Makar Sankranti 2024 Wishes Quotes: సంక్రాంతి అంటే నూతన క్రాంతి. ధనస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. సంక్రాంతి, పొంగల్, మాఘి పేరేదైనా సందడి ఒకటే. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో హిందువులు, సిక్కులు ప్రముఖంగా జరుపుకునే పండగ ఇది. ఆంధ్రులకు సంక్రాంతి పెద్ద పండుగ అయితే..తెలంగాణ వాసులకు సంక్రాంతి రెండో పెద్ద పండుగ. ఈ వేడుకల్లో మీతో పాటూ మీ ఆత్మీయులను భాగస్వామ్యం చేసేలా, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు ఈ కొటేషన్స్ తో చెప్పేయండి..
Also Read: సంక్రాంతి వేళ మీ ఇంటిముందుకొచ్చిన శివుడు, శ్రీ మహావిష్ణువుని నిర్లక్ష్యం చేయకండి!
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..
సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు
మీ ఇల్లు ఆనందనిలయమైసుఖసంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు!!
Also Read: భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణంజనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఆ గాలిపటంలా ఉన్నతంగా ఎగిరే మన ఘనతజీవితాన్ని రంగులమయం చేసే అచ్చమైన వేడుక మన సంక్రాతి మీకు , మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులుమన ముంగిట్లో మెరిసే రంగవల్లులుపంచెకట్టులు, పందెంకోళ్లుహరిదాసులు, డూడూ బసవన్నలుతెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తే అందమైన వేడుకమీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
Also Read: మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను - సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసే గొబ్బిళ్ల పాటలివే!
ఆకుపచ్చని మామిడి తోరణాలుపసుపు పచ్చని మేలిమి సింగారంతో మెరిసే గడపలుముంగిట్లో ముగ్గులు, అందమైన గొబ్బెమ్మలుఇంటికి తరలివచ్చే ధాన్యపురాశులుసంక్రాంతి శుభాకాంక్షలు!
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త కాంతిని నింపాలని కోరుకుంటూ..మీ అందరకీ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ సంక్రాంతికి మీ జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండిఅందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
పాలలోని తెల్లదనంచెరుకులోని తియ్యదనంముగ్గులోని రంగుల అందంపండగ నాడు మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందంసంక్రాంతి శుభాకాంక్షలు!
తరిగిపోని ధాన్యపురాశులతో.. తరలివచ్చే సిరిసంపదలతో.. తిరుగులేని అనుబంధాల అల్లికలతో..మీ జీవితం ఎప్పుడు దినదినాభి వృద్ధి చెందాలని కోరుతూసంక్రాంతి శుభాకాంక్షలు!
ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులుఉత్సాహాన్ని పెంచే కోడిపందాలుధాన్యపు రాశులతో నిండిపోయే గాదెలుడూడూ బసవన్నల దీవెనలుకీర్తనలు పాడే హరిదాసులు..తనివి తీరని వేడుకసంక్రాంతి శుభాకాంక్షలు..
Also Read: సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బిళ్ల సందడెందుకు!
భోగి మీకు భోగభాగ్యాలనుసంక్రాంతి మీకు సుఖసంతోషాలనుకనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని కోరుకుంటూ…అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ..మన సంప్రదాయన్ని విశ్వమంతా తెలుపుతూ..పల్లె అందాలను ప్రపంచానికి చూపుతూ..సంక్రాంతి పండుగను జరుపుకోండి..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!
కళకళలాడే ముంగిట రంగవల్లులు..బసవన్నల ఆటపాటలు..తెలుగువారికి సొంతమైన ఆచారాలు..మీకు సంతోషాన్ని పంచాలి ఈ సంక్రాంతి.అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
వణికే చలిలో భోగిమంటలు..కొత్త బట్టల కోసం ఎన్నో అలకలు..మదిలో మెదిలో మధుర స్మృతులు..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!
జంట సన్నాయి మేళం..జోడు బసవన్నల తాళం..మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలంమీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ భవిష్యత్ మరింత ఉండాలని మనసారా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబసభ్యులకు ఏబీపీ దేశం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు