Adah Sharma Bastar The Naxal Story Release Date Fix: అదా శర్మ ఈ మధ్య కాంట్రవర్సల్ సినిమాలతో హాట్‌టాపిక్ అవుతుంది. నితిన్ 'హార్ట్ ఎటాక్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత గ్లామరస్ పాత్రలు చేసింది. సినిమాలు సక్సెస్ అయినా ఈ భామకు సరైన గుర్తింపు లభించలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ పాత్రలతో సరిపెట్టుకుంటుంది. ఇక బాలీవుడ్‌లో వెళ్లి అక్కడ తన లక్క్‌ను పరిక్షించుకునే ప్రయత్నం చేసింది. హిందీలో లేడీ ఒరియంటెడ్ చిత్రాలు చేసిన ఆశించిను గుర్తింపు, సక్సెస్ రాలేదు. దాంతో ఈ భామ ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమే 'ది కేరళ స్టోరీ' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. విడుదలకు ముందు ఎన్నో వివాదాలు చూట్టుముట్టిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాల పడుతూ ఫైనల్‌గా విడుదలై సంచలన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి అదా కాంట్రవర్సల్ కంటెంట్‌పైనే ఫోకస్ పెడుతుంది. ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, సినిమాలు ఎప్పుడు వివాదంలో నిలుస్తూనే ఉన్నాయి. అలా హిందీలో కాంట్రవర్సల్ కంటెంట్‌తో వచ్చిన చిత్రం 'బస్తర్: ది నక్సల్ స్టోరీ'. ది కేరళ స్టోరీ చిత్రాన్ని తెరకెక్కింంచిన అదే డైరెక్టర్ సుదీప్తోసేన్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందింది. నక్సల్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఇందులో పూర్తిగా మావోయిస్టుల హింసనే చూపించారని, కేవలం సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే వాదనలు వినిపించాయి. దీంతో మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ పలువురు డిమాండ్ చేశారు. ఈ సినిమా చేసిన అదాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆడపిళ్ల నక్సల్ పాత్రలో నటించడమేంటని, ఈ సినిమా నుంచి తప్పుకోకపోతే చంపేస్తామని, కొందరైతే వైశ్య అంటూ ఆమెను దారుణంగా విమర్శించారు. ఇక అన్ని అడ్డంకులు దాటుకుని ఈ సినిమా మార్చి 15న థియేటర్లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచే మూవీకి నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుని అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ జీ5(ZEE5) సంస్థ సొంతం డీసెంట్ ప్రైజ్‌కి సొంతం చేసుకుందని సమాచారం. ఇక మూవీ విడుదలైన రెండు నెలలకు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇచ్చేందుకు జీ5 సంస్థ రెడీ అయ్యింది. తాజాగా దీనిపై తమ ఎక్స్ వేదిక అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఈ సినిమా మే 17న ఓటీటీ విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటిచింది. ఇక రిలీజ్‌కు ముందు ఎన్నో పలు వివాదంలో నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స అందుకుంటుందో చూడాలి. ఇక 'ది కేరళ స్టోరీ 'మాదిరిగా డిజిటల్ వేదికపై మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుందా? లేక బాక్సాఫీసు రిజల్ట్‌నే రిపీట్ చేస్తుందా చూడాలి!. కాగా ఈ సినిమాలో ఆదా మావోయిస్టులను అణచివేసేందుకు భారత ప్రభుత్వం స్పెషల్‌గా నియమించిన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్‌గా నటించింది.