విడుదలకు 'బెదురు లంక' రెడీ - కార్తికేయ, నేహా శెట్టి థియేటర్లలోకి ఎప్పుడు వస్తారంటే?
'ఆర్ఎక్స్ 100' కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda), 'డీజే టిల్లు' నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. దీనిని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మించారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లేటెస్ట్ ఖబర్ ఏంటంటే... రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చారు. వచ్చే నెల (జూన్)లో 'బెదురులంక 2012' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఈ రోజు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా  థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


తెలుగు హెరిటేజ్ డేగా ఎన్టీఆర్ జయంతి, అమెరికాలో ఫ్రిస్కో మేయర్ కీలక ప్రకటన
మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుక జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వేడులకు వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగర మేయర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. తెలుగు ప్రజలందరూ అన్నగారిగా భావించి గౌరవించే  నందమూరి తారకరామారావు పుట్టిన మే 28వ తేదీని ప్రిస్కో నగర తెలుగు హెరిటేజ్ డే గా నిర్వహించనున్నట్లు ఆ నగర మేయర్ జెఫ్ చేనీ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలందరూ ముందుకు వెళుతున్నారని, ఆయన శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తమ తరఫున ఆయనకు గౌరవార్థంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఒక నగర మేయర్   తెలుగు జాతి గుండెల్లో పెట్టుకున్న మహానుభావుడికి గౌరవార్థంగా తెలుగు హెరిటేజ్ డే గా ఆయన జయంతిని ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రజలు కొనియాడుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సీక్వెల్‌తో ఇస్మార్ట్ కాంబో ఈజ్ బ్యాక్ - పూరి దర్శకత్వంలో రామ్ 'డబుల్ ఇస్మార్ట్'
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath)లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్! వాళ్ళిద్దరూ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సినిమా ఎండింగులోనే దానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాకు 'డబుల్ ఇస్మార్ట్' (Double ISMART Movie) టైటిల్  ఖరారు చేశారు. ఇది 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ అన్నమాట. వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చెప్పారు (Double ISMART Release Date). పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సినిమాను నిర్మిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


భద్రాచల రామయ్యకు వెండితెర రామయ్య 'ఆదిపురుష్' ప్రభాస్ విరాళం
భద్రాచలంలోని రామయ్యకు వెండితెరపై త్వరలో రాముడిగా కనిపించనున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం అందజేశారు. ఆయన ఆత్మీయ మిత్రునితో చెక్కును దేవాలయ అధికారులకు అందజేశారు. భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం (Bhadrachalam Sri Seetha Rama Swamy Temple) ఎంతో ప్రసిద్ధి చెందినది. ప్రతి ఏడాది అక్కడ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. ఆ ఆలయానికి కథానాయకుడు ప్రభాస్ రూ. పది లక్షలను విరాళంగా అందజేశారు. ఈవో రమాదేవికి ప్రభాస్ మేనమామ సత్యనారాయణ రాజు 10 లక్షల చెక్కును అందజేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


వెంకీతో దుల్కర్ సల్మాన్ - అక్టోబర్‌లో సెట్స్‌కు, సమ్మర్‌లో థియేటర్లకు!
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) జన్మతః మలయాళీ అయినప్పటికీ... మన దేశంలో అన్ని భాషల ప్రేక్షకులకూ చేరువైన కథానాయకుడు. ముందు 'మహానటి', ఆ తర్వాత 'సీతా రామం' చిత్రాలతో తెలుగులో భారీ విజయాలను తన సొంతం చేసుకున్నారు. తమిళ అనువాద సినిమా 'కనులు కనులను దోచాయంటే' కూడా తెలుగులో హిట్టే. ఇప్పుడు ఆయన మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. 'తొలిప్రేమ'తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి (Venky Atluri)తో దుల్కర్ సల్మాన్ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి వినబడుతున్న విషయమే ఇది. నేడు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో వంద కోట్ల వసూళ్లు సాధించిన ధనుష్ 'సార్' తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)