Shruti Haasan Went to Shooting in an Auto: సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా బూతద్దంలో పెట్టి చూస్తారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేసిన ఓ పని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అంతేకాదు, ఆమె డెడికేషన్ చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? నెటిజన్లు ఎందుకు ప్రశంసిస్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఆటోలో షూటింగ్ కు వెళ్లిన శృతి, నెటిజన్ల ప్రశంసలు


శృతి హాసన్ ప్రస్తుతం ముంబైలోనే నివాసం ఉంటుంది. ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ముంబై పరిసరాల్లోనే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె షూటింగ్ లో పాల్గొనేందుకు తన కారులో బయల్దేరింది. కొంత దూరం వెల్లగానే ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఎంత సేపు వెయిట్ చేసిన ట్రాఫిక్ క్లియర్ కాలేదు. ఏం చేయాలో అర్థం కాక, కారును పక్కనే ఆపి, ట్రాఫిక్ లోనే కొంతదూరం నడుచుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత ఓ ఆటో ఎక్కి షూటింగ్ స్పాట్ కు వెళ్లిపోయింది.


ఆమె ఆటోలో ఎక్కి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమె ఏ సినిమా షూటింగ్ కు వెళ్లారు అనే విషయం తెలియకపోయినా, వృత్తి పట్ల తనకు ఉన్న డెడికేషన్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. షూటింగ్ పట్ల ఆమెకు ఉన్న గౌరవం కారణంగానే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయని నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. షూటింగ్ కు లేటుగా వచ్చే నటీనటులు శృతి హాసన్ ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.  






వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్న శృతి హాసన్


స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినా, తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో రాణిస్తోంది శృతి హాసన్. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో కెరీర్ ఫుల్ బిజీగా కొనసాగిస్తోంది. గత ఏడాది ‘సలార్‌’ సహా పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది కూడా పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అంతేకాదు, రీసెంట్ గా దర్శకుడు లోకేషన్ కనగరాజ్ తో కలిసి ఆమె చేసిన ఇన్నిమేల్ మ్యూజిక్ ఆల్బం ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ఈ ఆల్బంకు మ్యూజిక్ తో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా శృతి హాసన్ నిర్వహించడం విశేషం. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్ లోనే కొనసాగడం విశేషం. ప్రస్తుతం ఆమె సౌత్ సినిమా పరిశ్రమతో పాటు ఉత్తరాదిలో సుమారు అరడజన్ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.      


Also Read: గొప్ప మనసు చాటుకున్న జ్యోతిరాయ్‌ (జగతి మేడం) - పద్మ శ్రీ మొగిలయ్యకు ఆర్థిక సాయం