‘Ramayana’ Runs Into Serious Trouble: బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్టు ‘రామాయణం’. దిగ్గజ దర్శకుడు నితేష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రకటన నాటి నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. భారతీయులు ఎంతగానో ఇష్టపడే ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించబోతున్నారు. సీతా దేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. విజయ్ సేతుపతి, సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రామాయణం’ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రణబీర్, సాయి పల్లవికి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేశారు.


న్యాయపరమైన చిక్కుల్లో ‘రామాయణం’


‘రామాయణం’ సినిమాకు సంబంధించి గత కొద్ది రోజులు చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. శ్రీరాముడు, సీతా గెటప్ లో ఉన్న రణబీర్, సాయి పల్లవి ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా మరో పెద్ద సమస్య ఎదురయ్యింది. ఈసారి ఏకంగా చిత్రబృందానికి లీగల్ నోటీసులు అందాయి. వాస్తవానికి ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించాలని భావించారు. కానీ, రీసెంట్ గా వారిద్దరు చిత్ర నిర్మాణం నుంచి వైదొలిగారు.


లీగల్ నోటీసులు జారీ చేసిన మంతెన నిర్మాణ సంస్థ


తాజాగా మంతెన మీడియా వెంచర్స్ LLP పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గత నెల(ఏప్రిల్ 2024)లో అల్లు, మంతెన మీడియా వెంచర్స్ LLPతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తమకే దక్కుతాయని ఈ నోటీసులో వెల్లడించింది. ప్రైమ్ ఫోకస్ సంస్థ ‘రామాయణం’లోని ఏ కంటెంట్ ఉపయోగించినా కాపీ రైట్స్ వాయొలేషన్ కిందే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంతెన, అల్లు మీడియా వెంచర్స్ ప్రకటించింది.


అంతేకాదు, అగ్రిమెంట్ ప్రకారం ప్రైమ్ ఫోకస్ సంస్థ తమకు చెల్లించాల్సిన రుసుమును చెల్లించలేదని, ‘రామాయణం’ సినిమా పూర్తి హక్కులు తమకే దక్కుతాయని వెల్లడించింది. ప్రైమ్ ఫోకస్ సంస్థకు ‘రామాయణం’ సినిమా తీసే రైట్స్ లేవని తేల్చి చెప్పింది. ఈ సినిమా కోసం పని చేసే ప్రతి ఒక్కరు కాపీ రైట్స్ ఉల్లంఘన కింద చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుదని హెచ్చరించింది. ఈ నోటీసుల నేపథ్యంలో ‘రామాయణం’ సినిమా భవితవ్యం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇంతకీ ఈ సినిమా ముందుకు వెళ్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఆగిపోయినట్లు సమాచారం.


Read Also: 20 ఏళ్లకే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రేమించిన అమ్మాయితో అట్టహాసంగా నిశ్చితార్థం