Guppedantha Manasu January 16 th Episode:  (గుప్పెడంతమనసు జనవరి 16 ఎపిసోడ్)


 కాలేజీలో చిచ్చు రాజేస్తాడు శైలేంద్ర. రిషి చనిపోయాడని ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తాడు. అటు కాలేజీ స్టాప్ కూడా... 
వ‌సుధార ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ త‌ర్వాత త‌మ‌కు జీతాలు స‌రిగా అంద‌డం లేద‌ని గొడ‌వ చేస్తారు. జీతాలు పెంచమ‌ని అడిగితే మాకు ప‌నిలేకుండా చేసింది. ఉన్న‌జీతంతో స‌రిపెట్టుకుని ప‌నిచేయాలంటే ఆమె సంత‌కం లేక‌పోవ‌డంతో ఈ నెల జీతాలు కూడా ఇప్ప‌టివ‌ర‌కు ప‌డ‌లేద‌ంటారు. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే రిషి కాలేజీకి రావాల్సిందేన‌ని లెక్చ‌ర‌ర్స్ కూడా ప‌ట్టుప‌డ‌తారు. రిషి బాగానే ఉన్నాడని మహేంద్ర, ఫణీంద్ర ఇద్దరూ సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తారు కానీ..స్టూడెంట్స్ మాత్రం గొడవ మానరు. రిషి చ‌నిపోయిన‌ట్లు కాలేజీ గ్రూప్‌ల‌లోని పోస్ట్‌ల‌ను మ‌హేంద్ర‌కు చూపిస్తారు. రిషి బ‌తికే ఉన్నాడ‌ని, తొంద‌ర‌లోనే కాలేజీకి వ‌స్తాడ‌ని చెబుతాడు. మ‌హేంద్ర‌ మాటలతో కన్వెన్స్ అయిన స్టూడెంట్స్, లెక్చరర్స్ ఇద్దరూ వెళ్లిపోతారు..
ఫణీంద్ర: రిషి గురించి మనకు ఎలాంటి సమాచారం లేదు కదా..మరి ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయింది
శైలేంద్ర: ఏమో డాడ్ అదే అర్థం కావడం లేదు. అయినా రిషి రాకపోతే పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రిషిని వెతుక్కుంటూ చక్రపాణి ఇంటికెళ్లిన శైలేంద్ర – కాలేజీలో రిషి చనిపోయాడని న్యూస్‌ వైరల్


అక్కడి నుంచి బాధగా వెళ్లిపోయిన మహేంద్ర...ఆవేశపడతాడు. ఆవేశాన్ని కంట్రోల్ చేసిన అనుపమ...ఏంటిదంతా అని ఫైర్ అవుతుంది. 
మహేంద్ర: బ‌తికుండ‌గానే నా కొడుకు చ‌నిపోయాడ‌ని వార్త‌లు సృష్టించారు. నా కొడుకు గురించి అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తుంటే గుండె ప‌గిలిపోయినంత ప‌నైంది..వారి ప్ర‌శ్న‌ల‌కు నోట మాట రాలేద‌ని, గొంతు ప‌ట్టేసిన‌ట్లైంది. ఎలా ఉండాల్సిన రిషి జీవితం ఇలా ఎందుకు అయిపోయింది.
అనుపమ: స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు కుంగిపోకుండా దాని నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం గురించి ఆలోచించ‌ు.  ఇలా ప్రవర్తిస్తే ఎవరికి నష్టం.. నీకు నష్టం, నీ కొడుక్కి నష్టం...అప్పుడు సంతోషపడేది ఎవరు శైలేంద్ర...నాకు తెలిసి తనే చాపకింద నీరులా స్టూడెంట్స్ మైండ్ పొల్యూట్ చేసి ఉంటాడు. లేకపోతే స్టూడెంట్స్, లెక్చరర్స్ అంతా ఒకేసారి వచ్చి ఎలా మాట్లాడతారు..కచ్చితంగా దీనివెనుక వాడే ఉన్నాడు...ఇందులో శైలేంద్ర హస్తం ఉందన్నది వాస్తవం. తన ఆలోచనలను ఎలా తిప్పికొట్టాలో ఆలోచించు...
మహేంద్ర: ఏం చేయమంటావ్..నేను ఏమీ చేయలేకపోతున్నాను...ఈ సిట్యుయేషన్లో జగతి ఉండే బావుండేది...
అనుపమ: ఇలాంటి పరిస్థితులు జగతి లైఫ్ లో ఎన్నో వచ్చాయ్..కానీ ఏనాడూ వెనకడుగు వేయలేదు..ఓటమికి తలదించలేదు...
మహేంద్ర: నేను మాన‌సికంగా  కృంగిపోయి ఉన్నాన‌ు..శైలేంద్రని ఎదుర్కోలేకపోతున్నాను. వాడికి కావాల్సింది రిషి ఎక్కడున్నాడో తెలియాలి.. ఇదంతా క్రియేట్ చేసింది కూడా అందుకే...సమస్యను పెంచితే మనం రిషిని తీసుకురావాల్సి వస్తుంది...
ఇప్పుడు పరిష్కారం ఏంటని మహేంద్ర అంటే...వసుధారకి కాల్ చేయమంటుంది... ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది...


Also Read: కనుమ రోజు ఊరు దాటకూడదా - ప్రయాణం చేయకూడదా!


ఇంతలో మినిస్టర్ నుంచి కాల్ వస్తుంది
మినిస్టర్: రిషి క‌నిపించ‌కుండా పోయిన విష‌యం   ఇన్నాళ్లు ఎందుకు చెప్ప‌లేద‌ని అడుగుతాడు. 
మిమ్మల్ని కలసి చెబుతారను అని మహేంద్ర అంటే.. నేనే వస్తున్నాను అని కాల్ కట్ చేస్తాడు..
ఆ తర్వాత వసుధారకి కాల్ చేస్తాడు మహేంద్ర.. కాలేజీలో జరిగిన గొడవ మొత్తం చెబుతాడు..
వసు: ఈ గొడ‌వ‌ల‌ను చూసి భ‌య‌ప‌డి స్టూడెంట్స్ ముందుకు రిషిని తీసుకొస్తే తన ప్రాణాల‌కే ప్ర‌మాదం..అయినా నేను కాలేజీకి వస్తున్నాను...


దేవ‌యాని - శైలేంద్ర


కాలేజీ సోష‌ల్ మీడియా గ్రూపులో రిషి ఫొటో కింద రిప్ అని ఉండ‌టం చూసి దేవ‌యాని ఆనంద‌ప‌డుతుంది. ఈ పని శైలేంద్రే చేశాడని ఫిక్స్ అవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుని శైలేంద్రకి కాల్ చేస్తుంది. కాసేపు ఉంటే రిషి చ‌నిపోయిన న్యూస్ టీవీలోకి వ‌స్తుంద‌ని త‌ల్లితో అంటాడు శైలేంద్ర‌. మ‌రి అంత పెద్ద ర‌చ్చ అవ‌స‌ర‌మా అని త‌ల్లి అడిగిన ప్ర‌శ్న‌కు క‌లుగులో ఉన్న ఎలుక‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాలంటే ఈ మాత్రం పొగ‌పెట్టాల‌ని  అంటాడు. రిషి ఎక్క‌డున్నాడో తెలుసుకోవాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వాళ్లు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. ఈ రోజు రిషి చ‌నిపోయాడ‌ని కాలేజీలో చిన్న చిచ్చు పెట్టా. అది దావానంలా కాలేజీ మొత్తం వ్యాపించి స్టూడెంట్స్‌, లెక్చ‌ర‌ర్స్ బాబాయ్‌తో గొడ‌వ‌ప‌డ్డార‌ని, ఇప్పుడు రిషిని కాలేజీకి తీసుకురావ‌డం త‌ప్ప వాళ్ల‌కు మ‌రో గ‌త్యంత‌రం లేద‌ని చెబుతాడు. ఇది శాంపిల్ మాత్ర‌మేన‌ని, ముందుముందు ఈ శైలేంద్ర ఆడే ఆట‌లో వారు చావుదెబ్బ తిన‌డం ఖాయ‌మ‌ని అంటాడు.


Also Read: కనుమ శుభాకాంక్షలు తెలియజేసేందుకు కొటేషన్స్!


దేవయాని-ధరణి


ఇంతలో ధ‌ర‌ణి వచ్చి...రిషి చ‌నిపోయిన‌ట్లు కాలేజీ గ్రూపులో ఎవ‌రో పోస్ట్ పెట్టార‌ని కంగారు ప‌డుతుంది. రిషి గురించి ఇలా పెట్టడం ఏంటి దుర్మార్గం కాకపోతే అని ధరణి అంటుంది. అవును ఇదే విషయంపై కాలేజీలో రచ్చ జరిగిందంట అంటుంది. ఇందులో ఉన్నట్టే నిజంగా రిషి..చనిపోయి ఉండొచ్చేమో అని దేవయాని అనేలోగా ధరణి ఫైర్ అవుతుంది. ఇలాంటి అప‌శ‌కునం మాట‌లు ఎలా మాట్లాడుతారు..అది నోరేనా ఇంకేమైనానా అని ఫైర్ అవుతుంది...
ఎపిసోడ్ ముగిసింది...