Bigg Boss Lahari Shari: మామూలుగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్ గురించి, స్టార్ డైరెక్టర్స్ అందించే కంటెంట్ గురించి వ్యక్తిగతంగా ట్రోల్ చేయడానికి చాలామంది ముందుకు రారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్నవారు అయితే ఆ సాహసమే చేయరు. వారు వర్క్ బాగుంటే ప్రశంసించాలి, నచ్చకపోతే సైలెంట్ అయిపోవాలి అని అనుకుంటారు. కొందరు అయితే వారి వర్క్ నచ్చకపోయినా భజన చేస్తుంటారు. కానీ ఒక మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రం అనూహ్యంగా దేవీ శ్రీ ప్రసాద్, తమన్‌లాంటి మ్యూజిక్ డైరెక్టర్లనే ట్రోల్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను అప్లోడ్ చేసింది. ఇది చూసిన ఫాలోవర్స్ అంతా అసలు తను ఎందుకిలా చేసిందని ఆశ్చర్యంలో మునిగిపోయారు.
డీఎస్‌పీ, తమన్‌పై ట్రోలింగ్..
‘‘దేవీ శ్రీగారి పాటలు అనుకోండి చాలా ఫాస్ట్‌గా బోర్ కొట్టేస్తాయి. ఎందుకంటే అందరి ప్లే లిస్ట్‌లో అవే ఉంటాయి. ఎక్కడ చూసినా అవే ప్లే అవుతూ ఉంటాయి. మనం పాడుకొని పాడుకొని బోర్ కొట్టేస్తాయి. అదే తమన్ గారి పాటలు అనుకోండి.. సంవత్సరం కింద పాట అయినా సరే ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో.. ఇప్పుడు విన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క ముక్క కూడా అర్థం కాదు కదా. ఇంకా ప్రతీసారి వినగానే కొత్తగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క ముక్క కూడా గుర్తుండదు కదా. కుర్చీ మడతపెట్టి చాలా బాగుందండి. అది తప్పా ఇంకేం గుర్తులేదు’’ అంటూ దేవి శ్రీ, తమన్‌లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల గురించే ట్రోల్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లహరీ షారీ.
అసలు ఎందుకు చేసినట్టు..?
లహరి పోస్ట్ చేసిన ఈ వీడియోకు కామెంట్స్‌ను తీసేసింది. అంటే ఆ పోస్ట్‌కు ఎవరు ఏ కామెంట్ చేయలేరు. కానీ అసలు లహరి ఉన్నట్టుండి ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేసింది, దీని వెనుక ఉద్దేశ్యం ఏంటి అని ఫాలోవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’కు తమన్ అందించిన బీజీఎమ్ గురించి, పాటల గురించి ట్రోల్స్ జరుగుతున్నాయి. అంతే కాకుండా ‘కుర్చీ మడతపెట్టి’ పాటను ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ కూడా చేశారు. మహేశ్ బాబులాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి డీగ్రేడ్ పదాలను ఉపయోగించి పాటను రాస్తారా అని లిరిసిస్ట్‌ను, మ్యూజిక్ డైరెక్టర్‌ను విమర్శించారు. ఇక లహరి కూడా అదే ఉద్దేశ్యంతో వీడియోను అప్లోడ్ చేసిందా అని నెటిజన్లు అనుమానిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్..
బిగ్ బాస్ తెలుగులోని సీజన్ 5లో కంటెస్టెంట్‌గా కనిపించింది లహరి షారీ. అప్పటికే ‘అర్జున్ రెడ్డి’లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి తనకంటూ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేసింది. ఇక బిగ్ బాస్‌లో కనిపించడంతో లహరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. ఇక ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. ట్రిప్స్, అడ్వెంచర్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే లహరి.. తను ఎక్కడికి వెళ్లిందో.. ఏం చేస్తుందో ఫాలోవర్స్‌కు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 415కే ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read: మహేశ్‌తో మల్టీ స్టారర్, తరువాతి సినిమా ఆ దర్శకుడితోనే - నాగార్జున