Controversy On Singer Chithra: సింగర్ చిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాటలు పాడి మధుర గాత్రంతో ఎంతో మంది హృదయాలను ఆకట్టుకున్నారు. దశాబ్ధాలకుపైగా తన పాటలతో అలరిస్తున్న చిత్రకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ‘దక్షిణ భారత నైటింగేల్’ అనే బిరుదును కూడా అందుకున్నారు. అంతేకాదు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు.
అలా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమామానాన్ని పొందిన చిత్రపై తాజాగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ఇచ్చిన ఓ సందేశం కాంట్రవర్సీకి దారి తీసింది. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతుంది. ఆలయం ప్రారంభోత్సవానికి దేశమంత రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ వేడుకకు హజరావ్వాలంటూ దాదాపు ఏడువేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
Also Read: 'హనుమాన్' స్వీక్వెల్‌పై క్రేజీ అప్‌డేట్! - శ్రీరాముడి పాత్రలో ఆ మెగా హీరో?
సినీ, రాజకీయ ప్రముఖలతో సాహిత్య, సామాజిక ప్రముఖలకు ఆహ్వానాలు అందాయి. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీకి అలాగే బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు ఇటూ సౌత్‌లో ధనుష్, రజనీకాంత్ ఇలా పలువురికి ఇన్విటేషన్స్ అందింది. ఈ సందర్భంగా రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రతి ఒక్కరు శ్రీరాముడి కీర్తనలు పాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు చిత్ర మాట్లాడుతూ.. "ప్రాణప్రతిష్ఠ రోజున శ్రీరాముడి కీర్తనలు ఆలపించండి. సాయంత్రం వేళ ఇళ్లలో ప్రమిదలతో 5 దీపాలు వెలిగించండి" అంటూ రెండు రోజుల క్రితం వీడియో రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా చిత్ర 'లోకా సమస్థా సుఖినోభవంతు' అంటూ వీడియో ముగించారు. ఈ వీడియోపై ఓ వర్గం నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. ఆమె వీడియోపై దీనిపై రాజకీయాలను ఆపాదిస్తూ విమర్శల దాడికి దిగుతున్నారు. దీంతో ఇప్పుడు చిత్ర పేరు సోషల్ మీడియాకు ఎక్కింది. అయితే అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఓ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం జరుగుతున్న కార్యక్రమమని, దానికి మీలాంటి వారు సపోర్టుగా ఉండటం సరైంది కాదంటున్నారు.
Also Read: ఆ స్టార్ హీరోయిన్స్‌తో ఎఫైర్ - వారిలో మాజీ విశ్వసుందరి కూడా, పేర్లు బయటపెట్టిన డైరెక్టర్
సామాజంలో మంచి పేరు, స్థాయిలో ఉన్న మీ లాంటి వారు ప్రమోట్ చేయడమేంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చిత్రపై జరుగుతున్న దాడి నేపథ్యంలో కొందరు ఆమె మద్దతుగా నిలబడుతున్నారు. కేరథ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు ఆమె సపోర్టు చేస్తున్నాయి. అంతేకాదు ఓ వర్గం నెటిజన్లు, ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలబడ్డాయి. సోషల్ మీడియాలో చిత్రపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.