Seethe Ramudi Katnam Serial Today Episode: జీ తెలుగులో ప్రసారమవుతున్న మరో ఇంట్రస్టింగ్ సీరియల్ సీతే రాముడి కట్నం. ఈ సీరియల్‌లో అత్తాకోడళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని సరికొత్తగా చూపిస్తున్నారు. అందానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే కాస్మోటిక్ వ్యాపారాలు చేసే ధనవంతురాలు అత్త మహాలక్ష్మి. సహజమైన అందాని, తన సెల్ప్‌ రెస్పెక్ట్‌కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి టైలరింగ్ చేసుకునే అమ్మాయి సీత. పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటూ పిన్ని మహాలక్ష్మి మాటకు ఎదురు చెప్పలేక ఆమె చెప్పినట్లు తమ బిజినెస్‌లు చూసుకునే అబ్బాయి రామ్. అందానికి ప్రాధాన్యత ఇచ్చే మహాలక్ష్మీ తన కొడుకు రామ్‌కు ఓ అందమైన గొప్పింటి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది. కానీ అనుకోకుండా సీతకు, రామ్‌కు పెళ్లి జరుగుతుంది. అందంగా లేదని మహాలక్ష్మి అనుకున్న సీతకు తన ముద్దుల కొడుకు రామ్ పెళ్లి చేసుకోవడం ఆమెకు ఏమాత్రం నచ్చదు. ఈ తరుణంలో అత్తాకోడళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సీతే రాముడి కట్నం..  


టైలరింగ్ మానేయమని సీతకు చెప్పమని రామ్‌కు తన పిన్ని మహాలక్ష్మి చెప్తుంది. మహాలక్ష్మి మాట జవదాటని రామ్ సీతని ఒప్పిస్తాడు. టైలరింగ్ మానేస్తానని తన పిన్నికి మాట ఇవ్వమని ఆమె దగ్గరకు సీతని తీసుకొస్తాడు. ఇక సీత తన భర్త మాటకు గౌరవం, ప్రేమతో టైలరింగ్‌ మానేస్తానని మాటిస్తుంది. 


సీత: ఈ క్షణం నుంచి నేను టైలరింగ్ మానేస్తా.. ఇంటి బయట పెట్టిన బోర్డు కూడా తీసేస్తా. కాకపోతే నా సంపాదనతోనే నా భార్య తింటుంది అని నా భర్త మీకు చెప్పలేడు కాబట్టి.. అంటే ఆయనకు మీ మీద గౌరవం, ప్రేమ కాబట్టి.. మీ మాటకు విలువ ఇవ్వాలి కాబట్టి ఆయన చెప్పాల్సిన మాట నేను చెప్తున్నా. నేను ఊరికే తిని కూర్చొనే రకం కాదు. నన్ను తేరగా తిని కూర్చొబెట్టాలి అనే మీ ఆలోచనలు మానేసి నన్ను ఇంటి పనులు అయినా చేయనివ్వండి. అప్పుడే ఊరికే తింటున్నా అన్న ఫీలింగ్ నాకు ఉండదు. తేరగా తిండి పెడుతున్నామ్ అన్న ఫీలింగ్ మీకు ఉండదు. ఈ డీల్ మీకు ఓకేనా..
మహాలక్ష్మి: నాకు ఓకే..
సీత: మీకు నాకు డీల్ సెట్ అయింది. ఇంక నేను వెళ్లనా..
రామ్: మీరు చెప్పినట్లే చేశాను. ఇక మీకు సీతతో ఏ ప్రాబ్లమ్ ఉండదు.
మహాలక్ష్మి: సీతకు నువ్వు రిక్వెస్ట్ చేశావా రామ్.
రామ్: లేదు పిన్ని. తను కొంచెం ఓవర్‌గా చెప్పింది అంతే..
మహాలక్ష్మి: ఇప్పటికీ మించి పోయింది ఏం లేదు లక్ ఇంకా మనవైపే ఉంది. ఏదో ఒక విధంగా అది మన ఇంట్లోనే ఉండాలి అనుకుంటుంది. దాన్ని ఈ ఇంట్లో సుఖంగా ఉండనివ్వకూడదు.
మహాభర్త: సీతకు రామ్ సపోర్ట్ మొదలైనట్లుంది మహా. అలా అయితే మనం ఏం చేయలేం. 
మహాలక్ష్మి:  మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ మూర్ఖురాలు సీత తన గొయ్యి తనే తవ్వుకుంది. టైలరింగ్ ఆపేస్తాను అని చెప్పి సైలెంట్‌గా తల వంచుకుంటానని వెళ్లిపోకుండా.. ఇంటి పనులు అన్నీ తానే చేస్తానని ఒప్పుకుంది. సో రేపటి నుంచి సరికొత్త గేమ్ స్టార్ట్ చేద్దాం. 


 సూర్య తన మామ మాటలు గుర్తుచేసుకొని బాధ పడతాడు. అప్పుడు అక్కడికి తన వదిన వస్తుంది. కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. తాను జాబ్ రావాలి అని తిడుతున్నా అని అంతకు మించి ఏం లేదని అంటుంది. ఉద్యోగం లేదని దెప్పిపొడుస్తుంది.  


సూర్యవదిన: నేను చెప్పినట్లే చేశావంటే నీకు పెద్ద ఉద్యోగంతో పాటు ఎక్కువ జీతం కూడా వస్తుంది. మహాలక్ష్మీ గారు తెలుసు కదా.. అదే మీ మరదలు సీత వాళ్ల అత్త. ఆవిడకి మన మధు అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు మధుని తన కోడల్ని చేసుకోవాలి అనుకుంది కదా.. మహాలక్ష్మి గారికి మన మధు మీద ఆ  అభిమానం ప్రేమ ఇంకా ఉన్నాయి.  
సూర్య: మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వదినా.
సూర్యవదిన: మహాలక్ష్మి గారికి ఎన్నో   బిజినెస్‌లు, వ్యాపారాలు ఉన్నాయి. వేల మంది అమె దగ్గర పనిచేస్తుంటారు. మన మధుతో ఆమెకు ఒక్కమాట అడిగిస్తే నీకు వెంటనే ఉద్యోగం వస్తుంది. ఏమంటావ్ సూర్య. 
సూర్య: మధు కాదు అనుకున్న ఆవిడని ఉద్యోగం ఎలా అడగడం అని.. వద్దులే వదినా.. మధు నా జాబ్ కోసం మహాలక్ష్మి గారిని రికమండేషన్ అడుగుతావా..
మధు: ఆవిడనా.. సారీ సూర్య ఆవిడకు నేను ఎలా అడగగలను. నన్ను తన కోడల్ని చేసుకోవాలి అని తను అనుకున్నారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని నీకు జాబ్ కావాలి అని ఆవిడని అడగను అంటుంది. దీంతో సూర్య ఆ ఇంట్లో నీ సరదాలు, సంతోషాలకు తిరగావు కానీ జాబ్ అడగాలి అంటే నామోషీనా అని సూర్య రెచ్చిపోతాడు. ఇక మధుని తన తోటికోడలు మళ్లీ రెచ్చగొడుతుంది. సూర్యదే తప్పు అని మాట్లాడుతుంది. మధు మనసు రామ్‌ వైపు మల్లేలా మాట్లాడుతుంది. 


రామ్: ఏం చేస్తున్నావ్ సీత. టైలరింగ్ పని వద్దు అని చెప్పాను కదా మళ్లీ నువ్వేం చేస్తున్నావ్.
సీత: బ్యాలెన్స్ వర్క మామ. ఈ వర్క్ కోసం నేను అడ్వాన్స్ తీసుకున్నా కదా వీటిని పూర్తి చేసి ఇచ్చేస్తా. రేపటి నుంచి  మీరు చెప్పినట్లే చేస్తాను మామ. ఇక ఆ పని మొత్తం నువ్వు చేయలేవని రామ్ అంటే సీత హెల్ప్ చేయమని అంటుంది. దీంతో రామ్ తనకు అలాంటి పనులు రావని నచ్చవని చెప్పినా సీత రామ్‌కు సూదిలో దారం ఎక్కించడం నేర్పిస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  'సత్యభామ' సీరియల్ జనవరి 17th: క్రిష్‌ తల్లి భైరవితో సత్య గొడవ, అప్పుడే తోటికోడలికి సపోర్ట్‌గా వచ్చేసిందిగా!