Trinayani Telugu Serial Today Episode: భోగిపళ్లు పోయడానికి నయని, ధురందర, హాసిని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. విశాల్, హాసిని, సుమన పిల్లలను తీసుకొని వస్తారు. భోగిపళ్ల విశేషం ఏంటని తిలోత్తమ ధురందరని అడుగుతుంది. తను తెలీదు అంటే ఇంకెవరినైనా చెప్పమని అడుగుతుంది. విశాలాక్షి రేగిపళ్లలో పువ్వులు, చిల్లర, సెనగలు అన్న కలిపి భోగిపళ్లు రెడీ చేస్తుంది. 


డమ్మక్క: పిల్లలకు భోగిపళ్లు పోయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నరదిష్టి, గృహపీడ నివారణ కలుగుతుంది.
నయని: అంతే కాకుండా బదరీఫలం అని పిలవబడే ఈ రేగిపళ్ల చెట్ల వద్దే నరనారాయుణులు ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఈ పళ్లు తింటూ తపస్సు చేసేవాళ్లు అంటారు.
విశాలాక్షి: దేవదేవడు పరమేశ్వరున్ని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్లు తపస్సు చేస్తుంటే బదరీ ఫలాలు రేగిపళ్లను ముక్కోటి దేవతలు నరనారాయణుల తలమీద పోసేవారు.
విశాల్: వావ్.. ఆ నాటి సంఘటనకి ప్రతీకగా ఇప్పుడు పిల్లలని నారాయణులుగా భావించి భోగిపళ్లు పోసే సంప్రదాయం వచ్చింది అనకుంటా.
విక్రాంత్: ఇంకో విషయం చెప్పనా మీకు మైనస్ 15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకు ఎలాంటి ఉష్టోగ్రతను అయినా తట్టుకొని నిలబడే చెట్టు ఏదైనా ఉంది అంటే అది రేగిపళ్ల చెట్టుమాత్రమే. 
తిలోత్తమ: మనసులో.. మీరందరూ రేగిపళ్లు పిల్లల తల మీద పోస్తారు. నేను ఆల్రెడీ పెట్టిన రంగు పూసిన రేగుపళ్లలా కనిపించిన కెమికల్ బాల్స్ విశాలాక్షి తలమీద పడగానే గారడి పిల్ల జుట్టు అంటుకొని కేకలు పెడుతుంది. 
విశాలాక్షి: తల పై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది. భోగి పళ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానోదయం పెరుగుతుంది. నాన్న పిల్లలను కూర్చొపెట్టండి.
తిలోత్తమ: ఎవరి పిల్లలకు వాళ్ల అమ్మానాన్న పోస్తారు. విశాలాక్షి తలమీద మాత్రం నేను పోద్దాం అనుకుంటున్నాను భోగిపళ్లు. 


విశాల్, నయని గానవి, గాయత్రి పాపలకు భోగిపళ్లు పోస్తారు. సుమన ఉలూచికి పోస్తుంది. ఇక తిలోత్తమ విశాలాక్షి తల మీద భోగిపళ్లు పోయగానే తలకు మంటలు అంటుకుంటాయి. దీంతో అందరూ షాక్ అయి దూరంగా వెళ్తారు. విశాలాక్షి కళ్లు మూసుకుంటుంది. 


విశాల్: మంట అంటుకుంది. ఆర్పేయండి.
డమ్మక్క: కంగారు పడకండి విశాల్ బాబు అమ్మకి ఏం కాదు.
ధురందర: ఏం కాదు అంటావ్ ఏంటి జుట్టు అంటుకుంటే ఆ తర్వాత మనిషే మాడి మసైపోతుంది. 
డమ్మక్క: అమ్మ కళ్లు మూసుకొని యోగనిద్రలో ఉంది. 
హాసిని: అసలు మంట ఎలా వచ్చింది.
నయని: అత్తయ్య భోగిపళ్లు పోయగానే వచ్చింది.
విశాలాక్షి: భయపడాల్సింది ఏం లేదు అమ్మ. ఒకరి కడుపు మంట కాస్త నా బుర్రలకు అంటుకుంది. మెల్లగా ఆరిపోతుంది. నాకు ఏం కాదు. 
సుమన: మంట ఆరిపోయింది.
పావనా: కానీ సోదరికి ఏం కాలేదు.
విశాల్: ఇది నిజమా కలా నీకు ఏం కాలేదు.


తిలోత్తమ: గారడి పిల్ల సామాన్యమైంది కాదు వల్లభ. అడ్డు తొలగించుకుందామని పైనుంచి కిందకి తీసేస్తే ఒంటికి ఒక్క గాయం లేకుండా మళ్లీ వచ్చింది. ఇప్పుడు కెమికల్ కలిపిన బాల్స్ భోగిపళ్లులా వేస్తే మంట వచ్చినా ఏం కాలేదు. అదే అర్థం కావడం లేదు. ఇంతలో హాసిని ఎద్దులయ్యని తీసుకొస్తుంది.
ఎద్దులయ్య: మా అమ్మ చిన్న పిల్ల అనుకొని తక్కువ అంచనా వేయకండి పెద్దమాత. ఇందాక ఈ గది వైపు తేలు వచ్చింది. 
వల్లభ: దాన్ని కొట్టి చంపేయండి ముందు.
ఎద్దులయ్య: వల్లభని చితక్కొడతాడు. ఏమైందని అడిగితే వల్లభ మీద తేలు ఉందని తిలోత్తమ కొడుతుంది. తర్వాత హాసిని, ఎద్దులయ్య కూడా వల్లభని చితక్కొడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్ జనవరి 16th : పిల్లల ప్రవర్తన చూసి షాకైన మిస్సమ్మ, డబ్బు దొంగిలించే ప్రయత్నంలో మనోహరి!