Samantha: నేను అందంగా ఉండనని తెలుసు - అందరు అమ్మాయిల్లాగే నేను కూడా - సమంత షాకింగ్ కామెంట్స్
Samantha About Her Look: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచారు. తాజాగా ఇండియా టూడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాలపై స్పందించారు.
అంతేకాదు తన మయోసైటిస్ వ్యాధితో పాటు తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలపై నొరువిప్పారు. తనపై వస్తున్న రూమర్స్, నెగిటివ్ ప్రచారం వల్ల తన మయసైటిస్ వ్యాధిని గురించి బయటపెట్టక తప్పలేదన్నారు.
అలాగే తానేప్పుడూ అంత బాగా లేననని, అంత అందంగా కూడా ఉండనంటూ తనపై తాను షాకింగ్ కామెంట్స్ చేసుకున్నారు. అందరు సాధారణ అమ్మాయిల్లాగే నన్ను నేను అనుకుంటానన్నారు.
ఇప్పటి వరకు ఆ ఆలోచనతోనే పని చేశానంటూ సమంత చెప్పుకొచ్చారు. తన మూవీ ప్రమోషన్స్ టైంలో హైడోస్ మెడికేషన్‌లో ఉన్నానని, ఆ టైంలో తనని ప్రమోషన్స్‌కి అటెండావాలని నిర్మాతలు చెప్పారన్నారు.
దాంతో తప్పక ప్రమోషన్స్‌లో పాల్గొన్నట్టు చెప్పారు. అప్పుడే మయోసైటిస్ వ్యాధి గురించి చెప్పానన్నారు. కానీ అందరు అప్పుడు నన్న సింపతీ ప్లే చేస్తుందంటూ ట్రోల్ చేశారు.
సింపతీ క్వీన్ అనే బిరుదు కూడా ఇచ్చారంటూ సమంత వాపోయింది. ఇక ఆమె నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా పాటపై గురించి కూడా చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ ఫస్ట్ షాట్‌లో భయంతో వణికిపోయానన్నారు. 6
ఈ సాంగ్ లిరిక్స్‌తో అసౌకర్యానికి గురయ్యానని, ఎందుకంటే సెక్సీ అనే పదం తనకు పడదన్నారు. కానీ నటనలో కొత్తదనం కోసం, నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ది ఫ్యామిలీ మ్యాన్‌లో రాజీ పాత్ర, పుష్ప ఐటెం సాంగ్‌లో నటించానని స్పష్టం చేశారు.