'కెజియఫ్', 'కాంతార' రికార్డులు బ్రేక్ చేసిన 'హనుమాన్'
బాక్సాఫీస్ బరిలో భారీ సినిమాలను వెనక్కి నెడుతూ... 'హనుమాన్' పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... హిందీలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు లిఖిస్తోంది. తేజ సజ్జ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వండర్స్ క్రియేట్స్ చేస్తోంది. ఉత్తరాదిలో రెండు కన్నడ సినిమా రికార్డులను 'హనుమాన్' బ్రేక్ చేసింది. నార్త్ ఇండియాలో విడుదలైన ఆరు రోజుల్లో 'హనుమాన్' రూ. 21.02 కోట్లు కలెక్ట్ చేసింది. బుధవారం ఈ సినిమాకు రూ. 2.25 కోట్లు వచ్చాయి. గురువారం కలెక్షన్స్ కలిపితే... ఈజీగా 23 కోట్లు వస్తాయి. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కెజియఫ్' పార్ట్ 1కు హిందీలో ఫస్ట్ వీక్ 20 కోట్ల లోపే వచ్చాయి. రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'కాంతార'కు కూడా అంతే! హిందీలో డబ్ అయిన సినిమా కలెక్షన్స్ చూస్తే... మొదటి వారంలో 'కెజియఫ్', 'కాంతార'లను 'హనుమాన్' వెనక్కి నెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ వాయిదా పడనుందా? - కారణం ఏంటి?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో 'ఇస్మార్ట్ శంకర్' ఒకటి. ఇక ఈ సినిమా పాటలు అప్పట్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ కంపోజ్ చేసిన మాస్ ఆల్బమ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు పూరీ జగన్నాథ్. తన సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ ద్వారా చార్మీతో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ను నిర్మిస్తున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' - ఉత్కంఠగా సాగిన ట్రైలర్
యంగ్ హీరో సందీప్ కిషన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఇది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది. గతంలో ఈ కాంబోలో 'టైగర్' మూ వీవచ్చింది. ఇప్పుడు యాక్షన్ అడ్వెంచర్‌తో రాబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్,ప్రచార పోస్టర్, టీజర్, పాటలు మూవీపై అంచనాలు పెంచాయి. అంతేకాదు ఈ సినిమాలో సందీప్ కిషన్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలకు ముందే చిత్ర పాటలు రికార్టు క్రియేట్ చేశాయి. ఫస్ట్ సాంగ్ 'నిజమే నే చెబుతున్నా..' పాట అయితే యూట్యూబ్‌ని షేక్ చేసింది. సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుని మిలియన్ల వ్యూస్ సాధించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా సినిమా షురూ
ఇప్పుడు ధనుష్‌ను కేవలం తమిళ హీరోగా మాత్రమే చూడలేం. ఆయన ఒక్క తమిళ సినిమాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. హిందీలో సినిమాలు చేశారు. తెలుగులోనూ చేస్తున్నారు. ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో డబ్ కావడమే కాదు... మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ధనుష్ ఆసక్తి చూపిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' చేశారు. అది ఆయనకు తొలి తెలుగు (స్ట్రెయిట్) సినిమా. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇంకో సినిమా అంగీకరించారు. ఆ సినిమా ఈ రోజు సెట్స్ మీదకు వెళ్లింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
డేంజరస్ హౌజ్‌వైఫ్ వచ్చేస్తోంది - ‘భామా కలాపం 2’ గ్లింప్స్ చూశారా?
ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడు లేడీ ఓరియెంట్ కథలతో కూడా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. ఆ తర్వాత తను నటించిన సినిమాల నుండి ఆశించినంత సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. చాలారోజుల తర్వాత ‘భామా కలాపం’ అనే ఓటీటీ కంటెంట్‌లో లీడ్‌గా నటించి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ‘భామా కలాపం’.. ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో విడుదలయినా.. ఇప్పుడు దీని సీక్వెల్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలయ్యింది. ‘భామా కలాపం 2’లో లీడ్ రోల్స్ చేసిన ప్రియమణి, శరణ్య ప్రదీప్‌లను ఈ గ్లింప్స్‌లో హైలెట్ చేసి చూపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)