆదిపురుష్’ విషయంలో..


‘యానిమల్’ సినిమా ట్రైలర్ ‘జవాన్‌’ ట్రైలర్ రికార్డును బ్రేక్ చేసింది. 24 గంటల్లో ‘జవాన్’ ట్రైలర్ 55 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఈ సినిమా ‘జవాన్’తో పోల్చితే 16 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ట్రైలర్ రికార్డును బద్దలుకొట్టడంతో విఫలం అయ్యింది. ‘ఆదిపురుష్’ సినిమా ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 74 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా యష్ ‘KGF: చాప్టర్ 2’ టాప్ ప్లేస్ లో నిలిచింది. రాకీ భాయ్ మూవీ 24 గంటల్లో ఏకంగా 106.5 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది.  


24 గంటల్లో అత్యధికంగా వ్యూస్ సాధించిన టాప్ 10 ట్రైలర్స్ ఇవే


1. KGF: చాప్టర్ 2 – 106.5 మిలియన్


2. ఆదిపురుష్ - 74 మిలియన్


3. యానిమల్ - 71.4 మిలియన్


4. రాధే శ్యామ్ - 57.5 మిలియన్


5. జవాన్ - 55 మిలియన్


6. RRR - 51.1 మిలియన్


7. తు ఝూతి మెయిన్ మక్కార్ - 50.9 మిలియన్


8. సాహో - 49 మిలియన్


9. సర్కస్ - 45 మిలియన్


10. సామ్రాట్ పృథ్వీరాజ్ - 43.8 మిలియన్


డిసెంబర్ 1న ‘యానిమల్’ విడుదల


ఇక ‘యానిమల్’ సినిమా డిసెంబర్ 1 న విడుదల అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్కీ కౌశల్ ‘సామ్ బహదూర్‌’ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతోంది. ‘యానిమల్’ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.   



Read Also: కాస్త ఓపిక పట్టండి - నెక్ట్ట్స్ మూవీపై యష్ రియాక్షన్ ఇదే!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply