Tollywood Star Childhood Photo Goes Viral: ఈ మధ్య సోషల్‌ మీడియా వాడకం బాగా పెరిగింది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియాలోనే గడిపెస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లో సెలబ్రిటీలు చేసే సందడి గురించి తెలిసిందే. తరచూ తమ వ్యక్తిగత విషయాలను షేర్‌ చేస్తూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక లాక్‌డౌన్‌లో అయితే సెలబ్రిటీలంతా సోషల్‌ మీడియాలోనే గడిపేశారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చైల్డ్‌ హుడ్‌ పిక్స్‌ నుంచి తల్లిదండ్రులతో సరదాగా గడిపిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.


దీంతో అప్పటి నుంచి సెలబ్రిటీల చైల్డ్‌ హుడ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక అభిమానులకు కూడా తమ అభిమాన నటీనటులు చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ వారి ఫోటోలు వైరల్‌  చేస్తున్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ సెలబ్రిటీ ఫోటో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. చిన్నప్పడు చీరకట్టి క్యూట్‌గా నవ్వుతున్న ఈ చిన్నారి ఇప్పడు బుల్లితెర సెన్సేషన్. ఆమె కనిపిస్తే చాలు అందరిలో ఓ ఊపు వస్తుంది. బుల్లితెర ఆడియన్స్‌, సెలబ్రిటీల్లో ఉత్సహం తెప్పిస్తూ ప్రస్తుతం స్టార్‌ యాంకర్‌గా కొనసాగుతుంది. ఈమే వ్యాక్చాతుర్యం, మాస్‌ యాంగిల్‌తో బుల్లితెర 'రాములమ్మా'గా బిరిది పొందింది.


ఆమె ఓ స్టార్ యాంకర్


ఓహ్‌ ఇప్పటికీ ఈ చిన్నారి ఎవరో మీరు పట్టేసే ఉంటారు కదా. హా.. అవును తనే యాంకర్‌ శ్రీముఖి. నేడు శ్రీముఖి బర్త్‌డే అనే విషయం తెలిసిందే. 1993 మే 10న నిజామాబాద్‌లో జన్మించిన శ్రీముఖి గ్రాడ్యుయేషన్‌లో డెంటిస్ట్రీ చదివింది . అదే టైంలో ఈటీవీలో ప్రసారమయ్యే అదుర్స్‌ అనే డ్యాన్స్‌ షోతో యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. యాంకర్‌ ప్రదీప్‌ మాచీరాజు సరసన ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత కాస్తా గ్యాప్‌ తీసుకున్న శ్రీముఖీ.. అల్లు అర్జున్‌ జులాయి సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసింది. ఇందులో బన్నీ సోదరిగా నటించిన సంగతి తెలిసిందే. అలాగే పలు హీరోలకు, చెల్లి, అక్కడ పాత్రలు చేసిన శ్రీముఖికి ఆఫర్స్‌ తగ్గడంతో యాంకరింగ్‌పై ఫోకస్‌ పెట్టింది. పటాస్‌ అనే షోతో మళ్లీ యాంకర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఈ బుల్లితెర రాములమ్మా ప్రస్తుతం బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది.


బుల్లితెర రాములమ్మగా గుర్తింపు






స్టార్‌ మాలో ప్రసారం అయ్యే ఆదివారం మా పరివార్‌ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ఇందులో సీరియల్‌ నటీనటులతో కలిసి తెగ హంగామా చేస్తుంది. వారి చేత ఆటలు, పాటలు పాడిస్తూ ప్రతి ఆదివారం బుల్లితెరపై ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుంది. మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో మెరుస్తుంది. ఇటీవల చిరంజీవి నటించిన భోళా శంకర్‌లో సినిమాలో అతిథి పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ ఖుషీ మూవీలోని నడుము సీన్‌ రిక్రియేషన్‌ చేస్తూ భోళా శంకర్‌లో ఓ ఫన్నీ సీన్‌ పెట్టారు. ఇందులో భూమికగా శ్రీముఖి నటించగా చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌లా నటించారు. ఈ సీన్‌లో థియేటర్లో ఈళలు కూడా పడ్డాయి. ఇలా యాంకర్‌గా, నటిగా.. మరోవైపు స్పెషల్‌ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ కెరీర్‌ని బిజీ బిజీగా చేసుకుంటుంది శ్రీముఖి. 


Also Read: నటి జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియోపై కేసు నమోదు, పరువు పోయిందంటూ జగతి మేడం ఆవేదన!