Jagadhatri Serial Today Episode:ఎపిసోడ్ ప్రారంభంలోనాకు సెంటిమెంట్ ఉంటుందేమో కానీ నా యూనిఫామ్ కి సెంటిమెంట్ ఉండదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాత్రి.


ఆ తర్వాత ఆరుబయట ఆడుకుంటున్న కీర్తిని చూసి వదిన.. ఫంక్షన్ కి రాను అన్నావు కదా నిన్ను ఎలా రప్పిస్తానో చూడు అనుకొని కీర్తి బొమ్మని పైకి విసిరేస్తుంది నిషిక . కీర్తి వచ్చి బొమ్మ వెతుకుతూఉంటుంది.


నిషిక : ఏం వెతుకుతున్నావు అని అమాయకంగా అడుగుతుంది.


కీర్తి: బొమ్మ అని సైగల ద్వారా చెప్తుంది.


నిషిక: ఇప్పుడే పిల్లి వచ్చింది నీ బొమ్మని తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది పైకి వెళ్లి చూడు అని కీర్తిని టాప్ ఫ్లోర్ కి పంపిస్తుంది.


ఆ తర్వాత కీర్తిని వెతుకుతూ కౌషికి వస్తుంది. ఇప్పటివరకు ఇక్కడే ఆడుకుంది అంటుంది ధాత్రి.


నిషిక: ఇప్పటివరకు ఇక్కడే డల్ గా కూర్చుంది ఏమైంది అని అంటే అమ్మ డాన్స్ చేయడానికి ఒప్పుకోలేదు అని బాధగా చెప్పింది అంటుంది.


బాధతో ఎక్కడికైనా వెళ్లిపోయిందేమో అని వైజయంతి అనడంతో కంగారుగా ఇంట్లో వాళ్ళందరూ వెతుకుతారు అప్పుడు టాప్ ఫ్లోర్లో పిట్టగోడ మీద నుంచొని బొమ్మతో ఆడుతున్న కీర్తిని చూసి గట్టిగా కేక వేస్తుంది ధాత్రి. కంగారుపడుతూ వెళ్లి కీర్తిని కాపాడుతుంది. కుటుంబ సభ్యులందరూ అక్కడికి వస్తారు కౌషికి ధాత్రి కి థాంక్స్ చెప్తుంది.


నిషిక : తను చెప్పినట్లు డాన్స్ చేయనివ్వండి వదిన లేదంటే మళ్లీ ఏం చేస్తుందో అంటుంది. అందుకు కౌషికి ఒప్పుకుంటుంది. ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడుతుంది నిషిక.


ధాత్రి : మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు కీర్తి అలిగి ఇక్కడికి రాలేదు, బొమ్మ కోసం ఇక్కడికి వచ్చింది అని లాజిక్ తో సహా వివరిస్తుంది. ఈ బొమ్మ కావాలనే ఎవరో ఇక్కడ పెట్టారు అంటుంది.


నిషిక: ఒక పని కూడా తిన్నగా చేసుకుని ఇవ్వదు అని ధాత్రిని తిట్టుకుంటూ అక్కడ ఎవరు పెడతారు అని అడుగుతుంది.


కౌషికి: అక్కడ ఎవరు పెట్టారో తెలియదు కానీ ఎందుకు పెట్టారో తెలుసు. రేపు ఎట్టి పరిస్థితుల్లోని ఫంక్షన్ కి వెళ్ళేది లేదు అని చెప్పటంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.


ధాత్రి: కౌషికిని ఆగమని చెప్పి ఫంక్షన్ కోసం పాప చాలా కష్టపడింది.కీర్తి కోసమైనా ఫంక్షన్ కి వెళ్దాం అంటుంది.


కౌషికి: నా కూతురు కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే కానీ ఆ ఫంక్షన్కు వెళ్ళేది లేదు. ఆ ఫంక్షన్ కి వెళ్తే దివ్యాంక ఏం చేస్తుందో నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


మరోవైపు దివ్యాంక ఫోన్ చేసి ప్లాన్ సక్సెస్ ఏనా అని అడుగుతుంది.


నిషిక: జరిగిందంతా చెప్పి ఇదంతా ఆ ధాత్రి వల్లే అంటుంది.


దివ్యాంక: మరేం పర్వాలేదు నేను మరొక ప్లాన్ వేసాను అని చెప్పి తన ప్లాన్ ఏమిటో వివరిస్తుంది. నిషిక సరే అనటంతో నువ్వు ఇంత కోఆపరేట్ చేస్తావ్ అనుకోలేదు అంటుంది.


నిషిక : నాకు మా వదిన ఓడిపోవడం కావాలి అందుకోసం ఏమైనా చేస్తాను అంటుంది. వదినని ఫంక్షన్ హాల్ వరకు తీసుకు వస్తాను మిగిలినదంతా మీరు చూసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.


రేపు ఫంక్షన్ హాల్ దగ్గర కౌషికి కి జరగబోయే అవమానాన్ని తలుచుకొని ఆనందపడుతుంది దివ్యాంక.


మరుసటి రోజు ఫంక్షన్ కి రెడీ అయిన నిషిక డల్ గా కూర్చున్న కీర్తి దగ్గరికి వెళ్లి నువ్వు ఫంక్షన్ కి రావా అని అడుగుతుంది. ఆమెకి మాయమాటలు చెప్పి తనతో పాటు తీసుకువెళ్లాలనుకుంటుంది.


ధాత్రి : తనని ఎక్కడికి తీసుకు వెళుతున్నావు, వదినకి చెప్పావా అని అడుగుతుంది.


నిషిక: తను తీసుకెళ్లమంటేనే తీసుకు వెళ్తున్నాను, అయినా అన్ని నీకు చెప్పాలా అని ధాత్రిని కసురుకొని కీర్తిని తీసుకొని బయటికి వెళుతుంది.


యువరాజ్ వాళ్ళ కారు తీయబోతుంటే వదిన కారులో వెళ్దాం అని అంటుంది.


యువరాజ్: అది అక్క కారు అక్క మాత్రమే తీస్తుంది అంటాడు.


నిషిక : అది ఉమ్మడి కారు అందులో తను మాత్రమే వెళ్ళటం ఏమిటి అందుకే ఆమె కారు తాళాలు తీసుకువచ్చాను అందులో వెళ్దాం అంటుంది. 


యువరాజ్: అనుమానంగా మనం ఫంక్షన్ కి ఎందుకు వెళ్తున్నాం నిజంగానే అక్క పాపను తీసుకుని వెళ్ళమని చెప్పిందా అని అనుమానం గా అడుగుతాడు.


నిషిక : నన్నే అనుమానిస్తున్నావా అనటంతో అలా అని కాదు అని ఆమెతో చెప్పి మనం ఫంక్షన్ కి వెళ్తున్నట్టుగా లేదు ఏదో గొడవకు వెళుతున్నట్లుగా ఉంది అనుకుంటాడు.


ఆ తర్వాత కౌషికి కారులో వెళ్లిపోతారు.


ఇదంతా చూస్తున్న ధాత్రి దంపతులు నిషిక ఏదో ప్లాన్ మీదే వెళ్ళింది అని అనుకుంటారు. ఇంట్లోకి వచ్చేసరికి కౌషికి కీర్తిని వెతుకుతూ ఉంటుంది.


ధాత్రి: పాపని తీసుకుని నిషిక ఇప్పుడే ఫంక్షన్ కి వెళ్ళింది.


కౌషికి: నా కూతుర్ని నాకు చెప్పకుండా తను తీసుకువెళ్లడం ఏమిటి అని కోపంతో రగిలిపోతుంది.


ధాత్రి: మీరే తీసుకు వెళ్ళమన్నారట కదా అని అంటుంది.


వైజయంతి: నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో నిషిక ఎందుకు పాపని తీసుకువెళుతుంది అంటుంది.


ధాత్రి : మా కళ్ళతో మేము చూసాము అంటుంది.


వైజయంతి: ఫంక్షన్ కి బయలుదేరుతున్నప్పుడు తను కూడా వస్తాను అని వెంటపడి ఉంటుంది అందుకే తీసుకెళ్లి ఉంటుంది అని కోడల్ని వెనకేసుకొస్తుంది.


అందుకు వైజయంతి పై కోప్పడుతుంది కౌషికి. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read: త్రినయని సీరియల్ 13th: నాగులాపురం నుంచి వచ్చిన మరో కొరియర్.. అక్కలు ప్రెగ్నెంట్స్ కాదని సుమన ఫుల్‌ ఖుషీ!