Mahesh Babu's Guntur Kaaram 6th Day Collection: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. ఆరు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? బాక్సాఫీస్ దగ్గర ఆరో రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే... 


సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' సినిమాకు మొదటి నుంచి మిక్స్డ్ టాక్ ఉంది. అయితే... మహేష్ బాబు స్టార్ పవర్ థియేటర్లకు ప్రేక్షకులను తీసుకు రావడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. మొదటి నాలుగు రోజులు సినిమాకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చాయి. సంక్రాంతి సెలవులు పూర్తయ్యాక కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఆరు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే... 


'గుంటూరు కారం' @ 100 కోట్లు!
'గుంటూరు కారం' సినిమా షేర్ 100 కోట్లు చేరుకుంది. బుధవారం ఈ సినిమాకు 7 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం నాటికి ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (షేర్) సుమారు 93 కోట్లు. బుధవారం షేర్ యాడ్ చేస్తే... వంద కోట్లు పూర్తి అయ్యింది. 


Also Read: సీడెడ్, గుంటూరులో లాభాల్లోకి 'నా సామి రంగ' - నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందంటే?


సంక్రాంతి తర్వాత 'గుంటూరు కారం' కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ప్రజెంట్ డైలీ ఆరేడు కోట్ల రూపాయల షేర్ వస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 132 కోట్ల రూపాయలకు జరిగింది. డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 133 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి. మరో ఐదారు రోజులు ఇదే విధంగా షేర్ వస్తే కానీ థియేట్రికల్ రైట్స్ కొన్న వాళ్లకు లాభాలు రావు. ఈ శుక్రవారం కొత్త సినిమాలు ఏమీ లేవు కనుక అంత రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. మరి, ఎలా ఉంటుందో చూడాలి.


Also Readఅరెరే వేరే కథతో ప్రభాస్ 'రాజ్ సాబ్' సినిమా తీస్తున్నా - ఫన్నీగా స్పందించిన మారుతి


మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఇంతకు ముందు 'అతడు', 'ఖలేజా' సినిమాలు చేశారు. ఆ రెండూ కల్ట్ క్లాసిక్ ఫిలిమ్స్ స్టేటస్ సొంతం చేసుకున్నాయి. అందుకని, సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి 'గుంటూరు కారం' మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరో & దర్శకుడు  కలిసి చేస్తున్న సినిమా కావడం... పైగా టీజర్, ట్రైలర్ మాసీగా ఉండటంతో... అంచనాలు మరింత పెరిగాయి. అయితే... వాటిని అందుకోవడంలో సినిమా ఘోరంగా ఫెయిల్ అయ్యింది.



'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల కథానాయిక. మీనాక్షి చౌదరి అతిథిగా సందడి చేశారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, వెన్నెల కిశోర్, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సునీల్ ఒక్క సన్నివేశంలో కనిపించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) సినిమా ప్రొడ్యూస్ చేశారు.