Top 5 Headlines Today 14th May 2023: 
 చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ అటాచ్‌ చేసిన ఏపీ ప్రభుత్వం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు   ప్రస్తుతం అమరావతిలో ఉంటున్న గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇది క్రిడ్‌ప్రోకో ద్వారా పొందారన్న కారణంతో చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు అధికారులు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మంత్రిగా నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై సీఐడీ విచారణ కూడా చేయిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటు, సీఆర్డీఏ ప్లాన్ అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


చంద్రబాబు, నారాయణ చేసిన అక్రమాలు కారణంగానే లింగమనేని లబ్ధి పొందారని చెబుతున్నారు. దానికి ప్రతిఫలంగానే కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను చంద్రబాబు పొందారని ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమాలకు అడ్డాగా ఉన్న దాన్ని క్రిమినల్‌ లా అమెండమెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని సీఐడీ కోరినట్టు వివరిస్తున్నారు. సీఐడీ చెప్పినట్టుగానే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు.  స్థానిక న్యాయమూర్తికి దీనిపై సమాచారం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేసినట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


100 కోట్లు మార్కెట్‌ లేని పవన్ సినిమాకు 30 కోట్ల నష్టం ఎలా వస్తుంది? : పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆరు నెలలకోసారి రోడ్లపైకి వచ్చి పవన్ కల్యాణ్‌ చేసే రాజకీయాన్ని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను విమర్శించడమే పనన్ కల్యాణ్ పని అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన్నే విమర్శించేవారని గుర్తు చేశారు. 


జగన్‌ను, ఈ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే ఆరు నెలలకోసారి రోడ్లపైకి వస్తుంటారని పేర్ని నాని ఆరోపించారు. అమరావతిలోని వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన... జనం కోసం పది రోజులైనా పవన్ కల్యాణ్‌ పని చేశారా అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబును మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని పవన్ కల్యాణ్‌ను పేర్ని నాని నిలదీశారు. ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారని క్వశ్చన్ చేశారు. రిజర్వేషన్ అంశంపై వైసీపీ, జగన్ చాలా క్లారిటీతో ఉన్నారని... ఇది కేంద్రం పరిధిలోని అంశమని ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. కాపులను మోసం చేసిన చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్‌ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు.    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


ఈసారి భిన్నంగా తెలంగాణ అవతరణ వేడుకలు, ఏకంగా 21 రోజులు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా, ఈసారి ఉత్సవాలు వైభవంగా ప్రభుత్వం నిర్వహించనుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ కీర్తి చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ తరహాలో 21 రోజుల పాటు ఉత్సవాలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు ఈ సంబురాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల గురించి శనివారం (మే 13) సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిర్ణయించిన ప్రకారం.. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో మొదటిరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు. అదే రోజు మంత్రులు వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


వాపును చూసి బలుపు అనుకోవద్దు, పగటి కలలు కంటున్నారు!
అభివృద్ధి మరిచి మతాలు, దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ పట్ల యావత్ దేశ ప్రజలు విసుగు చెందారనెందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ను తిరస్కరించి కర్ణాటక ప్రజలు బీజేపీ కి చెంపదెబ్బలాంటి తీర్పు ఇచ్చారని అన్నారు. బీజేపీ 40 శాతం కమీషన్ అవినీతి పాలన ఓ వైపు అయితే, మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ.. దేశ సంపద అంతా మోదీ దోస్త్ అదానీకి దారాదత్తం చేశాయని విమర్శించారు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తూ నీచాతినీచ రాజకీయాలకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి 


ఇక కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయా ? పొంగులేటి, జూపల్లి తేల్చుకుంటారా?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి.  ఈ ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీకి జై కొడదామనుకున్న చాలా మంది నేతల  అడుగులు  కాంగ్రెస్ వైపు పడే అవకాశం కనిపిస్తోంది.  అందరికంటే ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన జూపల్లి, పొంగులేటి వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. కర్ణాటక ఎన్నికలఫలితాల తర్వాత జూపల్లి, పొంగులేటి బీజేపీలో చేరాలని డిసైడ్‌ అయ్యారు. వారం క్రితం ఖమ్మంలో బీజేపీ నేతలు పొంగులేటితో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్‌ లో చేరాలనుకున్న ఆలోచన విరమించుకుని ఇద్దరూ బీజేపీలో చేరేందుకు  చర్చలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి