టిల్లు స్క్వేర్... ఈ నెల 29న థియేటర్లలోకి విడుదల అవుతోంది. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. 'డీజే టిల్లు' బ్లాక్ బస్టర్ కావడం, సీక్వెల్ ప్రచార చిత్రాలతో పాటు పాటలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరి, ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
తమన్ కాదు... భీమ్స్ చేతిలో 'టిల్లు స్క్వేర్'
'డీజే టిల్లు' సినిమాకు ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. 'టిల్లు స్క్వేర్' సినిమాకు సైతం ఆయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తారని భావించారంతా! కానీ, రియాలిటీ వేరు. 'టిల్లు స్క్వేర్'కు భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేస్తున్నారు. ఆ వర్క్ మీద ఆయన బిజీగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'టిల్లు స్క్వేర్' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు భీమ్స్ ప్రారంభించారు.
'టిల్లు స్క్వేర్'ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నిర్మాతలు తీసిన 'మ్యాడ్' సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. అది మంచి విజయం సాధించింది. పాటలతో పాటు నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. దాంతో ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' సినిమాను సైతం భీమ్స్ చేతిలో పెట్టారు.
ఫుల్ బిజీ బిజీగా భీమ్స్ సిసిరోలియో!
కెరీర్ స్టార్టింగ్ నుంచి భీమ్స్ సిసిరోలియో సూపర్ హిట్ పాటలు, నేపథ్య సంగీతం అందిస్తూ వస్తున్నారు. అయితే, 'ధమాకా' తర్వాత ఆయన ప్రతిభకు మరింత గుర్తింపు లభించింది. అప్పట్నుంచి ఆయన ఖాళీగా ఉండటం లేదు. స్టార్ హీరోలు, అగ్ర దర్శక నిర్మాతలు ఆయనతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: డజను సినిమాలు, అరడజను వెబ్ సిరీస్‌లు - ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏం వస్తున్నాయంటే?
'ధమాకా', 'మ్యాడ్' మధ్యలో ఆయన సంగీతం అందించిన 'బలగం' భారీ విజయం సాధించింది. అందులో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కంట తడి పెట్టించింది. ప్రతి సంగీత దర్శకుడికి ఒక శైలి ఉంటుంది. తెలంగాణ నేపథ్యంలో జానపద గీతాలు బాగా చేస్తారని భీమ్స్ పేరు తెచ్చుకున్నారు. అయితే, జానపద పాటలు మాత్రమే కాదు... కమర్షియల్ సాంగ్స్ సైతం భీమ్స్ అదరగొడతారని 'ధమాకా'తో పేరు వచ్చింది. అంతకు ముందు ఆయన అటువంటి సాంగ్స్ చేశారు. వాటిని ఇప్పుడు ఆడియన్స్ గుర్తిస్తున్నారు.
Also Read: థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు - తమిళ్, హిందీలో ఏమున్నాయ్ అంటే?
భీమ్స్ సంగీతం అందించిన 'రజాకార్' ఇటీవల విడుదలైంది. అందులో పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయని విమర్శకులతో పాటు ప్రేక్షకులు ప్రశంసించారు. ప్రజెంట్ భీమ్స్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.
'టిల్లు స్క్వేర్' పాటలకు ఆ ఇద్దరూ!
'టిల్లు స్క్వేర్' సినిమాకు భీమ్స్ రీ రికార్డింగ్ చేస్తుంటే... రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు 'రాధిక... రాధికా', 'టికెట్టే కొనకుండా' హిట్ అయ్యాయి. 'ఓ మై లిల్లీ...' పాటను మార్చి 18వ తేదీ సాయంత్రం విడుదల చేశారు.