'ఆర్ఎక్స్ 100' కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda), 'డీజే టిల్లు' నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. దీనిని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మించారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లేటెస్ట్ ఖబర్ ఏంటంటే... రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చారు. 


వచ్చే నెలలో థియేటర్లలోకి 'బెదురులంక'
Bedurulanka 2012 Release Date : వచ్చే నెల (జూన్)లో 'బెదురులంక 2012' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఈ రోజు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా  థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదీ సంగతి!


'బెదురులంక 2012' చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 'వెన్నెల్లో ఆడపిల్ల...' సాంగ్ విడుదల చేశారు. ఆ గీతానికి కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, జెవి సుధాంశు ఆలపించారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... కార్తికేయ, నేహా శెట్టిల కెమిస్ట్రీ అందంగా ఉంది. ఆ పాటకు వస్తున్న స్పందన పట్ల నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. టీజర్ కూడా ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంటుందని చెప్పారు.


Also Read : భద్రాచల రామయ్యకు వెండితెర రామయ్య 'ఆదిపురుష్' ప్రభాస్ విరాళం






ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువులో...
పాటకు లభిస్తున్న స్పందన పట్ల చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "ప్రేమకథలోని కీలకమైన సందర్భంలో ఈ 'వెన్నెల్లో ఆడపిల్ల...' పాట వస్తుంది. మణిశర్మ గారి బాణీకి తోడు కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్ హైలైట్ అవుతాయి. ఈ పాటను గోదావరి గ్రామంలోని ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువు మధ్య రాత్రి వేళల్లో చిత్రీకరించాం. సినిమాలో హీరో హీరోయిన్ల జోడి చాలా కొత్తగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ సినిమాకు హైలైట్. అలాగే, కామెడీ కూడా'' అని చెప్పారు. 


Also Read సొసైటీ కోసం ప్రెగ్నెంట్ కాలేదు, నాకు నచ్చినప్పుడు, రెడీగా ఉన్నప్పుడు బిడ్డకు జన్మ ఇవ్వాలని... మదర్స్ డేకి ఉపాసన సెన్సేషనల్ పోస్ట్ 







ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా 'బెదురులంక 2012' అని బెన్నీ ముప్పానేని తెలిపారు. ఇప్పటి వరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఈ సినిమా ఉంటుందని, గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' అనేలా ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్ అని గర్వంగా చెబుతామని బెన్నీ పేర్కొన్నారు. 


అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు నటించిన ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల.