Jyothi Rai Becomes Deepfake Victim Says Police: గత రెండు రోజులుగా ప్రముఖ టీవీ నటి జ్యోతిరాయ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తనకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో నెట్టింట వైరల్ కావడం పట్ల జ్యోతిరాయ్ సీరియస్ అయ్యింది. తన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. జ్యోతిరాయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో డీప్ ఫేక్ వీడియోగా గుర్తించారు. కొంత మంది దుండగులు కావాలనే ఆమె వీడియోను మార్ఫ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.


తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన జ్యోతిరాయ్


తాజాగా అభి అనే ఓ యువకుడు.. జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. తన యూట్యూబ్ ఛానెల్‌కు 1000 మంది సబ్‌స్క్రైబర్లు వస్తే ఆ వీడియోను పోస్ట్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు.  దీంతో ఒక్కసారిగా జ్యోతి రాయ్ అంశం సంచలనంగా మారింది. జ్యోతి రాయ్ కన్నడ నటి కావడంతో ఆ రాష్ట్రంలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ప్రైవేట్ వీడియోపై జ్యోతి రాయ్ స్పందించింది. తన పరువు తీయడానికి ప్రయత్నించిన నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరింది. తనకు సంబంధించిన ఎటువంటి ప్రైవేట్ వీడియోలు లీక్ లేదని స్పష్టం చేసింది. తన గురించి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల జ్యోతిరాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వార్తలతో తాను, తన కుటుంబ సభ్యులు అప్రతిష్ట పాలయ్యామని వెల్లడించింది. తన పరువును బజారున పడేసిన దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.  


 జగతి మేడంగా తెలుగునాట బాగా పాపులర్


తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జ్యోతిరాయ్ బాగా పరిచయం.  ఈ సీరియల్ లో హీరో తల్లి జగతి మేడం పాత్రలో అద్భుతంగా నటిస్తోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. నిజానికి సీరియల్ లో తల్లిపాత్ర పోషించినా, నిజ జీవితంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. అందాల ఆరబోతతో, ఆకట్టుకునే ఫోటో షూట్స్ తో నెటిజన్లను కవ్విస్తుంది. గ్లామరస్ ఫోటోలతో కుర్రాకారుకు కిక్కెస్తుంది. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన ఓ యువ దర్శకుడిని జ్యోతిరాయ్ రెండో పెళ్లి చేసుకుంది. 20 ఏళ్ల వయసులోనే పద్మానాభ అనే వ్యక్తితో ఈమెకు పెళ్లి జరిగింది. కొంత కాలం తర్వాత వీరిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ఆమె, తాజాగా మరో వివాహం చేసుకుంది.  






Read Also: అలాంటి రొమాన్స్ ఫస్ట్ టైమ్ చేశా - ఒంటి మీద దుద్దుర్లు వచ్చాయి: ‘హీరామండి’బ్యూటీ శృతి శర్మ