Naa Saami Ranga Collection Worldwide: కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'నా సామి రంగ' బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లు రాబడుతోంది. పండుగ సెలవులు పూర్తి అయిన తర్వాత కూడా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో సినిమా సక్సెస్ అయ్యింది. ఇటు నిర్మాతకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తీసుకు వస్తోంది.


సీడెడ్, గుంటూరులో లాభాల్లోకి 'నా సామి రంగ' 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... మొదటి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన 'నా సామి రంగ' సినిమా, మూడో రోజు 3.58 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. నాలుగో రోజు రూ. 3.17 షేర్ వచ్చింది. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఎంత షేర్ వచ్చిందనేది చూస్తే... 



  • నైజాం (తెలంగాణ) - రూ. 85 లక్షలు

  • సీడెడ్ (రాయలసీమ) - రూ. 51 లక్షలు

  • విశాఖ (ఉత్తరాంధ్ర) - రూ. 47 లక్షలు

  • ఈస్ట్ గోదావరి - రూ. 42 లక్షలు

  • వెస్ట్ గోదావరి - రూ. 21 లక్షలు

  • కృష్ణ - రూ. 23 లక్షలు

  • గుంటూరు - రూ. 31 లక్షలు

  • నెల్లూరు - రూ. 17 లక్షలు


Also Read: అరెరే వేరే కథతో ప్రభాస్ 'రాజ్ సాబ్' సినిమా తీస్తున్నా - ఫన్నీగా స్పందించిన మారుతి


గుంటూరు, సీడెడ్ (రాయలసీమ) డిస్ట్రిబ్యూటర్లకు 'నా సామి రంగ' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యింది. ఐదు రోజు నుంచి వచ్చే వసూళ్లు అన్నీ లాభాలే. మిగతా ఏరియాల్లో కూడా రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.63 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ చూస్తే... ప్రపంచవ్యాప్తంగా రూ. 30.30 కోట్లు రాబట్టింది.
 
మూడు, నాలుగు రోజుల మధ్య పెద్ద తేడా లేదు!
'నా సామి రంగ' సినిమా మూడు, నాలుగు రోజుల్లో వచ్చిన షేర్ చూస్తే... పెద్దగా తేడా ఏమీ లేదు. రూ. 40 లక్షల డ్రాప్ మాత్రమే కనిపించింది. వారం మధ్యలో సేమ్ షేర్ రాబట్టడం మంచి విషయం. సాధారణంగా వీకెండ్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓపెనింగ్ వీకెండ్ జోరు తర్వాత ఉండదు. కలెక్షన్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. కానీ, ఈ సినిమాకు పెద్ద డ్రాప్ ఏమీ లేదు. ఆదివారం విడుదలైన 'నా సామి రంగ' సినిమాకు వీక్ డేస్ కూడా మంచి వస్తోంది. 


Also Readమహేష్ రికవరీ రేట్ @ 70% - ఐదు రోజుల్లో 'గుంటూరు కారం' వంద కోట్లకు దగ్గరకు వచ్చినా సరే...



'నా సామి రంగ' సినిమా నిర్మాతకు డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ద్వారా సుమారు 33 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసింది. దాంతో థియేట్రికల్ రైట్స్ జస్ట్ 18.5 కోట్లకు ఇచ్చేశారు. ఆల్రెడీ 15.63 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. పండక్కి వచ్చిన సినిమాల్లో బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యే రెండో సినిమా ఇది.