Kanuma 2024 Wishes Quotes Images:  సంక్రాంతి  పండగలో భాగంగా మూడో రోజు కనుమ. ఇది ముఖ్యంగా రైతుల పండగ. పంటలు చేతికి అందించడంలో సహాయపడిన పశు పక్ష్యాదులను ఈ రోజు పూజిస్తారు. పశువులను బావులు లేదా చెరువుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించి అందంగా అలంకరించి ఇంటికి తీసుకొచ్చి పూజిస్తారు. ఈ రోజు మొత్తం వాటితో ఎలాంటి పని చేయించరు.కడుపునిండా ఆహారం అందించి పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. అంతా కడుపునిండా తింటున్నారంటే అందుకు కారణం రైతులు, వారికి సంహకరించే పశువులు. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. అందుకే భోగి, సంక్రాంతి కన్నా మరింత ప్రత్యేక కనుమ. నాలుగో రోజు ముక్కనుమ పండుగ ఉన్నప్పటికీ సంక్రాంతి సందడి దాదాపు కనుమతోనే అయిపోతుంది. ఈ సందర్భంగా మనకు ఆహారం అందించే రైతులకు శుభాకాంక్షలు చెప్పాల్సిన సమయం ఇది...


మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు


రైతులే రాజుగా రాతలే మార్చే పండుగ
పంట చేలు కోతలతో ఇచ్చే కానుక
కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ
ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక
కనుమ పండుగ శుభాకాంక్షలు!


Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!


మట్టిలో పుట్టిన మేలిమి బంగారం
కష్టం చేతికి అందొచ్చే తరుణం
నేలతల్లి, పాడిపశువులు అందించిన వరప్రసాదం
'కనుమ'లా వడ్డించింది పరమాన్నం
కనుమ పండుగ శుభాకాంక్షలు


కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ
శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ
మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ
అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!


రోకల్లు దంచే ధాన్యాలు
మనసుల్ని నింపే మాన్యాలు
రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన మన పాడి-పశువులు
మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ఇలాంటి వేడుకలు
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు!


Also Read: సంక్రాంతి వేళ మీ ఇంటిముందుకొచ్చిన శివుడు, శ్రీ మహావిష్ణువుని నిర్లక్ష్యం చేయకండి!


ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే
పశువులను రైతన్నలు పూజించే పండుగ కనుమ
తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు


వ్యవసాయంలో తమకు
తోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు


ముంగిళ్లలో మెరిసే రంగవల్లులు
తెలుగుదనాన్ని తట్టిలేపే బంగారు తల్లులు
బసవన్నల ఆటపాటలు సంక్రాంతి సరదాలు
ఈ 'కనుమ' మీకు కమ్మని అనభూతులను 
అందించాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు


Also Read: భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!


ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే పశువులను..
రైతన్నలు పూజించే పండుగ కనుమ
జరుపుకోవాలి మనమందరం 
కనుమ పండుగ శుభాకాంక్షలు


మూడు రోజుల సంబరం ఏడాదంతా జ్ఞాపకం
బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుందాం సంబరం
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు


Also Read: మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను - సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసే గొబ్బిళ్ల పాటలివే!


ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు. పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి.


ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ భవిష్యత్ మరింత ఉండాలని మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు ఏబీపీ దేశం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు