Trinayani Today Episode: నయని హడావుడిగా ఓ సంచిలో విశాలాక్షి, డమ్మక్క, ఎద్దులయ్యల బట్టలు సర్దుతుంది. విశాల్ వచ్చి ఏం చేస్తున్నావ్ నయని అని అడిగితే సంచిలో ముగ్గురి బట్టలు సర్దాను. ముగ్గురిని శీశైలంలో విడిచిపెడతారో లేక హిమాలయాల్లో వదులుతారో మీ ఇష్టం అని అంటుంది. ఏమైంది అని విశాల్ అడిగితాడు. దానికి నయని..


నయని: ఇంకేం కావాలి ఇక్కడే ఉంటే ఈ ముగ్గురిలో ఎవరికి ఏం జరుగుతుందా అని భయంగా ఉంది. చూశారు కదా విశాలాక్షి తల అంటుకుంది. టెన్షన్‌తో నాకేం అవుతుందో అని భయంగా ఉంది. 
విశాల్: నయని కూల్ ఎవరికి ఏం కాదు.. అందుకు నువ్వే గ్యారెంటీ.. నిజం నయని.. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ముందు గ్రహించేది నువ్వే.
నయని: కానీ విశాలాక్షి విషయంలో నేను చెప్పలేకపోతున్నాను. నిర్లక్ష్యం చేస్తే చిన్నపిల్ల తెలిసీ తెలియక చేసే పనులకు ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది అని భయంగా ఉంది. 
విశాల్: డమ్మక్క, ఎద్దులయ్యలని కూడా ఎందుకు వెళ్లిపోమని చెప్తున్నావ్.
నయని: వాళ్లు ఉంటే విశాలాక్షి అప్పుడప్పుడైనా వస్తూ ఉంటుంది. అందుకే ముగ్గురిని వదిలేసి రమ్మంటున్నాను. ఎవరూ లేకుండానే ఇన్నాళ్లు ఉన్నారు కదా ఇప్పుడు అలానే ఉంటారు.
ఎద్దులయ్య: మాతా మన్నించాలి మా అమ్మ విశాలాక్షి.. నిన్ను అమ్మా అని పిలుస్తుంది. నీ బిడ్డగానే భావించావ్.. ఇప్పుడు పంపించేస్తావా మాతా..
నయని:  మా అత్తయ్య తన తల మీద భోగిపళ్లు పోయగానే ఏం జరిగిందో తెలుసుకదయ్యా.. 
ఎద్దులయ్య: ఏం జరిగినా మంచికే అనుకో మాతా..
నయని: నాకు తెలీకుండా ఏం జరిగినా నేను ఆపలేకపోయాను అనే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. 
విశాల్: నయని విశాలాక్షి కూడా నీ బిడ్డే కాబట్టి తనకి కూడా ఏం జరగినా నువ్వు ముందే తెలుసుకోలేకపోతున్నావ్ అనుకో. 
నయని: నాన్న.. అమ్మా అనకపోయినా పర్లేదు. తనని బిడ్డా అనుకోను. కానీ తను క్షేమంగా ఉంటే అదే చాలు.
ఎద్దులయ్య: అమ్మల్ని కన్న అమ్మ బిడ్డలు కన్న అమ్మ ఈ ఇద్దరి మధ్య విబేధం.. 
విశాల్: నయని పండగ కూడా పూర్తికాలేదు అప్పుడే ఆడబిడ్డని ఇంటి నుంచి పంపించేస్తావా..
ఎద్దులయ్య: అమ్మ ఉంటేనే వీళ్ల అమ్మ ఎవరో తెలుస్తుంది మాతా. అదే గాయత్రీ అమ్మ గురించి తెలుస్తుంది అన్నాను మాతా. రేపో మాపో జరగబోయే సంఘటనలే సమస్యని దాని వెంట పరిష్కారాన్ని తెచ్చి పెడతాయ్. 
విశాల్: అయితే విశాలాక్షిని పంపించేయడమే కరెక్ట్.
నయని: వద్దు బాబుగారు గాయత్రీ అమ్మ గురించి తెలుస్తుంది అన్నారు కదా అందుకు ముగ్గురు ఇంట్లోనే ఉండాలి. 


ఇంట్లో అందరూ ఆరుబయట పిడకల మీద పాయసం వండేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇక ఎప్పటిలానే సుమన, వల్లభ, తిలోత్తమలు వెటకారం చేస్తారు. ఇక విశాలాక్షి పాయసం కుండను రాళ్లపై పెట్టి తన తలమీద పుల్లను తిలోత్తమ పెడితే నిన్నటి అగ్గి వస్తుందని చెప్తుంది. తిలోత్తమ కట్టెపుల్లని తీసుకొని విశాలాక్షి తల మీద పెడితే మంట వస్తుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు. ఇక భయపడుతూనే తిలోత్తమ ఆ అగ్గిని పొయ్యిలో పెడుతుంది. దీంతో పిడకలు అంటుకుంటాయి. 


పావనా: చూశావా సుమన అమ్మ పచ్చి గొబ్బెమ్మలు కూడా ఎంత ధగధగమని మండుతున్నాయో.
విక్రాంత్: కొంత మందికి లోలోపలే రగిలిపోతుంది. వాళ్లకి ఎప్పటికీ శాంతి ఉండదు. చలికాలం కూడా చల్లగా ఉండదు అలాంటి వాళ్లకి.
నయని: పాయసం అవ్వగానే సూర్య దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ పంచుదాం.
విశాలాక్షి: ప్రసాదం తినే మందు ఒక షరతు అమ్మా. ఒకరు ఇంకొకరికి వడ్డించాలి. ఒక ముద్ద తిని వడ్డించినవారు అడిగే ప్రశ్నకు నిజాయితీగా నిజం చెప్పాలి. 
ఎద్దులయ్య: ఇది సరదాగా ఆడే ఆట కాదు మాతా. ఒక వేళ అబద్ధం చెప్తే తిన్న ప్రసాదమే ప్రాణాలను హరించివేస్తుంది. 
విక్రాంత్: తనే పాయసం వల్ల ప్రాణం ఎలా పోతుంది.
డమ్మక్క: మంచి ప్రశ్న పుత్ర.. మనిషిని మోసం చేయొచ్చుకానీ మనస్శాక్షిని మోసం చేయలేము. అసత్యం పలికామని ఆత్మకి తెలీగానే అది శరీరాన్ని విడిచిపెడుతుంది. 
హాసిని: ఏదైనా జరిగేది అబద్ధం చెప్పినప్పుడే కదా..
విశాలాక్షి: ఈరోజు చెప్తారు.
నయని: ఎవరు..
విశాలాక్షి: చూస్తారు కదా అమ్మా.. ఎవరు సుమంగళిగా పోతారో ఎవరు ఎవరి కుంకుమని చెరిపేస్తారో.. 


అందరూ హాల్‌లో కూర్చొంటే విశాలాక్షి, ఎద్దులయ్య, డమ్మక్కలు అందరికీ పాయసం వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇక సుమన పిడకల మీద వండిన పాయసం ఎలా తింటారు అని విసుక్కుంటుంది. ఇక హసిని తినకపోతే మానేయ్ అంటుంది. దానికి విక్రాంత్ నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి ఇలా చేస్తుందదని అంటాడు. ఇక సుమన అడగడంతో విశాలాక్షి సుమనకు ముందు పాయసం పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: నాగ పంచమి సీరియల్ జనవరి 17th: మోక్షని కాటేసిన పంచమి.. ఫణేంద్ర చెప్పిన మంత్రంతో నాగలోకం చేరుకున్న మేఘన!