Guppedanta Manasu Serial Today Episode: మినిస్టర్‌తో కలిసి రిషి చేస్తోన్న సీక్రెట్ టాస్క్ ఏమిటో తెలుసుకోవాలని శైలేంద్ర ఫిక్స్ అవుతాడు. బోర్డ్ మీటింగ్ ముగిసిన తర్వాత రిషి చేస్తోన్న సీక్రెట్ వర్క్ తనకు తెలియాలని వసుధారను బెదిరిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర...శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు.
మహేంద్ర: నీకు ఈ కాలేజీకి సంబంధం లేదు. నువ్వు ఇప్పటివరకు చేసిన దుర్మార్గాలు సరిపోలేదా...ఇంకా పాపాలకు ఒడిగడుతున్నావు. ఇప్పుడు రిషి చేస్తోన్న పనేమిటో తెలుసుకొని దానిని నాశనం చేస్తావా? నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది.
శైలేంద్ర : రిషి చేస్తోన్న సీక్రెట్ ఆపరేషన్ ఏమిటో ఖచ్చితంగా నాకు తెలియాల్సిందే ఇది మీ పర్సనల్ వర్క్ కాదు. కాలేజీ వర్క్ కాబట్టి బోర్డ్ మెంబర్స్ అందరికి తెలియాలి. ఆ పని సరైందని అందరూ అనుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. అంతేకానీ ఎవరికి చెప్పకుండా సీక్రెట్ ఆపరేషన్ అంటూ చెప్పడంలో న్యాయం లేదు.
మహేంద్ర: న్యాయన్యాయల గురించి నువ్వే మాట్లాడాలి.
అంటూ మహేంద్ర కోపంగా అరవగానే.. మీరు నా తండ్రిని మోసం చేస్తున్నారంటూ.. మహేంద్రను రెచ్చగొట్టి రిషి చేస్తోన్న వర్క్ ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటాడు శైలేంద్ర. కానీ అతడి ప్లాన్‌ను మహేంద్ర కనిపెడతాడు. ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాటతీస్తానని శైలేంద్రను హెచ్చరిస్తాడు మహేంద్ర. మరోవైపు వసుధార బావ వసుధార ఫోటో పట్టుకుని ఆటలు ఆడుకోవడం నీకే కాదు నాకు వచ్చు అని వసుధార ఫొటో చూస్తూ అంటాడు. ఈ బావను దెబ్బకొట్టి రిషిని పెళ్లి చేసుకుంటే ఎలా అంటూ వసుధారపై ద్వేషంతో రగిలిపోతాడు. నువ్వు ఎవడి కోసమైతే నన్ను దెబ్బకొట్టావో వాడినే చంపేయబోతున్నానని వసుధార బావ అంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా వదిలే సమస్య లేదని రగిలిపోతుంటాడు వసుధార బావ.
తండ్రికి ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది వసుధార.
వసుధార: మేము ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం...కానీ మా మనసంతా రిషి మీదే రిషి ఎక్కడున్నాడో మామయ్యకు తెలియదు. రిషి సార్‌కు దూరంగా ఉండటం మామయ్యకు ఇష్టం లేదు. కానీ నా మాట కాదనలేక వదిలిపెట్టి ఉంటున్నారు.
చక్రపాణి: రిషికి దూరంగా ఉంటున్నందుకు ఆయన ఎంతబాధపడుతున్నారో...ఎంత మదనపడుతున్నారో రిషి ఎక్కడున్నాడో తెలియక మహేంద్ర చిత్రవథ అనుభవిస్తుంటారు. రిషి ఇక్కడ ఉన్న విషయం మహేంద్రకు చెబితేనే మంచిదేమో..?
అంటూ చక్రపాణి అడగ్గానే.. వసుధార అందుకు ఒప్పుకోదు. రిషి ఎక్కడున్నది మహేంద్రకు చెబితే ఆయన ప్రవర్తన ద్వారా రిషి ఆచూకీని శైలేంద్ర ఈజీగా కనిపెడతాడని తండ్రికి బదులిస్తుంది వసుధార. మహేంద్ర ఎంత బాధపడుతున్న రిషి ఎక్కడున్నది ఆయనకు చెప్పడం లేదని అంటుంది. రిషి కోలుకున్న తర్వాత డైరక్టుగా ఆయన్ని మహేంద్ర ముందుకు తీసుకెళతానని తండ్రితో అంటుంది వసుధార.. అయిన వాళ్లు ప్రాణాలు తీయాలని చూస్తే ఏం సంబంధం లేనివాళ్లు అతడి ప్రాణాలను కాపాడుతున్నారు అంటూ ఎమోషనల్ అవుతాడు చక్రపాణి.
శైలేంద్ర, దేవయాని దగ్గరకు వచ్చి రిషి చక్రపాణి దగ్గరే ఉన్నాడని, అతడే రిషిని ఎక్కడో దాచిపెట్టాడని శైలేంద్ర అనుమానపడతాడు.
శైలేంద్ర: బోర్డ్ మీటింగ్‌లో రిషి లేడనే పాయింట్‌ను హైలైట్ చేసి మినిస్టర్ ముందు అతడిని ఇరికించాలని అనుకున్నాను. లాస్ట్ మినిట్‌లో రిషి వాయిస్ మెసేజ్ పంపించడంతో ప్లాన్ అంతా బెడిసికొట్టింది.
దేవయాని: శైలేంద్ర నువ్వు తొందరపడకు బాగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకో..
అనగానే రిషి పంపించిన వాయిస్ మెసేజ్‌ను తల్లికి వినిపిస్తాడు శైలేంద్ర. రిషి ఎక్కడున్నాడో ఎవరికి తెలియకుండా వసుధార మ్యానేజ్ చేస్తుందని శైలేంద్ర ఆవేశానికి లోనవుతాడు. మరోవైపు అర్ధరాత్రి వరకు కాలేజీ పనులు చేస్తూ ఉంటుంది వసుధార. ఆ పనుల్లో తాము సాయపడుతామని మహేంద్ర, అనుపమ అడుగుతారు. కానీ ఈ పనులు తాను మాత్రమే చేయాల్సినవని వసుధార చెప్తుంది. రిషి సలహాతోనే ఇవన్నీ చేస్తున్నానని… కానీ రిషి తన పక్కన లేకపోవడం బాధను కలిగిస్తుందని.. రిషితో తన తీపి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకొని వసుధార ఎమోషనల్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్‌కే ఆ ట్యాగ్ ఇస్తున్న హీరోయిన్లు - కేతికా కూడా ఆ మాట అనేసింది