డబ్బింగ్ సినిమాలతో మలయాళ హీరో జయరామ్ తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలు, ఆ క్యారెక్టర్లు చూస్తే... ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. పెళ్లాంతో సరిగా కాపురం చేయని క్యారెక్టర్లు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయా? లేదంటే ఆయన ఆ తరహా క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటున్నారా? అనేది క్వశ్చన్!
అల... హాయ్ కారంలో జయరామ్!
హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో తెలుగు తెరపై జయరామ్ కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ఆయన నటించారు. హీరో తండ్రి అనేది పక్కన పెడితే... భార్యకు దూరమైన ఓ భర్త పాత్ర ఆయనది. ఇంకా చెప్పాలంటే... గొడవ కారణంగా అతడిని భార్య వదిలి పెట్టి వెళుతుంది. విడాకులు ఇస్తుంది. పాతికేళ్లు భార్యాభర్తలు కాపురం చేయరు.
'గుంటూరు కారం' సినిమాకు ముందు జయరామ్ నటించిన సినిమా 'హాయ్ నాన్న'. అందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఆమెకు తండ్రిగా జయరామ్ యాక్ట్ చేశారు. అయితే... ఎండింగ్ వరకు ఆ విషయం తెలియదు. నాని ఇంట్లో జయరామ్ ఉండటంతో చాలా మంది ఆయనకు నాన్న రోల్ అని ప్రేక్షకులు కొందరు భావించారు. క్లైమాక్స్ ముందు ట్విస్ట్ రివీల్ కావడంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. అయితే, ఒక్కటి గమనిస్తే... ఆ సినిమాలో కూడా జయరామ్, ఆయన వైఫ్ కాపురం చేయరు.
'గుంటూరు కారం' సినిమాకు ముందు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపురములో' సినిమాలోనూ జయరామ్ యాక్ట్ చేశారు. అందులోనూ ఆయనది హీరో తండ్రి క్యారెక్టర్. టబుకు భర్త పాత్ర. ఒకే ఇంట్లో, ఒకే గదిలో భార్యాభర్తలు నివసిస్తున్నా కాపురం చేయరు. గొడవలు అన్నమాట.
Also Read: డైలీ 10 కోట్లు లోపే 'గుంటూరు కారం' కలెక్షన్లు - ఆరు రోజుల్లో ఎన్ని కోట్ల షేర్ వచ్చిందంటే?
త్రివిక్రమ్ తన రెండు సినిమాల్లోనూ జయరామ్ (Jayaram roles in Trivikram movies)కు ఒకే విధమైన క్యారెక్టర్లు ఇవ్వడం గమనార్హం. ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమాలోనూ జయరామ్ నటించారు. అందులో భయంతో ఆస్పత్రికి పరిమితమైన వ్యక్తిగా మెజారిటీ సన్నివేశాల్లో కనిపించారు. అందులో ఆయనకు వైఫ్ రోల్ లేదు. విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాను ఈ లిస్టు నుంచి తీసేయాలి. అందులో కుమార్తె మరణం తర్వాత భార్యను ప్రేమగా చూసుకునే భర్త పాత్రలో జయరామ్ నటించారు. హీరో హీరోయిన్ల జీవిత ప్రయాణంలో ఆయన పాత్ర కీలక మలుపు తెస్తుంది.
Also Read: సీడెడ్, గుంటూరులో లాభాల్లోకి 'నా సామి రంగ' - నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందంటే?
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'భాగమతి'తో ఆయన టాలీవుడ్ జర్నీ స్టార్ట్ అయ్యింది. తర్వాత 'ధమాకా', 'రావణాసుర' సినిమాల్లో నటించారు. ప్రజెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' సినిమాలో జయరామ్ నటిస్తున్నారు. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో? వెయిట్ అండ్ సి. జయరామ్ వర్సటైల్ యాక్టర్. ఆయన సీరియస్ రోల్స్ చేయగలరు. ఆయనలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. అయితే... సీనియర్ హీరో కావడంతో దర్శక నిర్మాతలు ఆయనను ఒక తరహా పాత్రలకు పరిమితం చేశారని పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులలో కొందరు భావిస్తున్నారు. జయరామ్ నటనకు సరిగ్గా తెలుగు తెరపై ఆవిష్కరించే క్యారెక్టర్లను దర్శక, రచయితలు ఎప్పుడు రాస్తారో?