సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కరీనా ఎంట్రీ - ఆమె నటించే ఫస్ట్ మూవీ ఇదేనా?
‘ది క్రూ’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కరీనా కపూర్, పలు కీలక విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె, దక్షిణాది సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. “నేను త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. ఓ భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించబోతున్నాను. పాన్ ఇండియా మూవీగా ఆ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి సౌత్ సినిమాలో నటిస్తున్నాను. షూటింగ్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇంకా తెలియదు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు నేను భావిస్తున్నాను.’ అని వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘థగ్ లైఫ్’ నుంచి క్రేజీ న్యూస్ - కమల్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారా?
మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేనున్నట్లు టాక్ వినిపించింది. రెండు సరికొత్త పాత్రలల్లో కనిపిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీలో కమల్ పాత్రలకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూడు పాత్రలను లింక్ చేస్తూ మణిరత్నం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ పది పాత్రల్లో ఆకట్టుకోగా, ఇప్పుడు మూడు పాత్రలో ఆహా అనిపించబోతున్నట్లు సమాచారం. మూడు పాత్రలు చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ‘విక్రమ్’ మూవీ తర్వాత అంతకు మించిన విజయాన్ని ఈ సినిమాతో అందుకోవాలని కమల్ భావిస్తున్నారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'టిల్లు స్క్వేర్' రీ రికార్డింగ్ - బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా
టిల్లు స్క్వేర్... ఈ నెల 29న థియేటర్లలోకి విడుదల అవుతోంది. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. 'డీజే టిల్లు' బ్లాక్ బస్టర్ కావడం, సీక్వెల్ ప్రచార చిత్రాలతో పాటు పాటలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 'టిల్లు స్క్వేర్'కు భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేస్తున్నారు. ఆ వర్క్ మీద ఆయన బిజీగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'టిల్లు స్క్వేర్' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు భీమ్స్ ప్రారంభించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ జోష్- తెలుగులో సరికొత్త రికార్డు
బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ తెలుగు వెర్షన్ దుమ్మురేపుతోంది. డీసెంట్ వసూళ్లతో సత్తా చాటుతోంది. రోజుకు రూ. 1 కోటికి పైనే కలెక్షన్ సాధిస్తోంది. మొత్తంగా, సినిమా విడుదలైన 10 రోజుల్లో ఈ మలయాళీ డబ్బింగ్ చిత్రం రూ. 10.54 కోట్లు రాబట్టింది. తెలుగులో ఓ మలయాళీ డబ్బింగ్ చిత్రం ఇంత మొత్తంలో రాబట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దర్శక దిగ్గజం రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్లు ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు మహేష్ బాబు లాంటి హీరోలు ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘ప్రేమలు‘ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ హారిక నారాయణ్‌ - సింగర్‌ రేవంత్‌ సందడి చూశారా?
సింగర్‌ హారికా నారాయణ్‌ పెళ్లి పీటలు ఎక్కింది. ఇటీవల ప్రియుడిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించిన ఆమె తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆదివారం(మార్చి 17న) ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహిదతుల మధ్య ఘనంగా జరిగింది. ఆమె పెళ్లిలో సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రేవంత్‌ సందడి బాగా కనిపించింది. రేవంత్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ సింగర్స్‌, సరిగమపమ సింగర్స్‌ కూడా హాజరయ్యారు. అయితే హారిక తన పెళ్లిని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆమె పెళ్లికి హాజరైన రేవంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో పెళ్లి ఫోటోను షేర్‌ చేసి కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)