Crazy Update on Hanuman 2: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'హనుమాన్‌' మూవీ పేరు మారుమోగుతుంది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, కుర్ర హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన ఈసినిమా ఊహించని విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తూ విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. పాన్‌ ఇండియాగా పదుకొండు భాషల్లో విడులైన 'హనుమాన్‌' సంచలన విజయం అందుకుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తక్కువ బడ్జెట్‌లోనే విజువల్‌ వండర్‌ చూపించిన ప్రశాంత్‌ వర్మ పనితనాన్ని కొనియాడుతున్నారు. సూపర్‌ మ్యాన్‌ జానర్‌కు హనుమాన్‌ సెంటిమెంట్‌ జోడించి తెలుగు ఆడియన్స్‌కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. ఇక తేజ సజ్జ యాక్టింగ్‌ ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. 'హనుమాన్‌'లో ప్రశాంత్‌ వర్మ టేకింగ్‌ నెక్ట్‌ లెవల్‌ అంటున్నారు. ఇలా ఊహించని బజ్‌తో ఇప్పటికే బాక్సాఫీసు వద్ద అదే జోరు కనబరుస్తోంది. 


'హనుమాన్ 2'పై బాహుబలి రేంజ్ లో బజ్


బాలీవుడ్‌లోనూ రోజురోజుకు కలెక్షన్స్‌ పెంచుకుంటూ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ సంక్రాంతికి పెద్ద హీరో సినిమాలు ఉన్న హనుమానే ముందంజలో ఉంది. ఇదిలా ఉంటే సినిమా చివరిలో హనుమాన్‌కు సీక్వెల్‌ ఉన్నట్టు వెల్లడించింది మూవీ టీం. అప్పుడే 'జై హనుమాన్‌' పార్ట్‌ 2 టైటిట్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా రివీల్‌ చేశాడు ప్రశాంత్‌ వర్మ. అయితే ఎండ్‌ కార్డులో శ్రీరాముడు ప్రత్యక్షమై హనుమంతుడికి ఓ మాట ఇచ్చినట్టు చూపించి పార్ట్‌ 2పై క్యూరియసిటి పెంచాడు ప్రశాంత్‌. శ్రీరాముడు.. హనుమాన్‌కు ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ ఆడియన్స్ ని తొలచివేస్తుంది. ఈ క్రమంలో పార్ట్‌ 2పై 'బాహుబలి' రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. 'బాహుబలి' టైంలో కట్టప్ప పాత్ర ఎంత ఫేమస్‌ అయ్యిందో.. ఇప్పుడు శ్రీరాముడి రోల్‌పై అంతగా చర్చ జరుగుతుంది. 2025లో సినిమా రిలీజ్‌ చేస్తానన్న ప్రశాంత్‌ వర్మ శ్రీరాముడి పాత్రలో ఎవరిని చూపించబోతున్నాడనే బజ్‌ క్రియేట్‌ అయ్యింది. 


శ్రీరాముడిగా గ్లోబల్ స్టార్?


ఈ క్రమంలో జై హనుమాన్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జై హనుమాన్ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్.. శ్రీరాముడి పాత్రలో నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... రాముడి పాత్రకు రామ్ చరణ్ బాగా సూట్ అవుతారాని అంటున్నారు.శ్రీరాముడి పాత్ర కోసం ప్రశాంత్‌ వర్మ మెగా హీరో అయితే బాగుంటుందని ఆలోచించారట. దాంతో ఆ రోల్‌ రామ్‌ చరణ్‌ అయితే బాగుంటుందని ఆయన టీం సలహా ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... రాముడి పాత్రకు రామ్ చరణ్ బాగా సూట్ అవుతారాని అంటున్నారు. ఎందుకంటే ట్రిపుల్‌ ఆర్‌ అల్లూరి సితారామారాజుగా చెర్రి లుక్‌కు భారీ స్పందన వచ్చింది. 


Also Read: ‘మీర్జాపూర్‌ 3’ వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?


రామరాజు పాత్రలో చెర్రి లుక్‌ చూసి అటూ నార్త్‌ ఆడియన్స్‌ సైతం అల్లాడిపోయారు. దీంతో శ్రీరాముడిగా పాత్రకు చరణ్‌ బాగా సూటు అవుతాడంటూ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. మరి నిజంగానే రాముడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తే.. ఫ్యాన్సుకు మాత్రం పండగే అని చెప్పవచ్చు. మరోవైపు హనుమంతుడి పాత్రపై కూడా ఆసక్తి నెలకొంది. సినిమాలో హనుమంతుడు ఎవరనేతి చూపించకుండా సస్పెన్స్‌ పెంచాడు ప్రశాంత్‌ వర్మ. దీంతో హనుమంతుడి పాత్రపై ఓ రేంజ్‌లో చర్చ జరుగుతుంది. కొందరు హనుమాన్‌గా చిరంజీవి అయితే బాగుంటుందంటుంటే మరికొందర ఆదిపురుష్‌లో చేసిన హనుమాన్‌ పాత్ర నటుడి అయితే బాగుంటుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ వార్తలపై క్లారిటీ కోసం మెగా ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మరి శ్రీరాముడు, హనుమాన్‌ పాత్రలకు ఎవరూ ఫైనల్‌ అవుతారో చూడాలి.