Singer Harika Narayan Marriage Photos: సింగర్‌ హారికా నారాయణ్‌ పెళ్లి పీటలు ఎక్కింది. ఇటీవల ప్రియుడిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించిన ఆమె తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆదివారం(మార్చి 17న) ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహిదతుల మధ్య ఘనంగా జరిగింది. ఆమె పెళ్లిలో సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రేవంత్‌ సందడి బాగా కనిపించింది. రేవంత్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ సింగర్స్‌, సరిగమపమ సింగర్స్‌ కూడా హాజరయ్యారు. అయితే హారిక తన పెళ్లిని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆమె పెళ్లికి హాజరైన రేవంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో పెళ్లి ఫోటోను షేర్‌ చేసి కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు.


దీంతో హారిక పెళ్లి విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బ్యూటీఫిల్‌ సింగర్‌గా యూత్‌ మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఆమె వాయిస్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. నిశ్చితార్థం సైలెంట్‌గా చేసుకున్న ఆమె పెళ్లి కూడా గుట్టుచప్పుడుకాకుండ చేసుకోవడంతో ఆమె పెళ్లి కబురు తెలిసి ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు. ఇదిలా ఉంటే హారిక భర్త పృథ్వీరాజ్‌ రెండు రోజుల క్రితం తమ పెళ్లి కార్డును తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా అది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సింగర్ పాపకి, సాఫ్ట్ వేర్ బాబుకి పెళ్లి.. తప్పకరండి అంటూ వినూత్నంగా పెళ్లి ఆహ్వానం ఇవ్వడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.


హారిక పెళ్లిలో సింగర్ రేవంత్ సందడి


దాంతో అతడి పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్లెబ్యాక్‌ సింగర్‌గా ఎప్పుడో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె మూడేళ్ల క్రితం వచ్చిన సరిగమప సింగింగ్‌ ఐకాన్‌ షోతో లైమ్‌లైట్లోకి ఇచ్చింది. ఈ షో తర్వాత హారికా పాడిన పాటలు బాగా వైరల్‌ అయ్యాయి. దీంతో ఆమెకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఆమె ప్లే బ్యాక్‌ సింగర్‌నే కాదు పలు స్టేజ్‌ షోల్లో పాటలు పాడి ఆకట్టుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన హారిక 'నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్‌ రోజ్‌)' సాంగ్‌తో యూత్‌కు కనెక్ట్‌ అయ్యారు. విభిన్నమైన వాయిస్‌తో ఎంతోమంది సినీ ప్రముఖుల్ని, సంగీత ప్రియుల్ని మెప్పించిన హారిక.. 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్‌ సింగర్స్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్‌ ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించింది.


Also Read: నేను అందంగా ఉండనని తెలుసు - అందరు అమ్మాయిల్లాగే నేను కూడా - సమంత షాకింగ్‌ కామెంట్స్


అలా గాయనిగా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హారిక.. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో టైటిల్ సాంగ్ పాడింది. అంతేకాదు తమిళ స్టార్ విజయ్ 'వారసుడు'లో 'థీ దళపతి' పాట కూడా ఆలపించింది ఈమెనే. ఇలా చెబుతూ వెళితే హారికా నారాయణ్ పాడిన హిట్ సాంగ్స్ లిస్ట్ చాలా సెద్దదే ఉంటుంది. నిశ్చితార్థం తర్వాత తనకు కాబోయే వాడి పేరు పృధ్వినాథ్ వెంపటి అని, వారిద్దరు లాంగ్‌ రిలేషన్‌లో ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆమె పోస్ట్‌ చేస్తూ.. "ఏడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఒక్కటి కాబోతున్నాం. మా ఇరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది. ఏడేళ్లు ఒకరినోకరం పూర్తిగా అర్థం చేసుకుని ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలు పట్టబోతున్నాం" తన పోస్ట్‌ చేసింది.