Citadel Web Series Update by Varun Dhawan: సమంతను మళ్లీ ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూస్తామా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తారు. ఇప్పట్లో తన చేతిలో సినిమాలు ఏమీ లేవు కాబట్టి వెండితెరపై ఇప్పట్లో సామ్‌ను చూడడం కష్టమే. కానీ త్వరలోనే తను ఒక యాక్షన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తోంది. అదే ‘సిటాడెల్’. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ‘సిటాడెల్’ నుండి క్రేజీ అప్డేట్ రానుందని ఇందులో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ బయటపెట్టారు. ఈ అప్డేట్ గురించి చెప్పడం కోసం వరుణ్.. ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అప్పుడే చెప్పకూడదు..
‘‘అందరికీ హలో. నేను మీ ప్రైమ్ స్నేహితుడిని. సీక్రెట్ న్యూస్ తీసుకొచ్చేశాను. 2024లోనే అతిపెద్ద అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది’’ అంటూ వరుణ్ ధావన్ ఏదో చెప్పబోతుండగా.. సార్ ఇవన్నీ చెప్పకూడదు అంటూ పక్కన నుండి వాయిస్ వినిపిస్తుంది. ‘‘ఇప్పుడు చెప్పకూడదు కానీ మార్చి 19కి చెప్పొచ్చు కదా. మీరు సిద్ధమేనా?’’ అంటూ వీడియోను ముగించాడు వరుణ్ ధావన్. ఈ వీడియోలో ఎక్కడా తను ‘సిటాడెల్’ పేరు ఉపయోగించలేదు. కానీ అమెజాన్ ప్రైమ్‌తో కలిసి పోస్ట్ చేసిన వీడియో కాబట్టి ఇది ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అప్డేట్ గురించే అని అర్థమవుతోంది.
ఇదే సూచన..
‘మీ ప్రైమ్ స్నేహితుడిని నమ్మండి. ఇదే మీకు సూచన. మార్చి 19 కోసం ఎదురుచూడండి’ అంటూ ఈ వీడియోను అమెజాన్ ప్రైమ్ పేజ్, వరుణ్ ధావన్ కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సిటాడెల్’ అనేది అదే పేరుతో ఉన్న అమెరికన్ వెబ్ సిరీస్‌కు తెలుగు వర్షన్‌గా తెరకెక్కింది. అమెరికన్ వెబ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్‌లో నటించింది. ఈ రీమేక్‌లో ప్రియాంక చోప్రా పాత్రను సమంత పోషిస్తోంది. రాజ్, డీకేలు దర్శకత్వం వహిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. దర్శకులతో కలిసి వరుణ్ ధావన్, సమంత కలిసి టీజర్ కట్‌ను చూశారు. టీజర్ చాలా బాగా వచ్చిందని చాలాకాలం క్రితమే సమంత, వరుణ్ కలిసి తమ సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశారు కూడా.
అన్నీ హిట్టే..
హిందీ వెబ్ సిరీస్‌లను ఒక రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకులు రాజ్, డీకే. ఇప్పటికీ వీరు తెరకెక్కించిన ప్రతీ హిందీ వెబ్ సిరీస్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి ‘సిటాడెల్’ కూడా చేరనుంది. పైగా సమంత ఇందులో లీడ్ రోల్ చేయడం ఈ సిరీస్‌కు మరింత హైప్ క్రియేట్ చేయనుంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడంతో పాటు యాక్షన్ సీన్స్‌లో కూడా నటించి హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందుకే ఇప్పటివరకు నేరుగా ఒక్క హిందీ సినిమా కూడా చేయకపోయినా.. బాలీవుడ్‌లో సమంతకు మంచి గుర్తింపు లభించింది.
Also Read: నా 53 ఏళ్ల కెరీర్‌లో అలాంటిది జరగలేదు - సందీప్ వంగాపై జావేద్ అఖ్తర్ ఫైర్