Sankranthi Celebrations in Raj Bhawan: తెలంగాణలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. రాజభవన్ లో శనివారం సంక్రాంతి సంబురాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. భోగి వేడుకల్ని నిర్వహించిన ఆమె.. కుండలో పాయసం వండారు. ఈ సందర్భంగా ఆమె దేశ, రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సౌభాగ్యంతో వర్థిల్లాలని, ప్రతి ఒక్కరి ఇంటా సుఖశాంతులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. తన చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తైనందున ఈసారి సంక్రాంతి తనకెంతో ప్రత్యేకమని అన్నారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇది వికసిత భారత్ అని పేర్కొన్నారు. అలాగే, పుదుచ్చేరి రాజ్ నివాస్ లోనూ ఆమె వేడుకలు నిర్వహించారు.
ఢిల్లీ పర్యటన
కాగా, గవర్నర్ తమిళిసై శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో ఆమె భేటీ కానున్నారు.
'రాజకీయ పర్యటన కాదు'
అయితే, సంక్రాంతి వేడుకల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని.. ఇది రాజకీయ పర్యటన కాదని తమిళిసై స్పష్టం చేశారు. పండుగను అంతా సంతోషంగా జరుపుకోవాలని.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Ram Mandir: వాటి కోసం ఆన్‌లైన్‌లో తెగ సెర్చింగ్, ఉత్సాహం పెంచిన అయోధ్య ఆలయం