ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూలో కియారా అడ్వాణీ - రామ్ చరణ్ సినిమా తర్వాత!
మ్యాన్ ఆఫ్ మాసెస్, యుంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవడ్ డెబ్యూకు అంతా రెడీ! హిందీలో భారీ యాక్షన్ సినిమా చేసేందుకు కొమురం భీమ్ 'యస్' చెప్పారా? అంటే... 'అవును' అని బీటౌన్ అంటోంది. హ్యాండ్సమ్ & యాక్షన్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 'వార్ 2'లో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ కియారా అడ్వాణీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'సలార్' మీద భారం వేసిన ప్రభాస్ ఫ్యాన్స్ - మాస్ యాక్షన్ కోసం వెయిటింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఇప్పుడు 'సలార్' (Salaar Movie) కోసం ఎదురు చూస్తున్నారు. 'ఆదిపురుష్' విడుదలై ఇంకా వారం కూడా కాలేదు. అప్పుడే తర్వాత సినిమా కోసం ఎదురు చూపులు మొదలు అయ్యాయి. దీనికి కారణం కూడా 'ఆదిపురుష్' అని చెప్పక తప్పదు. 'ఆదిపురుష్' ఎంత మందికి నచ్చింది? విమర్శకులు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో జనాల టాక్ ఏంటి? వంటివి పక్కన పెడితే... మొదటి రోజు సినిమా భారీ వసూళ్ళు సాధించింది. బాక్సాఫీస్ బరిలో వంద కోట్లకు పైగా రాబట్టింది. అయినా సరే ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. దానికి కారణం 'ఆదిపురుష్'లో ప్రభాస్ కనిపించిన తీరు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
భయంకరమైన నెగిటివిటీ ఉన్నా భారీ కలెక్షన్స్ - మొదటి రోజు అదరగొట్టిన 'ఆదిపురుష్'
పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ (Prabhas) సినిమా 'ఆదిపురుష్'పై భయంకరమైన నెగిటివిటీ నెలకొంది. అందులో మరో సందేహం లేదు. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను ఏకిపారేశారు. అయినా సరే... బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్ళు రాబట్టింది. వంద కోట్లకు పైగా వసూళ్ళతో రికార్డులు నెలకొల్పింది. జూన్ 16న 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమాకు మొదటి రోజు 140 కోట్ల రూపాయల గ్రాస్ లభించిందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాతో కలిపి ఇప్పటి వరకు ఓపెనింగ్ డేలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఆరు ఉంటే... అందులో మూడు సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ట్రేడ్ వర్గాలు 136 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ఉంటుందని చెప్పాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
తెలుగులోనూ ఎంఎస్ ధోని 'ఎల్‌జిఎమ్' విడుదల - హైదరాబాద్ వస్తున్న కూల్ కెప్టెన్!
ఇండియన్ క్రికెట్ హిస్టరీలో కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. వన్డేలో ఒకటి, టీ20లో మరొకటి... దేశానికి రెండు వరల్డ్ కప్స్ తెచ్చిన ఘనత ఆయన సొంతం. ఓ ఐసీసీ ట్రోఫీ, మూడు ఏషియన్ కప్స్ తెచ్చారు. ఇప్పుడు ఎంఎస్ ధోని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించిన ఆయన... ఓ సినిమా నిర్మించారు. అది తెలుగులోనూ విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఎక్స్‌ట్రాక్షన్ 2 రివ్యూ: నెట్‌ఫ్లిక్స్ యాక్షన్ మూవీ ఎలా ఉంది?
2020లో వచ్చిన ‘ఎక్స్‌ట్రాక్షన్’ నెట్‌ఫ్లిక్స్‌కు పెద్ద గేమ్ ఛేంజర్. దీనికి వచ్చిన రివ్యూలు, పబ్లిక్ ఒపీనియన్ పక్కన పెడితే టేకింగ్, యాక్షన్ సన్నివేశాల గురించి ఎంతో చర్చ జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌కు విపరీతమైన సబ్‌స్క్రిప్షన్లు, వ్యూయర్‌షిప్‌ను ‘ఎక్స్‌ట్రాక్షన్’ తీసుకువచ్చింది. దీంతో సీక్వెల్‌గా ‘ఎక్స్‌ట్రాక్షన్ 2’ని కూడా నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించింది. ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)