‘Anchakkallakokkan’ Full Movie Explained: ‘అంచక్కల్లకొక్కన్‘ అనే సినిమా 1986లో నేపథ్యంలో కొనసాగుతోంది. లుక్మాన్, అవరన్, చెంబన్, వినోద్ జోస్, మణికందన్, ఆచారి, శ్రీజిత్ రవి, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మార్చి 15, 2024లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది.


ఇంతకీ సినిమా కథ ఏంటంటే?


మూవీ ప్రారంభం కాగానే అర్థరాత్రి వేళ చాప్రా( శ్రీజిత్ రవి), పున్నారి రాజన్(అచ్యుతానంద), చిప్పన్‌( బిట్టో డేవిస్)తో కలిసి మద్యం తాగుతుంటాడు. ఆ సమయంలో అడవిలో అడవి పందులను వేటాడుతున్నన శబ్దం వినిపిస్తుంది. తన దగ్గరున్న తుపాకీ తీసుకుని చాప్రా అక్కడున్న వారితో కలిసి అడవిలోకి వెళ్తాడు. కొంత దూరం వెళ్లగానే అడవిపంది వేషంలో ఉన్న ఓ వ్యక్తి చాప్రాను దారుణంగా హత్య చేస్తాడు. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? అని పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చుట్టూనే ఈ మూవీ కథ తిరుగుతుంది.


హత్య జరిగిన మరుసటి రోజు వాసుదేవన్( లుక్మాన్ అవరన్) అనే యువకుడు పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ఆ  గ్రామానికి వస్తాడు. అతడికి భయం ఎక్కువ. రక్తం చూస్తేనే వణికిపోతాడు. అతడు స్టేషన్‌కు వెళ్లి జాయిన్ అవుతాడు. నాదవరంబన్ పీటర్‌(చెంబన్ వినోద్ జోస్) అనే హెడ్ కానిస్టేబుల్ అతడితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అతడికి ఊరి విషయాల గురించి చెప్తాడు. అదే సమయంలో చాప్రా హత్యపై దర్యాప్తు మొదలవుతుంది.


చాప్రా పనిమనిషి పద్మిని(మేఘా థామస్)తో సహా చాప్రాతో సంబంధం ఉన్న గ్రామస్తులందరినీ పోలీసులు ప్రశ్నించడం ప్రారంభిస్తారు. చాప్రా ఇద్దరు కొడుకులు కూడా తమ తండ్రి హత్యకు కారణమైన వాళ్లను చంపేందుకు ఊళ్లోకి వస్తారు. గ్రామంలో విధ్వంసం సృష్టించి గ్రామస్తులను భయపెడతారు. పున్నారి రాజన్ చాప్రా కోసం ఓ ల్యాండ్ డీల్ చేస్తాడు. లాభాల్లో వచ్చిన వచ్చిన డబ్బును అతడికి ఇవ్వాల్సి ఉంది. అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కేసు తన మీదికి ఎక్కడ వస్తుందోనని భయపడతాడు. చాప్రా హత్యకు తానే కారణం అంటూ ఓ వ్యక్తిని సెట్ చేయాలని, ఎన్నికల తర్వాత తనకు బెయిల్ ఇప్పిద్దాం అని పున్నారి స్థానిక నాయకుడు మావేలి(బైజు)తో కలిసి ప్లాన్ చేస్తారు. మావేలి ఏర్పాటు చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లక ముందే, కొల్లన్ శంకరన్( మణికందన్ ఆర్. ఆచారి) స్టేషన్‌కు వచ్చి తానే చాప్రాను చంపేశానని లొంగిపోతాడు.


నిజానికి హెడ్ కానిస్టేబుల్ పీటర్ నాదవరంబన్ పద్మినితో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటాడు. పద్మిని ప్లాన్ ప్రకారమే చాప్రాను హత్య చేయిస్తాడు పీటర్. పద్మిని భర్త చాప్రా దగ్గర పని చేస్తాడు. కానీ, పద్మినిపై కన్ను పడ్డంతో ఆమె భర్తను చంపేస్తాడు. అప్పటి నుంచి పద్మినిని తన దగ్గరే పని మనిషిగా ఉంచుకుని, కోరిక తీర్చుకుంటాడు. చివరకు తన భర్తను చంపింది చాప్రా అని తెలియడంతో పద్మిని నాదవరంబాన్‌తో కలిసి చాప్రాను చంపిస్తుంది. అయితే, ఈ హత్యను అడవిలో ఉండే హంతకుడు కొల్లియన్ చేత చేయిస్తాడు పీటర్.


మరోవైపు హత్య చేయకపోయినా శంకరన్ ఎందుకు లొంగిపోయాడో కానిస్టేబుల్ వాసుదేవన్ కు అర్థం కాదు. అయితే, తన కూతురును హెడ్ కానిస్టేబుల్ పీటర్ మానభంగం చేసి చంపాడనే విషయం తెలిసి, ఎలాగైనా అతడిని స్టేషన్ లోనే చంపాలని శంకరన్ చాప్రా హత్య కేసులో లొంగిపోతాడు. తన కూతురుని పీటర్ చంపాడని శంకరన్.. వాసుదేవన్ కు చెబుతాడు. దీంతో అతడు షాక్ అవుతాడు.


ఎలాగైనా శంకరన్ తో పాటు వాసుదేవన్ ను చంపాలని పీటర్ ప్రయత్నిస్తాడు. ఈ హత్యలు చేసేందుకు అడవిలోని కొల్లియన్ సాయం కోరుతాడు. తను నో చెప్పడంతో పోలీసులు కొల్లియన్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకొస్తాడు. ఈ సమయంలోనే తన తండ్రిని చంపిన శంకరన్ ను చంపాలని చాప్రా కొడుకులు స్టేషన్ మీద దాడి చేస్తాడు. ఈ దాడిలో చాప్రా కొడుకులలో ఒకరు చనిపోతారు. మిగిలిన వాడు లోపలికి వెళ్లి శంకర్ ను కాల్చి చంపుతాడు.


ఇదే సమయంలో కొల్లియన్, పీటర్ కాల్చుకుంటారు. తన తల్లి కోరిక మేరకు అప్పటి వరకు భయస్తుడిగా కనిపించిన వాసుదేవన్ తనలోని ధైర్యాన్ని కూడగట్టుకుని అక్కడున్న తుపాకీ తీసుకుని కొక్కన్ తో పాటు పీటర్ ను చంపేస్తాడు. ఈ ఘటనలో వాసుదేవన్ తీవ్రంగా గాయపడుతాడు. అప్పుడే స్టేషన్ కు వచ్చిన ఎస్సై వాసుదేవన్ ను హాస్పిటల్ కు పంపిస్తాడు. స్టేషన్ లో జరిగిన గొడవల్లో చాప్రా కొడుకులు, వారి దాడిలో శంకరన్, కొల్లియన్, పీటర్ జరుపుకున్న కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని కేసు క్లోజ్ చేస్తాడు. దీంతో సినిమా అయిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


Read Also: పాపం, డబ్బుకు ఆశపడి అలా చేస్తారు.. చిన్న కునుకు తీసినా చావే, మతిపోగొట్టే హర్రర్ థ్రిల్లర్ ఇది!