Naga Panchami  Today Episode: చీకటి పడి చాలా సేపు అయిందని.. తొందరగా పాములా మారి మోక్షని కాటేయమని ఫణేంద్ర పంచమికి చెప్తాడు. ఆలస్యం అయితే నాగలోకం వెళ్లి చంద్రకాంత మొక్కని తీసుకురావడం కష్టమని చెప్తాడు. పంచమి ఏడుస్తుంది. మోక్ష పంచమి వైపు దీనంగా చూస్తూ ముందుగా సిద్ధం చేసిన పడక మీద పడుకుంటాడు. మరోవైపు మేఘన పంచమిలా మారి ఫణేంద్ర దగ్గర నుంచి చెప్పించుకున్న మంత్రాన్ని చదువుతుంది. దీంతో తాను ఉన్న చోట నుంచి నాగలోకం పయనమవుతుంది. 


ఫణేంద్ర: మోక్ష నువ్వు  కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయ్. కొంచెం కూడా భయపడకు.
మోక్ష: అలాగే ఫణేంద్ర.
ఫణేంద్ర: యువరాణి ఇక నీదే ఆలస్యం. తెలుసుకదా యువరాణి.. కళ్లు  మూసుకొని నాగదేవతని ప్రార్థించు పాముగా మారిపోతావ్.. (పంచమి పాముగా మారుతుంది) వెళ్లు యువరాణి.. వెళ్లి మోక్షన కాటేయ్.. ఆలోచించకు ఆలస్యం అయిపోతుంది. త్వరగా వెళ్లి కాటేయ్.. పంచమి ఆలోచిస్తుంటే.. ఫణేంద్ర పాములా మారి వైబ్రేషన్స్‌తో పంచమికి ఏదో చెప్తాడు. దాంతో పంచమి వెళ్లి మోక్షని కాలిపై కాటేస్తుంది. నొప్పితో మోక్ష విలవిల్లాడిపోతాడు. 
నాగసాధువు: మోక్ష ఓర్చుకో నాయనా కొంచెం ఓర్చుకో.. 
మోక్ష: పంచమి.. పంచమి అని ఏడుస్తాడు..
పంచమి: మోక్ష బాబు.. మోక్షా బాబు నన్ను క్షమించండి.. నాకు చాలా బాధగా ఉంది.. 
ఫణేంద్ర: యువరాణి నువ్వు త్వరగా బయల్దేరాలి.. తను బాధని భరించలేకపోతున్నాడు. విషం తలకెక్కిపోతుంది. వెంటనే మంత్రాన్ని చదువు. నాగలోకానికి వెళ్లిపోతావు.
పంచమి: అయితే త్వరగా మంత్రం చెప్పు ఫణేంద్ర.
ఫణేంద్ర: మంత్రం ముందే చెప్పాను కదా యువరాణి. 
పంచమి: నువ్వు నాకు మంత్రం చెప్పావా..
ఫణేంద్ర: అవును యువరాణి ఇంతకు ముందే కదా ఆ చెట్టు దగ్గర మంత్రం చెప్పాను.
పంచమి: మోసం చేయకు ఫణేంద్ర. అసలు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదల్లేదు. 
ఫణేంద్ర: పాముగా మారగానే నువ్వు మంత్రం మర్చిపోయినట్లున్నావ్. నేను చెప్పిందే నిజం.
పంచమి: అబద్ధం.. మరోవైపు మోక్ష నొప్పితో విలవిల్లాడిపోతాడు... మోక్షాబాబు ఇదంతా నా వల్లే జరిగింది.. అంటూ ఏడుస్తుంది.  ఆ తర్వాత ఫిణేంద్ర నీ మీద నాకు అనుమానంగానే ఉంది. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు నమ్మాను. నట్టేట ముంచేశావు. నమ్మకద్రోహివి నువ్వు. కావాలనే మోసం చేశావు. 
ఫణేంద్ర: నేను చెప్పేది నిజం యువరాణి.. నేను నీకు మంత్రం చెప్పాను.
పంచమి: లేదు ఫణేంద్ర. నీ దుర్భుద్ధి అర్థమైంది.. ఎలా అయినా నాతో నా భర్తని కాటేయించి నన్ను నాగలోకానికి తీసుకెళ్లిపోవడమే నీ ఉద్దేశం. అందుకోసం ఎన్ని కపట నాటకాలు అడావ్.. ఎన్ని అబద్ధాలు చెప్పావు. నిన్ను చంపినా పాపం లేదు. నువ్వు పరమదుర్మార్గుడివి. నువ్వు నాశనం అయిపోతావ్.. అయ్యో మోక్షాబాబు. ఇప్పుడు నా భర్తని బతికించేది ఎవరు... నన్ను చంపేయండి మోక్షాబాబు. ఆ దుర్మార్గుడి మాటలు నమ్మి నేను మోసపోయాను. మీ కంటే ముందు నేనే చచ్చిపోతాను మోక్షాబాబు. నేను బతకను. 
నాగసాధువు: అమ్మా పంచమి ఆందోళన చెందితే సమస్య పరిష్కారం కాదు. మోక్ష ప్రాణాలతో పోరాడుతున్నాడు.
ఫణేంద్ర: స్వామి మీరైనా నమ్మండి. నేను మంత్రం చెప్పాను. 
నాగసాధువు: సరే ఫణేంద్ర.. ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ మంత్రం మరోసారి చెప్పు. 
ఫణేంద్ర: ఆ అవకాశం లేదు స్వామి. ఒక్కరికే చెప్పగలను. అది ఒక్కసారి ఒక్కరికే పనికొస్తుంది. ఇక నాగలోకం వెళ్లి ఆ మొక్కను తేవడం జరగదు. వీలైనంత వరకు నేను విషం లాగే ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర ఉన్న మూలికలు ప్రయోగించండి. 
నాగసాధువు: అలాగే ఫణేంద్ర. 


నాగసాధువు వేరును మోక్ష నోటిలో పెట్టి నమిలి రసం మింగమని చెప్తారు. ఇక ఫణేంద్ర పాములా మారి కొంత విషాన్ని తీస్తాడు. మరోవైపు పంచమి మోక్షని చంపేస్తుందని.. తర్వాత తమకు పని పడుతుందని జ్వాల, చిత్రలు అనుకుంటారు. భోజనాలు సిద్ధం చేసి అందర్ని పిలుస్తారు. వైదేహి ఏడుస్తుంటుంది. పంచమిని తిడుతుంది. మోక్షని పంచమిని రానివ్వదని.. ఇక మోక్ష ఇంటికి రాడు అని తాము ఇక మోక్షని చూడలేమని జ్వాల అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక మోక్ష రాకపోతే తాను కూడా చనిపోతానని వైదేహి తన భర్తని పట్టుకొని ఏడుస్తుంది.


మరోవైపు మేఘన పంచమి రూపంలో నాగలోకం చేరుకుంటుంది. నాగలోకం చూసి తెగ మురిసిపోతుంది. తర్వాత నాగమణి ఉన్న దగ్గరకు వెళ్తుంది. నాగమణిని చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: సీతే రాముడి కట్నం జనవరి 17th - 'సీతే రాముడి కట్నం' సీరియల్: టైలరింగ్ మానేస్తానని మాటిచ్చిన సీత, కోడలికి చుక్కలు చూపిస్తానన్న మహాలక్ష్మి