AP Telangana Latest News: నేడు తిరుమలకు ప్రధాని మోదీ, కేంద్ర బలగాలతో పటిష్ఠ బందోబస్తు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (నవంబర్ 26) తిరుమలకు రానున్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీసు ఉన్నత ఉన్నతాధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్న క్రమంలో తిరుమల వ్యాప్తంగా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రముఖులు బస చేసే అతిథి గృహాలను ఇప్పటికే ఎన్ ఎస్ జీ బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. ప్రధాని ఏ మార్గాలు అయితే ప్రయాణిస్తారో ఆ మార్గాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆ స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు, అవన్నీ మేమే గెలుస్తాం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్ల స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గోషామహల్‌ సహా ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామని చెప్పారు. తెలంగాణ భవన్ లో ఆదివారం మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీని నిలువరించే శక్తి కేవలం బీఆర్‌ఎస్‌ కు మాత్రమే ఉందని.. ప్రధాని మోదీని ప్రశ్నించే ధైర్యం, దమ్ము రేవంత్‌ రెడ్డికి లేదని అన్నారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే జరుగుతున్నాయనడం సరికాదని, బీఆర్‌ఎస్‌ నాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'బీఆర్ఎస్ పాలనలో అవస్థలు, అవమానాలు తెలుసు' - ప్రజా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు  బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మీకు జరిగిన అవమానాలు  తనకు తెలుసునని చెప్పారు. ప్రభుత్వ పాలనకు స్థానిక ప్రజా ప్రతినిధులే పునాదులని, జెడ్పీటీసీగా చేసిన తనకు వారి బాధ్యతలు, కష్టాలు తెలుసని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధుల గౌరవం పెంచే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని లేఖలో పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రేపు ఢిల్లీకి చంద్రబాబు, సిద్ధార్థ్ లుత్రా కుమారుడి రిసెప్షన్‌కు హాజరు
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు (నవంబర్ 27)న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు (Chandrababu) హాజరవుతారు. చంద్రబాబు (Chandrababu) వెంట సతీమణి భువనేశ్వరి కూడా వెళ్లనున్నారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు (Chandrababu) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తారు. అదే రోజు రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు. తర్వాతి రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కరీంనగర్‌లో మంత్రి గంగుల గట్టెక్కుతారా? ఈసారి పరిస్థితి అంత ఈజీ కాదు!
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలా నిలిచిన ప్రాంతం కరీంనగర్ (Karimnagar Politics). మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కరీంనగర్‌లో ఎప్పుడూ కారు పార్టీదే హవా.  కానీ ఈ సారి పరిస్థితి అంత ఈజీగా లేదు. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో పట్టు సడలుతోంది. మంత్రి గంగుల గట్టెక్కుతారా లేదా అన్న సందేహం ఆ పార్టీలోనే మొదలైంది. మూడు దఫాలుగా కరీంనగర్ నుంచి ఎన్నికవుతున్న గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కు ఈ సారి గట్టి పోటీనే ఎదురవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి