పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ (Prabhas) సినిమా 'ఆదిపురుష్'పై భయంకరమైన నెగిటివిటీ నెలకొంది. అందులో మరో సందేహం లేదు. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను ఏకిపారేశారు. అయినా సరే... బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్ళు రాబట్టింది. వంద కోట్లకు పైగా వసూళ్ళతో రికార్డులు నెలకొల్పింది. 


'ఆదిపురుష్' @ 140 కోట్ల గ్రాస్!
జూన్ 16న 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమాకు మొదటి రోజు 140 కోట్ల రూపాయల గ్రాస్ లభించిందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాతో కలిపి ఇప్పటి వరకు ఓపెనింగ్ డేలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఆరు ఉంటే... అందులో మూడు సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ట్రేడ్ వర్గాలు 136 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ఉంటుందని చెప్పాయి. 






తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ఎంత కలెక్ట్ చేసిందంటే?
తెలుగు రాష్ట్రాల్లోనూ 'ఆదిపురుష్'మంచి వసూళ్లు నమోదు చేసింది. మొదటి రోజు సుమారు 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారీగా సినిమా కలెక్షన్స్ (షేర్) ఎలా ఉన్నాయి? అంటే...


నైజాం : రూ.  13.68 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.  2.72 కోట్లు 
సీడెడ్ : రూ. 3.52 కోట్లు 
నెల్లూరు :  రూ. 90 లక్షలు
గుంటూరు :  రూ. 4 కోట్లు (అందులో 1.2 కోట్లు హైర్ అని టాక్)
కృష్ణా జిల్లా : రూ. 2 కోట్లు 
తూర్పు గోదావ‌రి : రూ. 2.78 కోట్లు
పశ్చిమ గోదావ‌రి : రూ. 2.24 కోట్లు


తెలంగాణ, ఏపీ... రెండు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' సినిమాకు 32.84 కోట్ల రూపాయల షేర్ వచ్చిందట. గ్రాస్ చూస్తే... రూ.49.90 కోట్లు ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


హిందీలో నెట్ కలెక్షన్స్ ఎంతంటే?
'బాహుబలి'తో ప్రభాస్ హిందీ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. తెలుగులో సోసోగా ఆడిన 'సాహో' హిందీలో విజయం సాధించింది. నార్త్ ఇండియన్ మార్కెట్ నుంచి ఆ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు 'ఆదిపురుష్' హిందీ నెట్ వసూళ్లు కూడా బావున్నాయని తెలిసింది. మొదటి రోజు 'ఆదిపురుష్' హిందీ వెర్షన్ నెట్ వసూళ్లు రూ.36.5 కోట్లు అని సమాచారం. కరోనా తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమా ఇదేనని టాక్. వీకెండ్ తర్వాత వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.


Also Read ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన విజయ్ దేవరకొండ - టైటిల్ అదేనా?



'ఆదిపురుష్'లో రాఘవ / శ్రీ రామ చంద్ర మూర్తి పాత్రలో ప్రభాస్ నటించగా... ఆ రామ పత్ని జానకి / సీతా దేవి పాత్రలో కృతి సనన్ కనిపించారు. శేషు పాత్రలో సన్నీ సింగ్, లంకాధిపతి రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. హనుమాన్ పాత్రను మరాఠీ నటుడు దేవదత్తా నాగే పోషించారు. ఆయన నటనకు సర్వత్రా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ నేపథ్యంలో కొంత మంది ప్రేక్షకులు ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా చూడాలనే ఉద్దేశంలో ఉన్నారట. 


Also Read : ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూలో కియారా అడ్వాణీ - రామ్ చరణ్ సినిమా తర్వాత!