‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన
ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై, సినిమాలపై రాజకీయాల ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల గురించి అంతటా హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్‌ను కాదని చాలామంది సినీ సెలబ్రిటీలు జనసేనకు, టీడీపీ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మూవీ లవర్స్ అందరికీ కామన్‌గా ఒక డౌట్ కలుగుతోంది. ఒకవేళ వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే.. సినీ పరిశ్రమకు ఇబ్బందులు మొదలవుతాయేమో అని. అలా ఆందోళన పడుతున్నవారిలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘శ్రీకాంత్’ మూవీకి పాజిటివ్ టాక్ - తన పర్ఫర్మెన్స్‌తో కలెక్షన్స్ కురిపిస్తున్న రాజ్‌కుమార్ రావు
బయోపిక్స్‌ను తెరకెక్కించడంలో బాలీవుడ్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. అదే అభిప్రాయాన్ని చాలాసార్లు బీ టౌన్ మేకర్స్ నిజం చేశారు కూడా. తాజాగా మరో బయోపిక్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది బాలీవుడ్. ఈసారి ఒక తెలుగు వ్యక్తి బయోపిక్‌తో పాజిటివ్ రివ్యూలను అందుకుంటోంది. అమెరికాకు వెళ్లి చదువుకున్న మొదటి బ్లైండ్ స్టూడెంట్‌గా రికార్డ్ సాధించిన శ్రీకాంత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘శ్రీకాంత్’. తాజాగా విడుదలయిన ఈ మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్స్‌తో ఓపెనింగ్ సాధించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
దండిగా ‘హీరామండి’ రెమ్యునరేషన్స్, దర్శకుడికి ఎంతిచ్చారో తెలిస్తే షాకే!
'హీరామండి : ది డైమండ్ బజార్'. నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతోంది ఈ సిరీస్. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ హిట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన మొదటి వెబ్ సిరీస్ ఇది. ఇక ఈ సిరీస్ లో ఎంతోమంది ప్రముఖ యాక్టర్స్ ఉన్నారు. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, షర్మిన్ సెగల్, రిచా చడ్డ, సంజీద్ షేక్, అదితిరావ్ హైదరీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సిరీస్ కి సంబంధించి, యాక్టర్ల రెమ్యునరేషన్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. వాళ్లు రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నిన్న ఫొటోలు లీక్, నేడు లీగల్ నోటీసులు - నితీష్ తివారీ ‘రామాయణం’ చిత్రానికి తప్పని తిప్పలు
‘రామాయణం’ సినిమాకు సంబంధించి గత కొద్ది రోజులు చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. శ్రీరాముడు, సీతా గెటప్ లో ఉన్న రణబీర్, సాయి పల్లవి ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా మరో పెద్ద సమస్య ఎదురయ్యింది. ఈసారి ఏకంగా చిత్రబృందానికి లీగల్ నోటీసులు అందాయి. వాస్తవానికి ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించాలని భావించారు. కానీ, రీసెంట్ గా వారిద్దరు చిత్ర నిర్మాణం నుంచి వైదొలిగారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఆటోలో షూటింగ్ వెళ్లిన శృతి హాసన్ - మరీ ఇంత డెడికేషనా? అంటూ నెటిజన్ల ప్రశంసలు
సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా బూతద్దంలో పెట్టి చూస్తారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేసిన ఓ పని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అంతేకాదు, ఆమె డెడికేషన్ చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? నెటిజన్లు ఎందుకు ప్రశంసిస్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)