Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మా వదిన జోలికి, నా కుటుంబం జోలికి వచ్చావంటే ఊరుకునేది లేదు. నీవలన ఇకపై మా వదిన కళ్ళలో నీళ్లు చూశానంటే సమాధానం ఇంత సింపుల్గా చెప్పను. జాగ్రత్తగా ఆలోచించుకో నీ యాక్షన్ ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి మళ్లీ తను ప్లేస్ కి వచ్చి కూర్చుంటుంది ధాత్రి.


కౌషికి: నిజంగా ఈ అమ్మాయి మా ఇంటి కోడలు అయి ఉంటే ఎంత బాగుండేది. నిజంగా కేదార్ తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా అదృష్టవంతులు అని ధాత్రిని అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉంటుంది.


ఆ విషయం ధాత్రి, కేదార్ ఇద్దరు గమనిస్తారు. అక్క ఎందుకు నిన్నే తదేకంగా చూస్తుంది అని అడుగుతాడు కేదార్.


ధాత్రి: నన్ను పొగడాలనుకుంటుంది కానీ పొగిడితే అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కడ ఇంట్లో సెటిలైపోతాను అని భయపడుతుంది అని చెప్తుంది.


మరోవైపు కోపంతో రగిలిపోతున్న దివ్యాంక ప్రతిరోజు కౌషికి ఏడ్చే పరిస్థితి తీసుకు వస్తాను అప్పుడేం చేస్తుందో చూద్దాం అని మనసులో అనుకుంటుంది.


ఇంతలో గవర్నర్ గారు రావడం మీడియా మిత్రుల గురించి మాట్లాడటం జరుగుతుంది. బెస్ట్ రిపోర్టర్ గా సురేష్ ని పిలవడంతో స్టేజి మీదకి వెళ్తాడు సురేష్. గవర్నర్ గారి దగ్గర బొకే తీసుకున్న తర్వాత అతని పర్మిషన్తో మైక్ దగ్గరికి వెళ్తాడు.


సురేష్: నిజానికి అవార్డు తీసుకున్న తర్వాత మాట్లాడుతారు కానీ నేను ముందే మాట్లాడటానికి కారణం చెప్తాను. నేను ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం నా భార్య కౌషికి. ప్రతిరోజు ఆమెను చూస్తూ ఇన్స్పైర్ అయ్యేవాడిని. న్యూస్ పేపర్లు అమ్ముడుపోవాలి కానీ న్యూస్ రిపోర్టర్లు అమ్ముడు పోకూడదు అని తను చెప్పే మాటలు నన్ను ఇన్స్పైర్ చేసేవి. నిజానికి నేను ఈ అవార్డుని నా భార్యతో కలిసి తీసుకోవాలనుకున్నాను కానీ ఆమె అందనంత దూరంలో ఉంది అందుకే నాకు కూతురుతో కలిసి తీసుకోవాలనుకుంటున్నాను అంటాడు.


ధాత్రి : చూడండి వదిన అన్నయ్యకి మీరంటే ఎంత ఇష్టమో అంటుంది.


కౌషికి: అదంతా నటన పదిమంది ముందు మంచి వాడిని అని నిరూపించుకోవడానికి అలా చేస్తున్నాడు అంటుంది. తర్వాత పాపని స్టేజ్ మీదకి పంపించడానికి ఇష్టపడకపోవడంతో ధాత్రి ఒప్పించి పాపని పంపిస్తుంది.


కీర్తి,సురేష్ ఇద్దరు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటారు ఆ తర్వాత దివ్యాంక గబగబా స్టేజ్ మీదకి వెళ్లి గవర్నర్ పర్మిషన్తో పోడియం దగ్గరికి వచ్చి మాట్లాడటం ప్రారంభిస్తుంది.


దివ్యాంక: సురేష్ నా ఛానల్ లోనే పనిచేస్తున్నాడు. ఈ స్టేజి మీద ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అని చెప్పి తను సురేష్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్తుంది.


 ఆ స్టేట్మెంట్ కి కౌషికి కన్నీరు పెట్టుకుంటుంది వైజయంతి మాత్రం తన ఆనందాన్ని తన మరిదితో పంచుకుంటుంది.


అయితే సురేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటాడు.


దివ్యాంక: నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.


సురేష్: నాకు పెళ్లయి పాప కూడా ఉంది అంటాడు.


దివ్యాంక : ఆమె నిన్ను దగ్గరికి రానిస్తుంది అని అపోహ పడుతున్నావు అది నీ భ్రమ.. ఆమె పంతం సంగతి నీకు తెలుసు నాకు తెలుసు. నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు అని తెలిస్తే ఆమెకి నీ మీద ప్రేమ పుట్టవచ్చు అని సురేష్ ని మానిప్యులేట్ చేస్తుంది.


సురేష్: ఆలోచించుకోవటానికి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


స్టేజ్ మీద అందరూ చప్పట్లు కొట్టడంతో ఆ జ్ఞాపకాల నుంచి బయటికి వస్తాడు.


మరోవైపు మీనన్ గవర్నర్ ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సెక్యూరిటీ టైట్ గా ఉంది, పోలీసులను షూట్ చేసి లోపలికి వెళ్దాం అంటాడు గుంపులో ఒకతను.


మీనన్ : మనం షూట్ చేస్తే వాళ్ళు గవర్నర్ ని అలెర్ట్ చేసేస్తారు మనకు కావలసింది గవర్నర్ ని చంపటం కాదు గవర్నమెంట్ కిడ్నాప్ చేయడం మాత్రమే అని ఆ బిల్డింగ్ తాలూకా రూట్ మ్యాప్ చూస్తూ ఉంటాడు మీనన్.


అక్కడితో ఈరోజు కథ ముగుస్తుంది.


Also Readకంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా