Prabhas Raja Saab Movie Story: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పటి వరకు లుక్ విడుదల చేయడం తప్ప మరొక విషయం ఏదీ యూనిట్ చెప్పలేదు. అయితే... సినిమా కథ ఇదేనంటూ ఐఎండీబీ వెబ్ సైట్ ఓ స్టోరీ లైన్ పబ్లిష్ చేసింది. దానిపై దర్శకుడు మారుతి ఫన్నీగా స్పందించారు.
అరెరే, వేరే కథతో సినిమా తీస్తున్నా...
ఐఎండీబీ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా?
ఐఎండీబీ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన కథనం ప్రకారం... ప్రేమలో పడిన ఓ జంట చుట్టూ 'రాజా సాబ్' కథ తిరుగుతుంది. హీరో హీరోయిన్లు ప్రేమలో ఉన్నప్పటికీ... నెగెటివ్ ఎనర్జీ కారణంగా వాళ్ల విధి రాతలు ఎలా మారాయి? అనేది సినిమా కథ అట! దర్శకుడు మారుతి దృష్టికి ఈ స్టోరీ లైన్ రావడంతో ఆయన ఫన్నీగా స్పందించారు.
''అరెరే... నాకు ఈ ప్లాట్ (స్టోరీ లైన్) తెలియదు. అందుకని, వేరే కథతో షూటింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఐఎండీబీ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా మరి?'' అని మారుతి ఫన్నీగా సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ (X)లో ట్వీట్ చేశారు.
Also Read: మహేష్ రికవరీ రేట్ @ 70% - ఐదు రోజుల్లో 'గుంటూరు కారం' వంద కోట్లకు దగ్గరకు వచ్చినా సరే...
Raja Saab Actress: 'రాజా సాబ్' సినిమాలో హీరోయిన్ ఒక్కరు కాదు... నిజం చెప్పాలంటే ముగ్గురు ఉన్నారు. 'ఇస్మార్ట్ శంకర్' ఫేమ్ నిధి అగర్వాల్ ఓ భామ కాగా... మాళవికా మోహనన్ మరొక హీరోయిన్. 'రాధే శ్యామ్'లో చిన్న క్యారెక్టర్ చేసిన రద్ధీ కుమార్ ఇంకో రోల్ చేస్తున్నారు. అయితే... ఆ ముగ్గురి పేర్లను చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, వాళ్లు షూటింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి.
మారుతి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా
'రాజా సాబ్' సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 'బాహుబలి' నుంచి ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. అయితే... దర్శకుడు మారుతికి ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని ప్రభాస్ అభిమానులు తమ హీరోని ఏ విధంగా అయితే చూడాలని కోరుకుంటున్నారో... అటువంటి సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.
Also Read: హిందీ డబ్బింగ్ సినిమాల్లో 'హనుమాన్' నయా రికార్డ్ - కుంభస్థలాన్ని బద్దలుకొడుతున్న తేజ సజ్జ
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న 'రాజా సాబ్' చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్ మాస్టర్: కింగ్ సోలొమన్, వీఎఎఫ్ఎక్స్: ఆర్.సి. కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా.వాసుదేవ లెంబూరు, ప్రొడక్షన్ కంట్రోలర్: యోగానంద్ దుద్దుకూరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఎస్కేఎన్, ఛాయాగ్రహణం: కార్తీక్ పళని, సంగీతం: తమన్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన - దర్శకత్వం: మారుతి.