ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ సమర్పణలో యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటిస్తున్న సినిమా 'భజే వాయు వేగం' (Bhaje Vayu Vegam Movie). యూవీ కాన్సెప్ట్స్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
మే 31న థియేటర్లలోకి 'భజే వాయు వేగం'
Bhaje Vayu Vegam Movie Release Date: మే నెలాఖరున థియేటర్లలోకి 'భజే వాయు వేగం' రానుంది. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ''ఫైనల్ షోకి పిచ్ రెడీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి మే 31న 'భజే వాయు వేగం' వస్తుంది. క్రేజీ రైడ్‌కి రెడీ అవ్వండి'' అని యువి క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
డ్రగ్స్ కేసులో అధికారి హత్య...
నిందితుడు ఎవరు? ఎలా పట్టుకున్నారు?
డ్రగ్స్ నేపథ్యంలో 'భజే వాయు వేగం' రూపొందిందని టీజర్ చూసిన ప్రేక్షకులు ఈజీగా చెబుతారు. ఆ టీజర్‌లో ఏముంది? అనేది చూస్తే... డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి హత్యకు గురి అవుతాడు. ఆ కేసులో ప్రధాన నిందితుడితో పాటు ఆ అధికారి హత్య కేసులో నిందితుడిని పట్టుకోవాలని పోలీసులు వేట మొదలు పెడతారు. పోలీసు శాఖ అంతా అదే పని మీద ఉంటుంది. అది పక్కన పెడితే... హీరో కార్తికేయకు, తండ్రికి మధ్య అనుబంధాన్ని సైతం చూపించారు. 'ప్రతి ఒక్కరి జీవితంలో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికి అయినా మనం వెనకాడం. నా జీవితంలో అది మా నాన్న' అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంది. ఆ మాటతో తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని సైతం దర్శకుడు చూపించారు. ఈ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఆ డ్రగ్స్ కేసు ఏమిటి? అనేది మే 31న సినిమా చూసి తెలుసుకోవాలి. టీజర్ వరకు భారీ యాక్షన్ సీక్వెన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Also Read: 'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?
కార్తికేయకు జంటగా ఐశ్వర్య మీనన్!
Bhaje Vayu Vegam Cast And Crew: 'భజే వాయు వేగం'లో కార్తికేయకు జంటగా యుంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటించారు. 'హ్యాపీ డేస్' ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకుడు. అజయ్ కుమార్ రాజు .పి సహ నిర్మాత. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కపిల్ కుమార్ నేపథ్య సంగీతం, రధన్ పాటలకు స్వరాలు అందించారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు: మధు శ్రీనివాస్, కళా దర్శకత్వం: గాంధీ నడికుడికర్, కూర్పు: సత్య జి, ఛాయాగ్రహణం: ఆర్.డి రాజశేఖర్.