Guppedantha Manasu January 17th Episode: (గుప్పెడంతమనసు జనవరి 17 ఎపిసోడ్)
రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కొత్త ఎత్తు వేస్తాడు శైలేంద్ర. రిషి చనిపోయినట్లు డీబీఎస్‌టీ కాలేజీ స్టూడెంట్స్, లెక్చరర్స్‌ను నమ్మిస్తాడు. కాలేజీలో పెద్ద గొడవే జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఫొటో చూసి ధరణి కంగారుపడుతుంది. రిషి చనిపోయినట్లు వస్తోన్న వార్తలు నిజమేకావచ్చునని ధరణితో అంటుంది దేవయాని. దాంతో దేవయానిపై రివర్సవుతుంది.
ధరణి: ఎవరో గిట్టని వాళ్లు ఇలా ఫొటోను పోస్ట్ చేశారని దరిద్రపు వెధవలు...వాడి ఫొటో, వాళ్ల అమ్మ ఫొటో ఇలాగే పెట్టి పిండం పెట్టాలంటూ తిట్ల వర్షం కురిపిస్తుంది.
ఆ తిట్లు భరించలేక దేవయాని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Also Read: రిషి ఎంట్రీతో ఎండ్ కార్డ్ - శైలేంద్ర అరాచకానికి కౌంట్ డౌన్!
ఫణీంద్ర, మహేంద్ర, అనుపమ కూర్చుని ఉంటారు..అక్కడకు వచ్చిన శైలేంద్ర కావాలని తండ్రిని రెచ్చగొడతాడు.
శైలేంద్ర:ఈ విషయం బయటకు వెళితే పరిస్థితి ఏంటి..
మహేంద్ర: మినిస్టర్ గారు కాల్ చేశారు..ఆయనకు విషయం తెలిసినట్టుంది..ఇక్కడకు వస్తానన్నారు
శైలేంద్ర: అక్కడే ఉన్న జగతి ఫొటో చూసి దొంగ ఏడుపు ఏడుస్తుంటాడు. ఈ టైమ్‌లో పిన్ని ఉంటే బాగుండేది. ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడే పిన్ని గుర్తుకొస్తుందని అంటాడు. రిషి కనిపించకుండాపోవడం, వసుధార పట్టించుకోకపోవడంతో కళ్ల ముందే కాలేజీ కుప్పకూలిపోతున్నట్లుగా ఉంది. ఈ కాలేజీకి పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది రిషి...తనే లేనప్పుడు కాలేజీని నడపటం వేస్ట్ ..కాలేజీని మూసివేద్దాం
మహేంద్ర: ఏయ్ శైలేంద్ర ఆపుతావా
శైలేంద్ర: నాపై సీరియస్ అయితే మీకేం వస్తుంది..
మహేంద్ర: కాలేజీని మూసివేయడం అన్నది జరగని పని. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించు అంతే కానీ నీకు తోచిన ఐడియాలు ఇవ్వకు
అనుపమ: కాలేజీని మూసేయాలంటూ బయటివాళ్లు ఆలోచించినట్లు ఆలోచించకు
శైలేంద్ర: నేను కాదు బయటివాడిని మీరు
శైలేంద్ర: అనుపమ బయటివ్యక్తి కాదని...మన కాలేజీ మనిషి
అనుపమ: కాలేజీని మూసేస్తే స్టూడెంట్స్ భవిష్యత్తు పాడవుతుంది
శైలేంద్ర: మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి కానీ ఇప్పుడందరూ నా తమ్ముడు చచ్చిపోయాడు అంటున్నారు..నా బాధ ఎవరితోనూ చెప్పులేకపోతున్నాను. మమ్మల్ని రామలక్ష్మణుల్లా ఉండాలని కోరుకున్నారు..ఇప్పుడు రిషి కనిపించడం లేదు..నేను తట్టుకోలేకపోతున్నాను
ఫణీంద్ర: రిషికి ఏంకాదు..నువ్వు ధైర్యంగ్ ఉండు..వసుధార, మినిస్టర్ గారు కూడా వస్తున్నారు కదా...
ఇంతలో మినిస్టర్ వచ్చి అసలు రిషి లేడని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరని అడుగుతాడు. ఎవరో స్టూడెంట్స్ అయి ఉంటారని శైలేంద్ర అంటే.. ఎవరో కావాలని చేసి ఉంటారని మహేంద్ర అంటాడు. శైలేంద్ర ఏదో మాట్లాడబోతుంటే ఫైర్ అవుతాడు.
మినిస్టర్: వసుధారకి ఇన్ఫామ్ చేశారా...అయినా రిషి కనిపించలేదన్న విషయం నాకెందుకు చెప్పలేదని మండిపడతాడు...
ఇంతలో వసుధార వస్తుంది..
మినిస్టర్: నువ్వు ఎండీ బాధ్యతలు చేపట్టినప్పుడు నేను సంతోషించాను. మీ కుటుంబ సభ్యులలానే నేనూ అండగా నిలబడ్డాను. కానీ ఏం చేస్తున్నావమ్మా..నువ్వు ఆ సీట్‌లో కూర్చున్నదగ్గర నుంచి అన్ని పొరపాట్లే జరుగుతున్నాయి. నువ్వు కాలేజీకి ఎందుకు రెగ్యులర్‌గా రావడం లేదని అడుగుతాడు. బోర్డ్ మెంబర్స్ నీపై కోపంగా ఉన్నారని, కనీసం మీ ఇంట్లో వాళ్లు కూడా నీ గురించి సమాధానం చెప్పడం లేదు . అసలు రిషి ఎక్కడున్నాడో చెప్పు.
వసుధార మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది.
మినిస్టర్: మౌనం సమాధానం కాదన్న మినిస్టర్..రిషి చనిపోయినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఆపాలంటే అతడు ఎక్కడున్నాడో వెంటనే తెలియాలి
వసు: రిషి సర్ క్షేమంగా ఉన్నారు
బోర్డ్ మెంబర్స్: మొన్న రిషి తప్పిపోయాడని అన్నారు. ఇప్పుడేమో క్షేమంగా ఉన్నారని అంటున్నారు. ఏది నిజమని నమ్మాలి
శైలేంద్ర: ఇలా మాట మారిస్తే వాళ్లంతా నిన్ను ఎలా నమ్ముతారు
మహేంద్ర: తను ఏ ఉద్దేశంతో రిషి గురించి బయటపెట్టడం లేదో మన ఆలోచించాలి కదా
శైలేంద్ర: రిషి బతికే ఉన్నాడని స్టూడెంట్స్‌ను ఎలా నమ్మిస్తాం. ఏ ఆధారం లేకుండా చెబితే వాళ్లు ఎలా నమ్ముతారు
బోర్డ్ మెంబర్స్: రిషి గురించి మీరు బయటపెట్టకపోతే మీరు ఎండీ సీట్ నుంచి తప్పుకోవాల్సివస్తుంది
Also Read: ఈ రాశివారి ఉద్యోగ జీవితంలో కీలక మలుపు రాబోతోంది, జనవరి 17 రాశిఫలాలు
ఇంతలో శైలేంద్రకి వాయిస్ మెసేజ్ వస్తుంది...అది రిషి వాయిస్..
రిషి: కొన్ని అత్యవసర పనుల వల్ల కాలేజీకి రాలేకపోతున్నాను నన్ను క్షమించండి. నేను కాలేజీకి వచ్చినా రాకపోయినా అక్కడంతా సవ్యంగా జరుగుతుందని నమ్ముతున్నాను. నాకు ఎదురైన ఇబ్బందుల వల్ల వసుధార ఈ మధ్య సరిగా కాలేజీకి రాలేకపోయింది. అందులో తన తప్పు లేదు నా వల్లే ఇలా జరిగింది. ఎండీగా వసుధార పర్‌ఫెక్ట్ అని నాకు ఇప్పటికీ నమ్మకముంది. నేను క్షేమంగానే ఉన్నాను..నాపై వచ్చిన ప్రచారాలు నమ్మొద్దు..
ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో ఉన్నాను..త్వరలోనే కాలేజీకి వస్తాను అని ఉంటుంది
మినిస్టర్: ఇది చాలు స్టూడెంట్స్ కి చూపిస్తే నమ్మతారు
శైలేంద్ర: ఇదంతా ఫేక్ , టెక్నాలజీ ఉపయోగించి రిషి వాయిస్‌తో ఇలాంటివి వంద సృష్టించవచ్చు
అప్పుడే మినిస్టర్‌కు రిషి ఫోన్ చేస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి మీరు అప్పగించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ పనిలో ఉన్నానని, కాలేజీలో పరిస్థితులను మీరే చక్కదిద్దాలని మినిస్టర్‌ను కోరుతాడు రిషి. మినిస్టర్ అందుకు ఒప్పుకుంటాడు. స్టూడెంట్స్‌కు తాను సర్ధిచెబుతానని బోర్డ్ మెంబర్స్‌తో అంటాడు. మధ్యలో శైలేంద్ర జోక్యం చేసుకుంటుండగా..శైలేంద్రపై ఫైర్ అవుతాడు...
రిషి-శైలేంద్ర-మహేంద్ర
బోర్డ్ మీటింగ్ ముగిసిన తర్వాత వసుధార బయటకు వెళ్లబోతంటే అడ్డుగా నిలబడిన శైలేంద్ర...రిషి ఎక్కడున్నాడు, ఏంటా సీక్రెట్ ఆపరేషన్ అని నిలదీస్తాడు. అప్పుడే వచ్చిన మహేంద్ర.. నీకెందుకు చెప్పాలిరా అని గట్టిగా సమాధానమిస్తాడు.. నా కొడుకు గురించి ఆరాలు తీయడానికి నువ్వు ఎవడికి అంటూ వార్నింగ్ ఇస్తాడు. తాను ఈ కాలేజీ బోర్డ్ మెంబర్‌నేనని మహేంద్రతో అంటాడు శైలేంద్ర. నామమాత్రానికే నీ పేరును బోర్డ్ మెంబర్స్ లిస్ట్‌లో జాయిన్ చేశాం అసలు నీకు ఈ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదంటాడు. రిషి చేస్తోన్న సీక్రెట్ మిషన్ ఏదో తెలుసుకుని దానిని చెడగొట్టాలని అనుకుంటున్నావా అంటాడు మహేంద్ర..
ఎపిసోడ్ ముగిసింది...