Heeramandi: The Diamond BazaarActors Salaries: 'హీరామండి : ది డైమండ్ బజార్'. నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతోంది ఈ సిరీస్. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ హిట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన మొదటి వెబ్ సిరీస్ ఇది. ఇక ఈ సిరీస్ లో ఎంతోమంది ప్రముఖ యాక్టర్స్ ఉన్నారు. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, షర్మిన్ సెగల్, రిచా చడ్డ, సంజీద్ షేక్, అదితిరావ్ హైదరీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సిరీస్ కి సంబంధించి, యాక్టర్ల రెమ్యునరేషన్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. వాళ్లు రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
200 కోట్లు.. దాంట్లో డైరెక్టర్ కి ఎంతంటే?
స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న వేశ్యలపై ఈ సిరీస్ ని తెరకెక్కించారు. అప్పటి కాలం నాటి నగలు, పరిస్థితులు, దుస్తులు ప్రతీ ఒక్కటి చాలా అంటే చాలా క్లీన్ గా ప్రజంట్ చేశారు సిరీస్ లో. దీంతో బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఇక ఈ బడ్జెట్ లో దాదాపు డైరెక్టర్, యాక్టర్స్ రెమ్యునరేషన్ కోట్లోలో ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది.
ఈ సిరీస్ ని డైరెక్ట్ చేసినందుకు సంజయ్ లీలా బన్సాలీ దాదాపు రూ.70 కోట్ల వరకు తీసుకున్నారట. ఇక నటీనటుల విషయానికొస్తే.. వాళ్లు కూడా భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లు రిపోర్ట్ చెప్తోంది. ఫరీదాన్ క్యారెక్టర్ లో నటించిన సోనాక్షి సిన్హా రూ.2కోట్లు వసూలు చేయగా.. మల్లికాజన్ గా నటించిన మనీషా కొయిరాలా, లజ్జో పాత్ర చేసిన రిచా చడ్డా ఇద్దరు చెరో కోటి రూపాయలు ఛార్జ్ చేశారట. బిబ్బూ జాన్ పాత్రలో నటించిన అదితి రావ్ హైదరికి రూ.1 - 1.5 కోటి వరకు పొందారు. సంజీద షేక్ రూ.40 లక్షలు, సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు షర్మిన్ సెగల్ రూ.30 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఫర్దీన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వగా.. ఆయన దాదాపు రూ.75 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారని బీ టౌన్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది.
18 ఏళ్ల నుంచి వాయిదా పడి..
'హీరామండి' వెబ్ సిరీస్ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సిరీస్ ని లాజ్ ఏంజిల్స్ లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. ఈ సందర్భంగా సంజయ్ లీలా బన్సాలీ దీనికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సిరీస్ 18 ఏళ్ల క్రితమే తీయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు సంజయ్. దీంట్లో ముందుగా బాలీవుడ్ నటులు రేఖ, కరీనా కపూర్, రాణి ముఖర్జీతో తీయాలనుకున్నామని తెలిపారు. కానీ, అవ్వలేదని అన్నారు. పాకిస్తానీ యాక్టర్స్ హహిర ఖాన్, ఫావద్ ఖాన్, ఇమ్రాన్ అబ్బాస్ ని పెట్టాలనుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల ఆలోచన విరమించుకున్నట్లు చెప్పారు. "ఇది 18 ఏళ్ల క్రితమే అనుకున్న ప్రాజెక్ట్ కానీ, కొన్ని కారణాల వల్ల ఆలోచన వెనక్కి వెళ్లిపోయింది. ముందు కొంతమందిని అనుకున్నాం. కానీ వాళ్లు మారిపోయారు. మళ్లీ వేరే యాక్టర్స్ అనుకున్నాం. వాళ్లు మారిపోయారు" అని అన్నారు సంజయ్. అధ్యాయన్ సుమన్, జాన్సన్ షా, తాహా షా బదూషా, శేఖర్ సుమన్ తదితరులు ఈ సిరీస్ లో ఉన్నారు.