Jyothi rai helped to Padma Shri Kinnera Mogulaiah: 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతిరాయ్‌ అలియాస్‌ జగతి మేడం గొప్ప మనసు చాటుకున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారానికి బదులుగా దీన స్థితిలో ఉన్న పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలియ్యకు ఆర్థిక సాయం చేసి చేయూతను అందించారు. కాగా పద్మ శ్రీ అవార్డు గ్రహిత, కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిల‌య్య ప్రస్తుతం పూట గడవని దీనస్థితిలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కిన్నెర కళారుడు మొగిలయ్య ప్రతిభను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.


ఆయనను అక్కున చేర్చుకుని చేయూతనిచ్చింది. సినీ ఇండస్ట్రీ సైతం ఆయన ప్రతిభను మెచ్చుకుంటూ సినిమాల్లో ఆఫర్స్‌‌ ఇచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ భీమ్లా నాయక్‌ సినిమాలో మొగిలయ్యకు ఆఫర్‌ వచ్చింది. వెండితెరపై తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో ఆకట్టుకున్న మొగిలయ్య ప్రతిభను ఏకంగా కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన పద్మ శ్రీతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మశ్రీ ఆయన ఆర్థిక కష్టాలను తీర్చలేకపోయింది. ప్రభుత్వం నుంచే ఫించన్‌ ఆగిపోవడంతో మొగిలయ్యకు పూట గడవడమే కష్టమైంది.






దీంతో హైదరాబాద్‌లో రోజూ వారి కూలీగా మారి పూట గడుపుకుంటున్న మొగిలయ్య వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కాస్తా 'జగతి మేడం' అలియాస్‌ జ్యోతిరాయ్‌ కంట పడింది. మొగిలయ్య దీన స్థితి చూసి చలించినపోయిన జ్యోతిరాయ్‌ తన ఉదారతను చాటుకుంటుంది. మొగిలయ్యకు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకుంటుంది. ఈ విషయాన్ని స్వయంగా జ్యోతిరాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేకాదు మొగిలయ్యను స్వయంగా కలిసి డబ్బు అందించిన వీడియోను కూడా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అక్షయ తృతీయ వంటి శుభదిననా.. శ్రీ పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించానని చెప్పింది.


Also Read: నటి జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియోపై కేసు నమోదు, పరువు పోయిందంటూ జగతి మేడం ఆవేదన!


ఇక జ్యోతిరాయ్‌ నిర్ణయంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గొప్ప మనసును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా జ్యోతిరాయ్‌ కొద్ది రోజులుగా వ్యక్తిగత విషయమై వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన పర్సనల్‌ వీడియో తన దగ్గర ఉందని, కావాల్సిన వాళ్లు డబ్బులు పంపిస్తే తమకు వీడియో షేర్‌ చేస్తానంటూ ఓ గుర్తు తెలియని సోషల్‌ మీడియా ఖాతా నుంచి పోస్ట్‌ దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త కన్నడనాట సంచలనంగా మారింది. అయితే దీనిపై స్పందించిన జ్యోతిరాయ్‌ తనని కావాలని టార్గెట్‌ చేస్తున్నారని, తన పేరుతో ఫేక్ వీడియో క్రియేట్‌ చేసి తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.