డబుల్ బ్లైండ్ (Double Blind) 2023లో విడుదలైన థ్రిల్లర్ ఫిల్మ్. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ మనుషుల మీద జరిపే ప్రమాదకరమైన ప్రయోగంలో డబ్బు అవసరం ఉండటంతో వారి మీద మెడికల్ ట్రయల్స్‌కు రిజిస్టర్ చేసుకుంటారు. అది ఎంత ప్రమాదమో ముందు వాళ్లకు తెలియదు. నిద్ర పోయారంటే చనిపోయే పరిస్థితి వస్తుంది.


క్లైర్ అనే అమ్మాయికి తన తల్లి ట్రీట్మెంట్ కోసం డబ్బు అవసరం ఉంటుంది. వేరే దారి కనపడక ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరుగుతున్న మెడికల్ ట్రయల్స్‌లో పాల్గొంటుంది. ఈ కంపెనీ ఎలుకలతో పాటు మనుషుల మీద కూడా ప్రయోగాలు చేస్తుంటుంది. ఫిజికల్ గా, మెంటల్ గా ఆరోగ్యంగా ఉండి, డబ్బులు బాగా అవసరం ఉన్నవారు ఇందుకు రిజిస్టర్ చేసుకుంటారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మందులు కూడా వీళ్ల మీదే ప్రయోగిస్తారు.


డాక్టర్ రోసీ ఈ ట్రయల్ ను నడుపుతూ ఉంటుంది. ఈ ప్రయోగం జరపటానికి ఏడుగురిని ఎంపిక చేసుకుంటారు. మిమ్మలందర్నీ ఐదు రోజుల పాటూ మానిటర్ చేస్తాం. మీకిచ్చే మందులు రకరకాల వ్యాధులను నివారించటానికి తయారుచేసినవి. మొదటగా మీకు 25Mg డోస్ ఇస్తాం. తర్వాత క్రమంగా డోస్ పెంచుతాము. చివరి రోజున 80Mg డోస్ ఇస్తాం. అది మీ అందరి మీద బాగా పనిచేస్తే మీరు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. ఈ మధ్యలో మాత్రం మీరు ఒక్క అడుగు కూడా బయటపెట్టలేరు అని చెప్తుంది డాక్టర్ రోసీ. వాళ్లందరూ డబ్బు చాలా అవసరం ఉండటం వల్ల అన్నింటికీ సరేనని ఒప్పుకుంటారు.


మొదటిరోజు 25Mg మెడిసిన్ అందరూ వేసుకుంటారు. 15 నిమిషాలు అందరూ బాగానే ఉంటారు. కంపెనీ వాళ్లు ట్రయల్స్ మొదలుపెడుతారు. క్లైర్ ని కూడా టెస్ట్ చేయటానికి వస్తారు. అదే సమయంలో ఆమెకు వాంతులు అవుతాయి. తర్వాత క్లైర్ అక్కడ అమీర్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతను ఒక మెడికల్ విద్యార్థి అని తెలుస్తుంది. అమీర్ ఇది వరకు కూడా ఇలాంటి ట్రయల్స్ లో పాల్గొన్నాడు. 


క్లైర్ కి రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. బయటికి వచ్చి చూస్తే అందరిదీ అదే పరిస్థితి. అలా వాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇక్కడేదో తప్పు జరుగుతోందని వాళ్లకు అర్థమవుతుంది. డాక్టర్ రోసీ తన పైఆఫీసర్ తో ఫోన్లో మాట్లాడుతుంది. మీరిచ్చిన మెడిసిన్ నేరుగా గా సెంట్రల్ నెర్వస్ సిస్టం మీద వేగంగా ప్రభావం చూపిస్తుంది. ఈ మెడిసిన్ కి సంబంధించిన వివరాలు చెప్పమని కంపెనీ హెడ్ ఆఫీసర్ ని కోరుతుంది.


కానీ వాళ్ల నుంచి ఎలాంటి సమాధానం రాదు. పైగా చెప్పింది చెయ్యి. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం లేదని దబాయిస్తారు. వాళ్లకి ఇంకా డోస్ పెంచమని చెప్తారు. చేసేదేమీ లేక డాక్టర్ రోస్ ఆందోళన చెందుతుంది. ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె కంపెనీ వాళ్లు చెప్పిందే చేస్తుంది. తర్వాత రోజు వాళ్లందరికీ 85Mg మెడిసిన్ ఇస్తారు. ఇదేంటి, చివరిరోజు 85Mg ఇస్తానన్నారు కదా ఈరోజే ఎందుకిస్తున్నారని వాళ్లు ప్రశ్నిస్తారు. 


వాళ్లకు 30,000 వేల యూరోలు ఇస్తామని చెప్పటంతో ఆశపడి అందరూ ఒప్పేసుకుంటారు. తర్వాత ఆ మెడిసిన్ వల్ల ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయి. అందులో నిద్రపోయిన ఒకరు చనిపోతారు. నిద్రపోతే ఈ మందు చంపేస్తుందని వాళ్లు తెలుసుకుంటారు. వాళ్లంతా బతికి బయటపడ్డారా? ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ చేస్తున్న మోసం ప్రపంచానికి తెలుస్తుందా? అసలు క్లైర్ కి ఏమైంది? ఇవన్నీ సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఈ ఫిల్మ్ MUBI ఓటీటీలో అందుబాటులో ఉంది.


Also Read: ఆ పని కోసం సముద్రంలోకి వెళ్తారు, అంతే అలల్లో చిక్కుకుని దారితప్పుతారు, 41 రోజుల తర్వాత ఊహించని ట్విస్ట్