Matka Movie Regular Shoot From December: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్రూ టే సపరేటు! తనను తాను ఓ ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా చూసుకుంటూ... కంటెంట్ బేస్డ్ కథలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో కొత్త కథతో సినిమా చేయబోతున్నారు. 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో 'మట్కా' చేయడానికి 'ఎస్' చెప్పారు. 


డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు 'మట్కా'
వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'మట్కా' (Matka Movie). హీరోగా ఆయన 14వ చిత్రమిది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్. 'బాహుబలి', 'టెంపర్', 'ఊపిరి' సినిమాలతో పాటు కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేసిన నోరా ఫతేహి మరో కథానాయిక. వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాలోనూ ఆమె స్పెషల్ సాంగ్ చేశారు. 


'మట్కా'పై కొన్ని రోజుల క్రితం పుకార్లు వినిపించాయి. నిర్మాణ వ్యయం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండటంతో పాటు, ఇటువంటి కథాంశాలతో రూపొందే చిత్రాలకు ప్రస్తుతం మార్కెట్ బాలేదని సినిమా కొంత కాలం పక్కన పెట్టాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు పుకార్లు వినిపించాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ సినిమా యూనిట్ అప్డేట్స్ ఇచ్చింది. 


Also Read: చిరంజీవిపై పరువు నష్టం దావా... మన్సూర్ అలీ ఖాన్, త్రిష కేసులో కొత్త ట్విస్ట్ 


'మట్కా' ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతామని నిర్మాతలు వెల్లడించారు. ఫస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ నగరంలో ఓల్డ్ విశాఖను తలపించే భారీ సెట్ ఒకటి రూపొందిస్తున్నామని, అందులో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తామని వివరించారు. పెళ్లి పనుల కోసం కొంత కాలం షూటింగులకు గ్యాప్ ఇచ్చిన వరుణ్ తేజ్... లావణ్యా త్రిపాఠితో ఏడు అడుగులు వేసిన తర్వాత చిత్రీకరణ చేస్తున్న తొలి చిత్రమిది.


Also Readది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?


  


విశాఖ నేపథ్యం... జూదం ప్రధానాంశం!
విశాఖ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్ సినిమా ఉంటుందని నిర్మాతలు సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసినప్పుడు చెప్పారు. ''మట్కా' అనేది ఒక రకమైన జూదం. విశాఖ నేపథ్యంలో 1958-1982 మధ్య కథ జరుగుతుంది. యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటన ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు గెటప్‌లలో చూడబోతున్నాం. వరుణ్ తేజ్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అవుతున్నారు'' అని నిర్మాతలు చెప్పారు. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply


వరుణ్ తేజ్ కథానాయకుడిగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించనున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, 'మైమ్' గోపి, రూప లక్ష్మి, విజయ రామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : కార్తీక శ్రీనివాస్ ఆర్, కళా దర్శకత్వం : సురేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఆర్కే జానా, ఛాయాగ్రహణం : ప్రియా సేత్, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ : వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు : మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.