Balakrishna Comments on Hanuman: కుర్ర హీరో తేజ సజ్జ హీరోగా యంగ్ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన మూవీ హనుమాన్‌. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. హనుమాన్ ని వరల్డ్ మూవీ లవర్స్ కి ఓ సూపర్ హీరోగా పరిచయం చేస్తూ ఆడియన్స్‌కి విజువల ట్రీట్‌ ఇచ్చాడు. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్నీ అందుకుంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఈ మూవీ చూసిన ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. హనుమాన్ టేకింగ్‌లో ప్రశాంత్‌ వర్మ పనితనం చూసి అంతా మెచ్చుకుంటున్నారు.


'హనుమాన్' సినిమా చూసి బాలయ్య ఏమన్నారంటే..


తాజాగా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీతో కలిసి 'హనుమాన్‌' సినిమా చూశారు. 'హనుమాన్' స్పెషల్ ప్రీమియర్ షో వేయించుకొని మరి బాలకృష్ణ.. సినిమాని వీక్షించారు. మూవీ చూసిన అనంతరం తన రివ్యూని ప్రకటించారు. సినిమా కన్నుల పండుగలా ఉందని కితాబు ఇచ్చారు. హనుమాన్ సినిమా చూసిన బాలయ్య ఇలా అన్నారు. "ఈ సినిమాలో బోలెడంత కంటెంట్ ఉంది. హనుమాన్‌ టేకింగ్‌లో ప్రశాంత వర్మ బాగా హ్యాండిల్ చేశావు. అంతా ఆంజనేయస్వామి ఆశీస్సులు.. శ్రీరామచంద్రుడి దీవెనలు. సినిమా టేకింగ్ బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలనిపించింది" అని బాలయ్య ప్రశంసలు కురిపించారు.


అలాగే హనుమాన్ సినిమా విషయంలో మీ కాన్ఫిడెంట్‌ హ్యాట్సాఫ్‌ అన్నారు. "సినిమా చాలా బాగా నచ్చింది. రెండున్నరేళ్లు సినిమాను తయడమంటే సాధారణ విషయం కాదు. అందుకు నిర్మాత నిరంజన్ రెడ్డిని అభినందించాలి. డైరెక్టరే కాదు నిర్మాతల సపోర్టు వల్ల కూడా ఈ సినిమా ఇంత బాగా వచ్చింది" అన్నారు. హనుమాన్ సినిమాలో సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుందన్నారు. వీఎఫ్ఎక్స్ కూడా నెక్ట్స్‌ లెవల్‌ అంటూ కొనియాడారు. అలాగే మ్యూజిక్, పాటలు చాలా బాగున్నాయని, మూవీలో ప్రతి నటీనటులు అద్భుతంగా నటించారంటూ టీంను పొగడ్తలతో ముంచెత్తారు. 






కాంబో సెట్‌ అయ్యిందా?


మొత్తానికి హనుమాన్‌ సినిమా అవుట్‌ చాలా చక్కగా ఉందని, అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేలా  ఉందని, హనుమాన్ 2 కోసం వెయింటింగ్ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. బాలయ్య స్పెషల్‌గా హనుమాన్‌ మూవీ చూడటం, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మను పొగడ్తలతో ముంచెత్తడంతో అంతా వీరిద్దరి కాంబినేషన్‌పై చర్చించుకుంటున్నారు. కాగా గతంలో ప్రశాంత్‌ వర్మ-బాలయ్య కాంబోలో ఓ ప్రాజెక్ట్‌ రాబోతుందని, చర్చల దశలో ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అదే గుర్తు చేసుకుంటు ఈ కాంబినేషన్‌ నిజమేనా? అని సందేహిస్తున్నారు. అదే నిజమైతే బాగుండని, మరో బ్లాక్‌బస్టర్‌ పక్కా అంటున్నారు. మరోవైపు ఇప్పిటికే ప్రశాంత్ వర్మ బాలయ్యకి ఓ కథ వినిపించారని, దానికి ఆయన నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. మరి వీరిద్దరి కాంబో సెట్స్‌పైకి వస్తుందా? పుకార్లకే సొంతమవుతుందో చూడాలి.