ఇప్పుడు ధనుష్ (Dhanush)ను కేవలం తమిళ హీరోగా మాత్రమే చూడలేం. ఆయన ఒక్క తమిళ సినిమాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. హిందీలో సినిమాలు చేశారు. తెలుగులోనూ చేస్తున్నారు. ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో డబ్ కావడమే కాదు... మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ధనుష్ ఆసక్తి చూపిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' చేశారు. అది ఆయనకు తొలి తెలుగు (స్ట్రెయిట్) సినిమా. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇంకో సినిమా అంగీకరించారు. ఆ సినిమా ఈ రోజు సెట్స్ మీదకు వెళ్లింది.


పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమా
ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలో టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.


నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో... సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి. సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 17న) పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ధనుష్ మీద కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.


Also Read: జయరామ్ పెళ్లాంతో సరిగా కాపురం చేసే క్యారెక్టర్లు చేయరా?






ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల సినిమా పూజా కార్యక్రమాలకు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్, అభిషేక్ నామా తదితరులు హాజరయ్యారు. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమా తమిళంలో విడుదల కాగా... తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ బుధవారం నాగార్జున, వెంకటేష్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.






రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత...
'ఫిదా', 'లవ్ స్టోరీ'... రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తెలుగులో సంక్రాంతి హిట్ 'నా సామి రంగ' తర్వాత నాగార్జున, తమిళంలో పొంగల్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్' తర్వాత ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. రామకృష్ణ & మౌనిక దంపతులు ప్రొడక్షన్ డిజైనర్లు.


Also Readసీడెడ్, గుంటూరులో లాభాల్లోకి 'నా సామి రంగ' - నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందంటే?