నటుడు, దర్శకుడు, సినిమా, సహాయ నటుడు... ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఏడు సొంతం చేసుకుని సంచనలం సృష్టించిన సినిమా 'ఓపెన్ హైమర్'. ఇండియన్ ఓటీటీలోకి ఈ వారం రానుంది. దాంతో పాటు ఇంకా ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి? అనేది చూడండి. సుమారు డజనుకు పైగా సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి.
ఈటీవీ విన్ (ETV Win)లో తులసీవనం
'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది', 'కీడా కోలా' చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'తులసీవనం' (Thulasivanam Web Series). ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ రెడ్డి తెరకెక్కించారు. కాలేజ్, ఆఫీస్, క్రికెట్ నేపథ్యంలో న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ నెల 21 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
- ఈటీవీ విన్ ఓటీటీలో మార్చి 22న హర్ష చెముడు హీరోగా నటించిన 'సుందరం మాస్టర్' కూడా స్ట్రీమింగ్ కానుంది.
Also Read: థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు - తమిళ్, హిందీలో ఏమున్నాయ్ అంటే?
డిస్నీలో జయరాం మలయాళ సినిమా
సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం'లో మహేష్ బాబు తండ్రిగా మలయాళ సీనియర్ హీరో జయరాం (Jayaram) నటించారు. ఆ సినిమా కంటే ఒక్క రోజు ముందు (జనవరి 11న) మలయాళంలో ఆయన హీరోగా నటించిన 'అబ్రహం ఓజలర్' (Abraham Ozler) విడుదలైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో మార్చి 21 నుంచి ఈ స్ట్రీమింగ్ కానుంది. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. తెలుగులో కూడా డబ్ చేశారు.
- డిస్నీలో మార్చి 22 నుంచి ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లుటేరా' (Lootere web series release date) స్ట్రీమింగ్ కానుంది.
- ఫ్రెంచ్ లీగల్ డ్రామా 'అనాటమీ ఆఫ్ ఫాల్' సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో మార్చి 22న విడుదల కానుంది. యానిమేషన్ వెబ్ సిరీస్ 'సాండ్ లార్డ్', 'ఎక్స్ మెన్ 97' మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
- డిస్నీలో మార్చి 22 నుంచి 'డేవ్ అండ్ జాన్సీస్ లాకర్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read: తంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?
ప్రైమ్ వీడియోలో... సారా అలీ ఖాన్ దేశభక్తి సినిమా!
బాలీవుడ్ యంగ్ హీరోయిన్, సైఫ్ వారసురాలు సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ప్రధాన పాత్రలో నటించిన దేశభక్తి సినిమా 'ఆ వతన్ మేరే వతన్' (Ae Watan Mere Watan). మార్చి 21న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. తెలుగు, తమిళ, మలయాళంతో పాటు ఇతర భారతీయ భాషల్లో అనువదించారని తెలిసింది.
మార్చి 19 నుంచి తమిళ సినిమా 'మరక్కుమ నెంజమ్' ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
హాలీవుడ్ స్టార్ Jake Gyllenhaal నటించిన 'రోడ్ హౌస్' సినిమా మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చేశారు.
Also Read: రజాకార్ రివ్యూ: మారణహోమం సృష్టించిన మతోన్మాదం - తెలంగాణ చరిత్రను ఎలా తీశారంటే?
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'ఫైటర్'!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఫైటర్'. థియేటర్లలో మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ, ఫ్లాప్ టాక్ వచ్చింది. ఆ సినిమా 500 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని ఆశించారు. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- హాలీవుడ్ వెబ్ సిరీస్ '3 బాడీ ప్రాబ్లమ్' సైతం మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
- సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్ సలాం' సినిమా ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు మరో రెండు మూడు హాలీవుడ్ సినిమాలు సైతం విడుదల కానున్నాయి.
- అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంట్ బేసిస్ విధానంలో ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ 'ఓపెన్ హైమర్' అందుబాటులో ఉంది. మార్చి 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.
- ఆహా ఓటీటీలో శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర నారాయణ' మార్చి 22న విడుదల కానుంది.